Summer Skin Care Tips: ఇతర సీజన్లతో పోల్చుకుంటే వేసవిలో చర్మ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా విపరీతమైన ఎండ, చెమట కారణంగా ముఖం ట్యానింగ్ (Skin Tanning) కు గురవుతుంది. దీనివల్ల ఫేస్ నల్లగా, అందవిహీనంగా మారిపోయింది. ఇక చర్మంపై జిడ్డు పేరుకుపోవడం వల్ల మొటిమలు, నల్లటి మచ్చలు కూడా ఏర్పడుతాయి. అందుకే వేసవిలో చర్మ సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పాటించాలంటారు స్కిన్ కేర్ నిపుణులు. ఇందుకోసం సీజనల్ పండ్ల సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ పండ్లలో ఉండే హైడ్రేటింగ్ లక్షణాలు ట్యానింగ్ తదితర చర్మ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక సమ్మర్‌లో శరీరానికి చల్లదనం అందించే పుచ్చకాయ (Watermelon) అయితే చర్మానికి మరీ మంచిదంటున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈక్రమంలో సమ్మర్ సీజన్‌లో పుచ్చకాయతో అనేక రకాల ఫేస్ ప్యాక్ (Face Packs) లను తయారు చేసుకోవచ్చు. మరి అవేంటో తెలుసుకుందాం రండి.
పుచ్చకాయ, దోసకాయ..
ఈ రెండు పండ్లలో నీటి శాతం అధికంగా ఉంటాయి. అందుకే ఇవి శరీరానికే కాకుండా చర్మానికి కూడా ఆరోగ్యం కలిగిస్తాయి. ఈ రెండు పండ్లను కలిపి ఫేస్ ప్యాక్ ఎలా తయారుచేసుకోవాంటే.. ముందుగా రెండింటినీ బాగా తురమాలి. ఆతర్వాత ఒక గిన్నెలో రసం తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, చేతులకు పట్టించాలి. కొన్ని నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితముంటుంది.
పుచ్చకాయ, పెరుగు..
పుచ్చకాయ స్కిన్ ట్యానింగ్‌ను తొలగించడంలో సమర్థంగా పనిచేస్తుంది. ఇక పెరుగు కూడా చర్మ సంరక్షణలో మెరుగ్గా పనిచేస్తుంది. ఈ ఫేస్ ఫ్యాక్ తయారీ కోసం .. ఒక గిన్నెలో రెండు చెంచాల పెరుగు తీసుకుని దానికి మూడు చెంచాల పుచ్చకాయ రసం మిక్స్ చేయండి. ఈ ప్యాక్‌ను ముఖానికి అప్లై చేసిన తర్వాత అరగంట తర్వాత చల్లటి నీటితో తొలగించండి. ఈ ఫేస్ ప్యాక్‌తో చర్మంపై ముడతలు కూడా తొలగిపోతాయి. వారంలో కనీసం రెండు సార్లు ఈ ఫ్యాక్‌ను అప్లై చేయండి.
పుచ్చకాయ, పాలు..
పాలలో ఉండే గుణాలు చర్మ సంరక్షణలో బాగా తోడ్పడుతాయి. అందుకే పాలను నేచురల్ క్లెన్సర్ అని కూడా అంటారు. పాలను సరైన పద్ధతిలో మరియు క్రమం తప్పకుండా ముఖానికి పట్టిస్తే, కొద్ది రోజుల్లోనే ముఖం మిలమిలా మెరుస్తుంది. ఇక పుచ్చకాయలో పాలు కలిపి ముఖానికి రాసుకుంటే, రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చు. ఇందుకోసం ఒక గిన్నెలో మూడు చెంచాల పాలు తీసుకుని అందులో రెండు చెంచాల పుచ్చకాయ రసం కలపాలి. ఈ ప్యాక్‌ను ముఖంపై 15 నిమిషాల పాటు అలాగే ఉంచి, ఆపై మృదువుగా చేతులతో మసాజ్ చేయండి. కొద్ది సేపటి తర్వాత సాధారణ నీళ్లతో ముఖాన్ని కడుక్కుంటే మెరిసే చర్మాన్ని పొందవచ్చు.
RRR Movie: వారణాసిలో ఆర్‌ఆర్‌ఆర్ చిత్రబృందం.. పవిత్ర గంగానది ఒడ్డున ప్రత్యేక పూజలు..