Summer Tips: ఎండల నుంచి ఉపశమనం కావాలా..? వాతావరణ శాఖ సూచనలివే..!
ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాలు నిప్పుల కుంపటిగా మారాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తీర ప్రాంతాల్లో ఉక్క పోత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఇలా ఉంటే.. మరి ముందుంది మండే కాలం అంటుంది భారత వాతావరణ శాఖ. ఏప్రిల్, మే తో పాటు జూన్లో మాన్సూన్ వచ్చేవరకు ఎండలను భరించాల్సిందేనని అంటుంది.

Sun Intensity
ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాలు నిప్పుల కుంపటిగా మారాయి. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. తీర ప్రాంతాల్లో ఉక్క పోత ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలోనే ఇలా ఉంటే.. మరి ముందుంది మండే కాలం అంటుంది భారత వాతావరణ శాఖ. ఏప్రిల్, మే తో పాటు జూన్లో మాన్సూన్ వచ్చేవరకు ఎండలను భరించాల్సిందేనని అంటుంది. వచ్చేది వడగాల్పుల సీజన్. మరి ఎండలు ఇదే స్థాయిలో కొనసాగితే.. పిల్లలు, వృద్దులకు వడదెబ్బ తప్పేలా లేదు. దీంతో ఎండ నుంచి ఉపశమనానికి భారత వాతావరణ శాఖ.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసింది.
వడ గాలులు వీచే సమయంలో చేయవలసిన చర్యలు..
- వడ గాలులు వస్తాయో లేదో తెలుసుకోవడానికి స్థానిక వాతావరణ సూచన కోసం ప్రసారమాధ్యమాలను ఫాలో అవ్వాలి.
- వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. దాహం వేయకపోయినా సరే.
- తేలికైన, లేత-రంగు, వదులుగా ఉన్న కాటన్ దుస్తులను ధరించండి. ఎండలో బయటకు వెళ్లేటప్పుడు కళ్లజోళ్లు, గొడుగు, టోపీ, బూట్లు, చప్పల్స్ ఉపయోగించాలి.
- ప్రయాణాలు చేస్తున్నప్పుడు తప్పనిసరిగా.. మీతో పాటు నీటిని తీసుకెళ్లాలి.
- ఒకవేళ ఎండ తగులుతున్న చోట పనిచేస్తున్న వారైతే.. టోపీ/ గొడుగు ఉపయోగించాలి. తల, మెడ, ముఖం, అవయవాలపై తడి వస్త్రాన్ని వినియోగించాలి. ORS గానీ ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, తోరణి (బియ్యం నీరు), నిమ్మకాయ నీరు, మజ్జిగ మొదలైనవి వాడాలి, ఇవి శరీరాన్ని తిరిగి హైడ్రేట్ చేయడానికి సహాయపడతాయి.
- వడదెబ్బ , వేడి దద్దుర్లు లేదా వేడి వలన తిమ్మిర్లు వంటి బలహీనత, మైకము, తలనొప్పి, వికారం, చెమటలు, మూర్ఛలు వంటి సంకేతాలను గుర్తించాలి. అనారోగ్యంగా అనిపిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
- జంతువులను నీడలో ఉంచి, వాటికి పుష్కలంగా నీరు ఇవ్వాలి.
- ఇంటిని చల్లగా ఉంచడానికి కర్టెన్లు, షట్టర్లు / సన్‌షేడ్‌లను ఉపయోగించాలి. రాత్రి కిటికీలను తెరవాలి.
- ఫ్యాన్లు, తడి దుస్తులను వాడాలి. తరచుగా చల్లటి నీటితో స్నానం చేయాలి.
- పని ప్రదేశానికి సమీపంలో చల్లని తాగు నీటిని అందించాలి.
- ప్రత్యక్ష సూర్యకాంతి నివారించేందుకు కార్మికులు జాగ్రత్త వహించాలి.
- కష్టతరమైన ఉద్యోగాలను రోజులోని చల్లని సమయాలకు షెడ్యూల్ మార్పు చేసుకోవాలి.
- విశ్రాంతి / విరామం వ్యవధిని పెంచుతూ బహిరంగ కార్యకలాపాల వ్యవధిని తగ్గించాలి.
- గర్భిణీ స్త్రీలు / వైద్య పరిస్థితి ఉన్న కార్మికులు అదనపు శ్రద్ధ వహించాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..