ఇంట్లో మామిడి చెట్టు ఉంటే.. మీ జుట్టు సమస్యలన్నీ తీరిపోయినట్టే..! ఒత్తైన నల్లటి కురుల కోసం ఇలా చేయండి..
జుట్టు దృఢత్వం కోసం మీరు ఎప్పుడైనా మామిడి ఆకులను ఉపయోగించారా? షాక్ అవ్వకండి .. నిజంగానే మామిడి ఆకులు జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి జుట్టుకు అవసరమైన విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-ఇని అందిస్తాయి. కాబట్టి జుట్టుకు మామిడి ఆకులను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.
జుట్టు రాలిపోవడం, త్వరగా నెరిసి పోవటం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్యలు. మీరు కూడా జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నట్టయితే. జుట్టుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఒకదాని తర్వాత ఒకటి సమస్యలు వస్తాయి. మీరు మీ జుట్టు మరింత డ్యామేజ్ అయ్యేలా ఇంకో కెమికల్ షాంపూ వేయకండి. బదులుగా మామిడి ఆకులతో చేసిన ఈ హెయిర్ మాస్క్ ప్రయత్నించండి. రసాయనాలతో తయారు చేసిన షాంపుతో మీ జుట్టు పరిస్థితి మరింత క్షీణిస్తుంది. మామిడి ఆకులను ఉపయోగించి జుట్టు సమస్యలకు పరిష్కారం దిశగా ప్రయత్నించండి. మామిడి ఆకుల్లో విటమిన్-ఎ, సి, బి ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి, జుట్టుకు మేలు చేస్తాయి. మీరు జుట్టు పెరుగుదలకు సహాయపడే ఈ ఆకుల నుండి హెయిర్ మాస్క్‌లను తయారు చేసుకోవచ్చు. మామిడి ఆకుల హెయిర్ మాస్క్‌ను ఎలా తయారు చేయాలో, దాని ప్రయోజనాలను తెలుసుకుందాం.
ప్రతి ఒక్కరూ ఒత్తైన, పొడవాటి, మెరిసే జుట్టుకావాలని కోరుకుంటారు. కానీ, ఈ రోజుల్లో జీవనశైలి చాలా మారిపోయినందున జుట్టు రాలడం సర్వసాధారణం. మీరు జుట్టు పెరుగుదలకు అనేక నివారణలు ప్రయత్నిస్తారు. అయితే, జుట్టు దృఢత్వం కోసం మీరు ఎప్పుడైనా మామిడి ఆకులను ఉపయోగించారా? షాక్ అవ్వకండి .. నిజంగానే మామిడి ఆకులు జుట్టు రాలడాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి. ఇవి జుట్టుకు అవసరమైన విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-ఇని అందిస్తాయి. కాబట్టి జుట్టుకు మామిడి ఆకులను ఎలా ఉపయోగించాలో ఇక్కడ తెలుసుకుందాం.
మామిడి ఆకులతో హెయిర్ మాస్క్ తయారు చేసి అప్లై చేయడం వల్ల జుట్టుకు మంచి నిగారింపు రావడంతో పాటు జుట్టు దృఢంగా మారుతుంది. మామిడి ఆకుల మాస్క్ సిద్ధం చేయడానికి కావలసిన పదార్థాలు
మామిడి ఆకులు, ఉసిరి పొడి, గోరింట పొడి, కొబ్బరి నూనె.
తయారుచేసే విధానం..
ముందుగా మామిడి ఆకులను శుభ్రంగా కడగాలి. ఇప్పుడు వాటిని పేస్ట్‌లా చేసి, అందులో పెరుగు, ఉసిరి పొడి, హెన్నా పౌడర్, కొబ్బరి నూనె కలపాలి. ఇప్పుడు దీన్ని జుట్టుకు పట్టించి 20-30 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
జుట్టుకు మామిడి ఆకుల వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. మామిడి ఆకుల్లో విటమిన్-ఎ, విటమిన్-సి తగినంత పరిమాణంలో ఉంటాయి. జుట్టు పెరుగుదలకు సహాయపడే ముఖ్యమైన అంశాలు ఇవి. ఇవన్నీ జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి.
మామిడి ఆకుల్లోని పోషకాలు జుట్టు రాలడాన్ని నియంత్రిస్తాయి. మామిడి ఆకుల పేస్ట్‌ని తలకు అప్లై చేయడం వల్ల జుట్టు వేగంగా పెరుగుతుంది. అంతే కాదు స్కాల్ప్‌లో బ్లడ్ సర్క్యులేషన్‌ను మెరుగుపరుస్తుంది, ఇది సహజంగా జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..