AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. సింపుల్‌గా పురాతన కాలం నాటి ఖీర్‌ రెసిపీ.. ఇదొక్కటి వేస్తే టేస్ట్ అదిరిపోద్ది..

మిలాద్-ఉన్-నబి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇంట్లోనే రుచికరమైన రైస్ ఖీర్‌ లేదా పాయసం తయారుచేసుకోవచ్చు. పాలు, బియ్యం, పంచదార, నెయ్యి, యాలకులు, డ్రై ఫ్రూట్స్‌తో తయారయ్యే ఈ సంప్రదాయ తీపి వంటకం ఎంతో రుచిగా ఉంటుంది. ఖీర్ సిద్ధమైన తర్వాత నెయ్యిలో వేయించిన జీడిపప్పు, బాదం, కిస్మిస్‌తో అలంకరిస్తే పండుగ వంటకం మరింత రుచికరంగా మారుతుంది.

మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. సింపుల్‌గా పురాతన కాలం నాటి ఖీర్‌ రెసిపీ.. ఇదొక్కటి వేస్తే టేస్ట్ అదిరిపోద్ది..
Traditional Rice Kheer Recipe
Shaik Madar Saheb
|

Updated on: Aug 25, 2026 | 9:29 PM

Share

మిలాద్-ఉన్-నబి.. ఇస్లామిక్ క్యాలెండర్‌లోని ఒక ముఖ్యమైన పండుగ. ఇస్లాంలో చివరి ప్రవక్త అయిన ముహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు ఈ మిలాద్-ఉన్-నబి పండుగను ఘనంగా నిర్వహిస్తారు. ఇస్లామిక్ కేలండర్ ప్రకారం మూడో నెల అయిన ‘రబీ-ఉల్-అవ్వల్’ మాసంలో ఈ వేడుకలను నిర్వహిస్తారు. బుధవారం ఈ పండుగ తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశవ్యాప్తంగా నిర్వహించనున్నారు. అయితే.. ఈ పవిత్రమైన పండుగ నాడు.. అనేక సాంప్రదాయ వంటకాలు తయారుచేస్తారు. వాటిలో రైస్ ఖీర్ (లేదా పాయసం) ఒక ముఖ్యమైన తీపి వంటకం. బియ్యం, పాలు, పంచదార, సుగంధ ద్రవ్యాలతో తయారుచేసే ఈ ఖీర్, దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో విభిన్న పేర్లతో, కొద్దిపాటి మార్పులతో ప్రసిద్ధి చెందింది.

కావలసిన పదార్థాలు

పాలు: 1 లీటర్, బియ్యం, 1/4 కప్పు (శుభ్రంగా కడిగి నానబెట్టాలి), చక్కెర: 1/3 కప్పు (రుచికి సరిపడా), నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు, యాలుకల పొడి, డ్రై ఫ్రూట్స్: బాదం, జీడిపప్పు, పిస్తా (తరిగినవి)..

ఖీర్ తయారీ విధానం చాలా సులభం..

ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టాలి.. ఆ తర్వాత బరకగా రుబ్బుకోవాలి.. తరువాత, పాలను మరిగించాలి.. పాలు మరుగుతున్నప్పుడు, బరకగా రుబ్బుకున్న బియ్యాన్ని వేసి మృదువుగా ఉడికించాలి. బియ్యం పేస్టు ఉండలు కట్టకుండా గరిటెతో తిప్పుతూ ఉండాలి.

ఈ మిశ్రమం మంచిగా చిక్కబడిన తరువాత, పంచదార, యాలకుల పొడి, కావాలంటే కొన్ని కేసర్ రేకులు జోడించి మరింత రుచిని పెంచవచ్చు. నెయ్యిలో వేయించిన జీడిపప్పు, బాదం, కిస్మిస్ వంటి డ్రై ఫ్రూట్స్‌తో అలంకరిస్తే, ఖీర్ మరింత ఆకర్షణీయంగా, రుచిగా తయారవుతుంది.

బియ్యంతో పాటు వేయించిన డ్రై ఫ్రూట్స్‌తో చేసిన పాయసం అద్భుతమైన రుచిని అందిస్తుంది. ఈ పాయసం, శరీరానికి బలాన్నిచ్చే మంచి కొవ్వులతో సమృద్ధిగా ఉంటుంది.

ఇంకెందుకు ఆలస్యం మిలాద్-ఉన్-నబి పండుగ సందర్భంగా మీరు కూడా ఈ రుచికరమైన తీపి వంటకాన్ని తయారుచేసి ఆస్వాదించండి..

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
గుండెకు హత్తుకునే సాహిత్యం.. భోగి నుంచి నయా ఫోక్ బ్లాక్‌బస్టర్..!
గుండెకు హత్తుకునే సాహిత్యం.. భోగి నుంచి నయా ఫోక్ బ్లాక్‌బస్టర్..!
ఒక్క మ్యాచ్‌లోనే మూడు రికార్డులను తిరగరాసేసిన టీమిండియా
ఒక్క మ్యాచ్‌లోనే మూడు రికార్డులను తిరగరాసేసిన టీమిండియా
10 నిమిషాలు ఉప్పుపై నిలబడితే ఏమవుతుంది? అద్భుతమైన ప్రయోజనాలు!
10 నిమిషాలు ఉప్పుపై నిలబడితే ఏమవుతుంది? అద్భుతమైన ప్రయోజనాలు!
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ చనిపోతే అకౌంట్లోని సొమ్ము ఎవరికి..?
ఖాతాదారుడు, నామినీ ఇద్దరూ చనిపోతే అకౌంట్లోని సొమ్ము ఎవరికి..?
భారత్ ఓటమికి కారణాలివేనా?
భారత్ ఓటమికి కారణాలివేనా?
కెప్టెన్‏గా సుధీర్.. ఝాన్సీ నిర్ణయంతో అగ్ని పరీక్షకు టీంకు షాక్..
కెప్టెన్‏గా సుధీర్.. ఝాన్సీ నిర్ణయంతో అగ్ని పరీక్షకు టీంకు షాక్..
నవరాత్రుల స్పెషల్ స్వీట్.. కమ్మని రుచితో సగ్గుబియ్యం సేమియా పాయసం
నవరాత్రుల స్పెషల్ స్వీట్.. కమ్మని రుచితో సగ్గుబియ్యం సేమియా పాయసం
గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?
గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?
ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. భారీ బందోబస్తు..
ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. భారీ బందోబస్తు..
రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. పొందటం ఈజీ
రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. పొందటం ఈజీ