October 09, 2026
Subhash
.ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ఆరోగ్య సమస్యల్లో హైబీపీ ఒకటి. ఆహారపు అలవాట్లు, అధిక ఉప్పు తీసుకోవడం, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వంటి అంశాలు రక్తపోటుపై ప్రభావం చూపుతాయి.
వెల్లుల్లిలో ఉండే అలిసిన్ వంటి సమ్మేళనాలు గుండె ఆరోగ్యానికి మేలు చేయవచ్చని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. వెల్లుల్లి తినడం వల్లే బీపీ పూర్తిగా అదుపులోకి వస్తుందని భావించకూడదు
పాలకూర, మెంతికూర వంటి ఆకుకూరల్లో పొటాషియం, ఫోలేట్ తదితర పోషకాలు ఉంటాయి. ఇవి రక్తనాళాలు, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుంది.
బీట్‌రూట్‌లో సహజ నైట్రేట్లు ఉంటాయి. ఇవి శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తికి సహాయపడి రక్తనాళాలు విశ్రాంతి తీసుకోవడంలో తోడ్పడవచ్చు. బీపీ చికిత్సకు ప్రత్యామ్నాయం మాత్రం కాదు.
అరటిపండ్లు, నారింజ, దానిమ్మ వంటి పండ్లలో శరీరానికి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా అరటిపండ్లలో పొటాషియం లభిస్తుంది. రోజువారీ ఆహారంలో పండ్లను చేర్చుకోవడం గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
గుమ్మడికాయ గింజలు, బాదం, వాల్‌నట్స్‌లో మెగ్నీషియం, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు ఉంటాయి. వీటిని ఉప్పు కలపని రూపంలో కొద్దిగా తీసుకోవచ్చు.
ఓట్స్, కందిపప్పు, పెసరపప్పు, శనగలు వంటి ఆహారాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇవి కడుపు నిండిన భావనను కలిగించడంతో పాటు సమతుల్య ఆహారంలో భాగంగా గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి.
హైబీపీని అదుపులో ఉంచడానికి పోషకాహారంతో పాటు ఉప్పు తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును నియంత్రించడం, తగినంత నిద్రపోవడం కూడా ముఖ్యం. బీపీని క్రమం తప్పకుండా కొలవండి.