Bigg Boss 10 Telugu : ఆట మార్చిన ఝాన్సీ.. కెప్టెన్‌గా సుధీర్.. అగ్ని పరీక్ష బ్యాచ్‌కు రక్తకన్నీరే..
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. హౌస్‌లో నామినేషన్లు, కెప్టెన్సీ టాస్కులు, గ్రూప్ వార్‌లతో వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల నుంచి తప్పించుకోవడానికి, హౌస్‌లో పవర్‌ను చేజిక్కించుకోవడానికి కంటెస్టెంట్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన హోరాహోరీ కెప్టెన్సీ టాస్కుల్లో విజయం సాధించి సుధీర్ రెడ్డి బిగ్‌బాస్ హౌస్‌కు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కెప్టెన్సీ టాస్కులు, నామినేషన్లతోపాటు అటు లవ్ ట్రాక్స్ సైతం పట్టాలెక్కాయి. ముఖ్యంగా హగ్గులు, రొమాన్స్ తో మరింత చిరాకు తెప్పిస్తున్నారు కంటెస్టెంట్స్. తాజాగా శుక్రవారం రాత్రి జరిగిన ఎపిసోడ్ లో హౌస్ కెప్టెన్ అయ్యాడు సుధీర్. అతడికి సపోర్ట్ ఇవ్వడానికి ఝాన్సీ ముందుకు రావడంతో అగ్ని పరీక్ష టీంకు ఊహించని షాక్ తగిలింది. . ముఖ్యంగా చివరల్లో నిలిచిన ముకేశ్–ఝాన్సీ, షాలిని–రోహిత్ జంటల మధ్య త్యాగాల కోణం కనిపిస్తే, మరోవైపు స్వార్థం బయటపడింది. ముకేశ్‌ను కాపాడుకోవడానికి ఝాన్సీ తాను స్వచ్ఛందంగా డేంజర్ జోన్‌లోకి వెళ్లగా.. షాలిని, రోహిత్ మధ్య ఎవరు డేంజర్ జోన్‌లోకి వెళ్లాలనే అంశంపై వాడీవేడి చర్చ జరిగింది. చివరకు రోహిత్ రిస్క్ తీసుకుని డేంజర్ జోన్‌కు వెళ్లాడు. ఆ తర్వాత నిర్వహించిన ‘ఫ్లిప్ చెయ్.. ఫేస్ చెయ్’ అనే టాస్కులో రామ్ ప్రసాద్, నరేష్ గెలిచినప్పటికీ.. మైండ్ గేమ్‌లో రామ్ ప్రసాద్ సేఫ్ అయి నామినేషన్ల నుంచి తప్పించుకోగా, నరేష్ ప్రమాదంలో పడ్డాడు.
కెప్టెన్సీ రేసులోకి రామ్ ప్రసాద్, దేబ్జానీ, అమన్, వర్షిణి, వంశీ, త్రిగుణ్, సుధీర్ రెడ్డి అర్హత సాధించారు. అయితే ఏడుగురిలో ఇద్దరు తప్పుకోవాలన్న బిగ్‌బాస్ ఆదేశంతో అమన్, రోహిత్ , ఇతర గ్రూప్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వ్యూహాత్మకంగా వర్షిణి, అమన్‌లను పక్కకు తప్పించి ఐదుగురితో ప్రధాన కెప్టెన్సీ టాస్క్ ప్రారంభించారు. ‘షిప్ మేకింగ్’ టాస్కులో బిన్ బ్యాగులలో ఉన్న విడిభాగాలను బయటకు తీసి షిప్ తయారు చేసే క్రమంలో ఫిజికల్ బలం కంటే చాకచక్యమే కీలకంగా మారింది. తొలి దశలోనే త్రిగుణ్, దేబ్జానీ తప్పుకోగా.. తుది రేసులో సుధీర్, వంశీ, రామ్ ప్రసాద్ నిలిచారు.
ఈ వారం మ్యాజిక్ పవర్‌తో నామినేషన్ల నుంచి సేఫ్ అయినప్పటికీ కెప్టెన్సీ అవకాశాన్ని కోల్పోయిన ఝాన్సీ.. తెలివిగా సుధీర్ రెడ్డికి సపోర్టర్ గా వ్యవహరించింది. ఆమె వేగవంతమైన సహాయంతో, సుధీర్ ఎంతో పక్కా ప్లానింగ్‌తో షిప్‌ను పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచాడు. విజయం సాధించిన వెంటనే తనకు మార్గదర్శకంగా నిలిచిన రామ్ ప్రసాద్ కాళ్లకు సుధీర్ నమస్కరించడం హౌస్‌మేట్స్‌ను ఆకట్టుకుంది. బిగ్‌బాస్ ఆయనకు కెప్టెన్సీ గోల్డ్ మెడల్ అందించారు.
ఈ విజయంతో హౌస్‌లోని ‘అగ్నిపరీక్ష’ బ్యాచ్ తీవ్ర నిరాశలో మునిగిపోయింది. తమ వర్గం నుంచి ఎవరూ కెప్టెన్ కాకపోవడమే కాకుండా, వ్యూహాత్మకంగా సుధీర్ రెడ్డి పవర్ సాధించడంతో రాబోయే రోజుల్లో తమ పై చేయి కోల్పోతామనే భయం వారిలో స్పష్టంగా కనిపించింది. సుధీర్ కెప్టెన్సీలో హౌస్ రూల్స్, రేషన్ నియమాలు , నామినేషన్ల వ్యూహాలు ఎలా మారబోతున్నాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఎక్కువమంది చదివినవి: Bathukamma Song : యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న మంగ్లీ కొత్త బతుకమ్మ పాట.. గంటల్లోనే
