Ayurvedic remedies: వర్షాకాలంలో వచ్చే గొంతు నొప్పి నుంచి వేగంగా ఉపశమనం పొందాలంటే..

ఈ కాలంలో ముఖ్యంగా డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్‌ వ్యాధులు వర్షాకాలంలో పొంచి వుంటాయి. వీటితోపాటు దగ్గు, జలుబు, జ్వరం, అలసట, నీరసం, తలనొప్పి వంటివి ఈ కాలంలో వేధిస్తుంటాయి. సాధారణంగా ఈ కాలంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ సమస్యలన్నీ..

Ayurvedic remedies: వర్షాకాలంలో వచ్చే గొంతు నొప్పి నుంచి వేగంగా ఉపశమనం పొందాలంటే..
Ayurvedic Remedies
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 25, 2022 | 10:01 PM

How to improve Strong immunity: గత కొన్ని రోజులుగా ఢిల్లీతోపాటు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. అధిక వర్షాల కారణంగా రోడ్లపై నీరు చేరి ట్రాఫిక్‌ను పెంచడమే కాకుండా అనేక అనారోగ్య సమస్యలను కూడా తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా డెంగ్యూ, చికెన్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్‌ వ్యాధులు వర్షాకాలంలో పొంచి వుంటాయి. వీటితోపాటు దగ్గు, జలుబు, జ్వరం, అలసట, నీరసం, తలనొప్పి వంటివి ఈ కాలంలో వేధిస్తుంటాయి. సాధారణంగా ఈ కాలంలో రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఈ సమస్యలన్నీ తలెత్తుతుంటాయి. మెడిసిటీ హాస్పిటల్‌కు చెందిన సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ జీ గీతా కృష్ణన్‌ ఏంచెబుతున్నారంటే..

వర్షాకాలంలో ఇలా చేశారంటే వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు.. వర్షాకాలంలో గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాల్లో మొదటిది సరైన ఆహార అలవాట్లు. రెండోది శుభ్రమైన నీళ్లు తాగడం. ఈ కాలంలో నీళ్లు ఖచ్చితంగా మరగపెట్టి తాగడం అలవాటు చేసుకోవాలి. అలాగే పెరుగు వంటి పులియబెట్టిన ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండాలి. ఇలాంటి ఆహారాలు తీసుకోవడం వల్ల గట్ ఇన్ఫెక్షన్లు, స్కిన్‌ అలెర్జీలు దాడి చేస్తాయి.

మితంగా తినాలి వర్షాకాలంలో ఆహారం ఎప్పుడూ మితంగానే తీసుకోవాలి. అలాగే ఉప్పు కూడా ఎక్కువగా తినకూడదు. దీనితోపాటు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. వర్షాకాలంలో సాధారణంగా తేలికపాటి జ్వరం వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు.. ఒక లీటరు నీళ్లలో టీస్పూన్ అల్లం పొడి కలిపి మరిగించాలి. ఈ నీటిని వేడిగా తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. ఐతే రోజు అదేపనిగా ఈ కషాయాన్ని అధికంగా తాగ కూడదు. అదేవిధంగా నీళ్లలో మరిగించి కొత్తిమీర గింజల (ధనియాలు)లను కూడా వేసి మరిగించిన నీటిని తాగవచ్చు. దీనిని కూడా రోజూ తాగకూడదు. జ్వరంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ నీళ్లను తాగితే జ్వరం నయమవుతుంది. ఇక ఈ కాలంలో స్కిన్‌ అలెర్జీలు, ఫంగస్ రావడం కూడా సాధారణమే. వీటి నివారణకు వేప ఆకుల పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఈ పేస్టును స్నానికి ముందు శరీరానికి అప్లై చేసి, ఆ తర్వాత స్నానం చేస్తే చర్మ సంబంధిత సమస్యలన్నీ దూరమవుతాయి.

ఇవి కూడా చదవండి

గొంతు నొప్పి గొంతునొప్పిగా ఉంటే.. అర కప్పు వేడి పాలల్లో, టీస్పూన్ పసుపుకలిపి తాగారంటే గొంతు నొప్పి ఇట్టే మాయమవుతుంది. రుచి కోసం కొంచెం తేనె కలుపుకోవచ్చు.

గొంతునొప్పికి ప్రముఖ ఆయుర్వేద్ నిపుణురాలు డాక్టర్ పూజా సబర్వాల్ మరో చిట్కా సూచిస్తున్నారు. అదేంటంటే..

వర్షాకాలంలో సంభవించే గొంతు నొప్పి వల్ల ఏదైనా తినాలన్నా, మింగాలన్నా చాలా కష్టంగా ఉంటుంది. సాధారణంగా గొంతునొప్పి దానంతట అదే నయం కావడానికి వారం రోజులు పడుతుంది. ఐతే ఈ ఆయుర్వేద వైద్యం పాటిస్తే వేగంగా నయం చేయవచ్చు. ఎలా తయారు చేయాలంటే.. మిరియాలు (10), అల్లం (అర అంగుళం), తులసి (10 ఆకులు), రెండు గ్లాసుల నీళ్లు.. వీటన్నింటినీ ఒక పాత్రలో వేసి సగానికి తగ్గే వరకు మరిగించాలి. చల్లారాక కొంచెం కొంచెంగా రోజంతా తాగాలి. ఇలా చేస్తే గొంతు నొప్పి వేగంగా తగ్గుముఖం పడుతుంది. రోగనిరోధక శక్తి తగ్గినప్పడు ఇటువంటి అనారోగ్యాలు దాపురిస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో మూలకాలన్నీ సమతుల్యంగా ఉండాలి. ఆయుర్వేదం ఈ వ్యాధులకు చక్కని పరిష్కారాన్ని చూపుతుందని డాక్టర్ పూజా సబర్వాల్ సూచిస్తున్నారు.