నోరూరించే చాక్లెట్ కస్టర్డ్ రెసిపీ.. మీ పిల్లలకు ఇంట్లోనే తయారు చేసి పెట్టొచ్చు.. ఎలాగంటే..?
వేసవికాలం వచ్చిందంటే చాలు పిల్లలకు సెలవులు వచ్చేస్తాయి. దీంతో వారు ఇంట్లోనే ఉండి మిమ్మల్ని రకరకాల వంటకాలు చేయమని డిమాండ్ చేస్తూ ఉంటారు.

వేసవికాలం వచ్చిందంటే చాలు పిల్లలకు సెలవులు వచ్చేస్తాయి. దీంతో వారు ఇంట్లోనే ఉండి మిమ్మల్ని రకరకాల వంటకాలు చేయమని డిమాండ్ చేస్తూ ఉంటారు. రోజు తినే అన్నం పప్పు కూర మాత్రమే కాదు అప్పుడప్పుడు వెరైటీలు కావాలంటూ పిల్లలు మారం చేయడం అనేది సహజం. అలా అని బయట ఫుడ్ తినిస్తే మాత్రం జబ్బులు రావడం ఖాయం. . మరి ఇంట్లోనే పిల్లలు కోరినప్పుడల్లా వెరైటీ వంటకాలను చేయాలని అనుకుంటున్నారా అయితే చాక్లెట్ కస్టర్డ్ పుడ్డింగ్ ఓసారి ట్రై చేసి మీ పిల్లలకు తినిపించండి. మరి ఈ రుచికరమైన చాక్లెట్ కస్టర్డ్ పుడ్డింగ్, మ్యాంగో ఐస్ క్రీం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.
కావాల్సిన పదార్థాలు:
-అర కప్పు కస్టర్డ్ పౌడర్ (వనిల్లా రుచి)
-పావు కప్పు కోకో పౌడర్
-ముప్పావు కప్పు చక్కెర
-5 కప్పుల పాలు
-1 కప్పు క్రీమ్/మలై
-ముందుగా, ఒక గిన్నెలో అర కప్పు కస్టర్డ్ పౌడర్, పావు కప్ కోకో పౌడర్, ముప్పావు కప్పు చక్కెర తీసుకోండి.
– 1 కప్పు పాలు వేసి, ఒక గరిట ఉపయోగించి కలపాలి.
– మృదువైన ముద్ద లేని మిశ్రమాన్ని ఏర్పరుచుకోండి.
– సిద్ధం చేసుకున్న చాక్లెట్ కస్టర్డ్ మిశ్రమాన్ని కడాయిలో పోయాలి.
– 1 కప్పు క్రీమ్, 4 కప్పుల పాలు జోడించండి, క్రీమ్ జోడించడం వల్ల పుడ్డింగ్ రిచ్, క్రీమీగా మారుతుంది.
-మంటను తక్కువగా ఉంచండి, నిరంతరం కదిలిస్తూ ఉండండి.
– మిశ్రమం మెత్తగా, సిల్కీగా మారే వరకు కదిలించడం కొనసాగించండి.
-మిశ్రమం చిక్కగా, నిగనిగలాడే వరకు తక్కువ మంట మీద ఉడికించాలి. సుమారు 15 నుండి 20 నిమిషాలు పడుతుంది.
– చాక్లెట్ కస్టర్డ్ పుడ్డింగ్‌ను చిన్న కప్పుల్లోకి తీసుకోండి.
– పూర్తిగా సెట్ చేయడానికి రిఫ్రిజిరేటర్‌లో 2 గంటలు ఉండనివ్వండి.
– ఇప్పుడు కోకో పౌడర్‌తో చల్లి వైట్ చాక్లెట్‌తో అలంకరించండి.
– చివరగా, స్ట్రాబెర్రీతో గుడ్డు లేని చాక్లెట్ కస్టర్డ్ రెసిపీని ఆస్వాదించండి.
మ్యాంగో ఐస్ క్రీమ్:
మార్కెట్లో లభించే ఐస్ క్రీమ్ లో పాల శాతం చాలా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా అందులో వెజిటేబుల్ ఆయిల్ ను జోడించి రకరకాల రసాయనాలతో తయారు చేస్తూ ఉంటారు అందుకే బయట మార్కెట్లో లభించే ఐస్క్రీమ్లు తినడం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇంటివద్దె మీ పిల్లలకు చిక్కటి పాలతో మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు:
-ఒక లీటరు పాలు,
-చైనా గ్రాస్: 10 గ్రాములు ( సూపర్ మార్కెట్లో లభిస్తుంది)
-చక్కెర: ఒక కప్పు,
-బాదం పప్పు: పావు కప్పు,
-యాలకుల పొడి: పావు టీస్పూన్,
-ముక్కలు చేసిన డ్రైఫ్రూట్స్: ఒక టేబుల్ స్పూన్.
-రెండు బంగినపల్లి మామిడి పళ్ల గుజ్జు..
చైనా గ్రాస్‌ను పది నిమిషాలపాటు నీళ్లలో నానబెట్టాలి. బాదం పప్పును మెత్తగా పొడి చేసుకోవాలి. స్టవ్‌మీద పాన్ పెట్టి పాలు పోసి మరుగుతుండగా చక్కెర, బాదం పొడి వేయాలి. అడుగు పట్టకుండా కలుపుతూ ఉండాలి. పాల మిశ్రమం కాస్త దగ్గరపడ్డాక యాలకుల పొడి, మెదిపిన చైనా గ్రాస్ వేసి మరో ఐదు నిమిషాలు సన్నని మంటపై కలుపుతూ ఉడికించి దించేయాలి. ఆ మిశ్రమం చల్లారిన తర్వాత అందులో మామిడి పండు గుజ్జును పోసి పైనుంచి డ్రైఫ్రూట్స్ ముక్కలు వేసి 4-5 గంటలపాటు డీప్ ఫ్రిజర్ లో పెట్టాలి. గట్టిపడిన మిశ్రమాన్ని ముక్కలుగా కోసుకుంటే చల్లచల్లని మాంగో ఐస్ క్రీం సిద్ధం. దీనిలో పోషక విలువలు అపారంగా ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం