- Telugu News Photo Gallery Do you know many health benefits of Watermelon seeds, check here is details in Telugu
Watermelon Seeds: పుచ్చకాయతో పాటు గింజల్ని కూడా తినేస్తున్నారా.. జరిగేది ఇదే!
వేసవిలో ఎక్కువగా లభించే పండ్లలో పుచ్చకాయ కూడా ఒకటి. పుచ్చకాయలు అంటే చాలా మందికి ఇష్టం. వేసవి కాలంలో శరీరంలో వేడిని తగ్గించేవాటిల్లో ఈ పండు కూడా ఒకటి. పుచ్చకాయ తినడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉండటమే కాకుండా చల్లగా ఉంటుంది. చాలా మంది తెలిసీ తెలియక పుచ్చకాయతో పాటు గింజల్ని సైతం తినేస్తూ ఉంటారు. ఇంకొంత మంది మాత్రం విసిరి పారేస్తారు. పుచ్చకాయే కాదు ఇందులోని గింజలు తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పుచ్చకాయ విత్తనాలు తినడం..
Updated on: Apr 03, 2024 | 4:54 PM

వేసవిలో ఎక్కువగా లభించే పండ్లలో పుచ్చకాయ కూడా ఒకటి. పుచ్చకాయలు అంటే చాలా మందికి ఇష్టం. వేసవి కాలంలో శరీరంలో వేడిని తగ్గించేవాటిల్లో ఈ పండు కూడా ఒకటి. పుచ్చకాయ తినడం వల్ల శరీరం హైడ్రేట్‌గా ఉండటమే కాకుండా చల్లగా ఉంటుంది.

చాలా మంది తెలిసీ తెలియక పుచ్చకాయతో పాటు గింజల్ని సైతం తినేస్తూ ఉంటారు. ఇంకొంత మంది మాత్రం విసిరి పారేస్తారు. పుచ్చకాయే కాదు ఇందులోని గింజలు తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పుచ్చకాయ విత్తనాలు తినడం వల్ల.. డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది.

పుచ్చకాయతో పాటు ఈ గింజలు కూడా తింటే.. ఎప్పుడూ యంగ్‌గా ఉంటారు. చర్మం బిగుతుగా, ముడతలు రాకుండా చేస్తుంది. ఈ గింజల్లో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి.

ఈ గింజలు తినడం వల్ల పురుషుల్లో సంతానోత్పత్తిని పెంచుతుంది. అలాగే మెమోరీ పవర్‌ను సైతం పెంచేందుకు సహాయ పడుతుంది. మతిమరుపు సమస్య ఉన్నవారు ఈ గింజల్ని తింటే చాలా మంచిది. పిల్లల్లో కూడా ఏకాగ్రత పెరుగుతుంది.

అధిక రక్త పోటుతో బాధ పడేవారు పుచ్చకాయ గింజల్ని తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఈ గింజల్లో ఉండే అర్జినిన్ రక్త పోటును నియంత్రించడంలో ఎఫెక్టీవ్‌గా పనిచేస్తుంది. అలాగే జీవ క్రియను కూడా మెరుగు పరుస్తుంది.




