Bhogi Movie: భోగి ఫస్ట్ సింగిల్‌తో పూనకాలు తెప్పించిన భీమ్స్, చంద్రబోస్.. నెట్టింట ఊపేస్తున్న ఎగిలివారంగా సాంగ్..
యంగ్ హీరో శర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్‌లో వస్తున్న పీరియాడిక్ మూవీ ‘భోగి’ నుంచి మొదటి పాట ‘ఎగిలి వారంగా’ విడుదలైంది. 1960ల కాలం నాటి పల్లెటూరి వాతావరణం, జానపద సొగసులతో సాగిన ఈ పాట వీక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించిన ఈ చిత్రం నవంబర్ 12న విడుదల కానుంది.

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శర్వానంద్ మాస్ అండ్ రస్టిక్ యాక్షన్ అవతార్‌లో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘భోగి’. మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై టాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోగా, తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మ్యూజికల్ ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ క్రమంలో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘ఎగిలి వారంగా’ పాటను అధికారికంగా విడుదల చేశారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో 1960ల కాలం నాటి పల్లెటూరి వాతావరణాన్ని, గ్రామీణ జీవన విధానాన్ని ఈ పాటలో అద్భుతంగా ఆవిష్కరించారు. తాజాగా విడుదలైన ఎగిలివారంగా పాట ఆరంభం నుంచే అచ్చమైన పల్లెటూరి అనుభూతిని ఇస్తుంది.
ఎక్కువమంది చదివినవి: Bathukamma Song : యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న మంగ్లీ కొత్త బతుకమ్మ పాట.. గంటల్లోనే
ఊరి ప్రజల రోజువారీ కష్టం, వారి వృత్తులు, కుటుంబ బంధాలు, అప్పటి కాలంలో పటేల్ వ్యవస్థ పట్ల గ్రామస్తులు చూపించే గౌరవం, అలాగే రాచరిక దౌర్జన్యాలు ఎలా ఉండేవో పాటలోని దృశ్యాలు కళ్లకు కట్టాయి. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్ నాటు పల్లెటూరి గెటప్స్‌లో చాలా సహజంగా ఒదిగిపోయారు. ఈ పాటకు ఆస్కార్ విజేత చంద్రబోస్ అందించిన సాహిత్యం అతిపెద్ద అసెట్‌గా నిలిచింది. పల్లె అందాలను, గ్రామస్తుల మనస్తత్వాలను తన పదాల కూర్పుతో ఆయన అద్భుతంగా ఆవిష్కరించారు. ఇక ఫోక్ బీట్స్ అందించడంలో స్పెషలిస్ట్ అయిన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మరోసారి తన మార్క్ మాస్ ట్యూన్‌తో శ్రోతలను అలరించారు.
ఎక్కువమంది చదివినవి: Jaya Prada: ఆ హీరోకు అత్తగా నటించా.. అతడు అంటే నాకు పిచ్చి ఇష్టం.. జయప్రద..
నల్గొండ గద్దర్ నరసన్న, కందుకూరి శంకర్ బాబు, రేలారే గోపాల్ తమ శక్తివంతమైన గొంతుతో ఈ పాటను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లారు. పక్కా లోకల్ జానపద శైలిలో సాగే ఈ ట్రాక్ మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటోంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డింపుల్ హయతి మరో కథానాయికగా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాను నవంబర్ 12, 2026న థియేటర్లలో భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదటి పాటతోనే భోగి సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి.
ఎక్కువమంది చదివినవి: Nana Patekar : నా ఆస్తి ఆ 12 ఎండు కట్టలే.. నేను ముందే పక్కన పెట్టుకున్నా.. నానా పటేకర్ వీడియో షేర్ చేసిన ఆర్జీవీ..
ఎగిలివారంగా సాంగ్..
ఎక్కువమంది చదివినవి: Bathukamma Song : యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న మంగ్లీ కొత్త బతుకమ్మ పాట.. గంటల్లోనే
