AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Magnesium deficiency: మెగ్నీషియం లోపం ఉంటే.. శరీరం 6 సంకేతాలు ఇస్తుంది.. నిర్లక్షం వద్దు సుమా

శరీరంలో మెగ్నీషియం ఒక ముఖ్యమైన ఖనిజం. జీవక్రియ ప్రక్రియలలో, ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది. శరీరంలో మెగ్నీషియం లోపం చాలా ప్రమాదకరం. ఈ విషయంపై పెద్దగా దృష్టి పెట్టారు. ఈ నేపధ్యంలో శరీరంలో కొన్ని లక్షణాల పట్ల శ్రద్ధ చూపిస్తే.. మెగ్నీషియం లోపాన్ని గుర్తించవచ్చు. తద్వారా సమస్య పెరగకుండా నిరోధించవచ్చు. మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు శరీరంలో ఏ లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం.

Magnesium deficiency:  మెగ్నీషియం లోపం ఉంటే.. శరీరం 6 సంకేతాలు ఇస్తుంది.. నిర్లక్షం వద్దు సుమా
Magnesium Deficiency
Surya Kala
|

Updated on: Aug 21, 2025 | 1:16 PM

Share

మెగ్నీషియం మన శరీరానికి చాలా ముఖ్యమైనది. అయితే మంచి ఆహారం తీసుకోకపోవడం వలన శరీరంలో దాని లోపం ఏర్పడటం ప్రారంభమవుతుంది. రక్త పరీక్ష లేకుండా మెగ్నీషియం లోపాన్ని గుర్తించలేమని భావిస్తారు. అయితే శరీరంలో మెగ్నీషియం లోపం సంకేతాలు కనిపిస్తాయి. ఈ లక్షణాల సహాయంతో మెగ్నీషియం లోపాన్ని గుర్తించవచ్చని మీకు తెలుసా..

అవును శరీరంలో మెగ్నీషియం లేకపోవడం వల్ల, అనేక సమస్యలు మొదలవుతాయి. మన శరీరం మనకు కొన్ని సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది. మెగ్నీషియం లోపం ఉన్నప్పుడు శరీరంలో ఏ లక్షణాలు కనిపిస్తాయో తెలుసుకుందాం.

కండరాల నొప్పులు, వణుకు ఇది మెగ్నీషియం లోపం అతి ముఖ్యమైన లక్షణం. కండరాల సడలింపు , సంకోచాన్ని నియంత్రించడంలో మెగ్నీషియం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీని లోపం కలిగినప్పుడు కండరాలు మరింత చురుగ్గా మారతాయి. అంతేకాదు బాధాకరమైన తిమ్మిర్లు, వణుకు వస్తుంది. ఈ లక్షణం రాత్రి సమయంలో కాళ్ళ కండరాలలో ఎక్కువగా కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

అలసట, కండరాల బలహీనత నిరంతరం అలసట, నీరసం నిద్ర లేకపోవడం వల్ల మాత్రమే కాదు. మెగ్నీషియం లోపం వల్ల కూడా కలుగుతుంది. కణాలకు సరైన మొత్తంలో శక్తి లభించదు. ఇది శారీరక, మానసిక అలసట, బద్ధకం, సోమరితనానికి దారితీస్తుంది. అలాగే కండరాల బలహీనత కూడా ఈ కారణంగానే సంభవిస్తుంది.

క్రమరహిత హృదయ స్పందన గుండె కండరాల సరైన పనితీరుకు మెగ్నీషియం చాలా ముఖ్యమైనది. మెగ్నీషియం లోపం వల్ల క్రమరహిత హృదయ స్పందన కలుగుతుంది. అంటే హృదయ స్పందన వేగంగా ఉండడం, హృదయ స్పందన నేమ్మదించడం లేదా అసాధారణ హృదయ స్పందన అనుభూతి వంటివి ఉంటాయి. ధమనులు పూర్తిగా విశ్రాంతి తీసుకోలేకపోవడంతో రక్తపోటు కూడా పెరుగుతుంది.

ఒత్తిడి, ఆందోళన నాడీ వ్యవస్థకు మెగ్నీషియం చాలా ముఖ్యమైనది. అందువల్ల దీని లోపం కారణంగా ఒత్తిడి, విశ్రాంతి లేకపోవడం, భయము, ఆందోళన వంటి సమస్యలు పెరగడం ప్రారంభమవుతాయి.

మైగ్రేన్, తలనొప్పి తరచుగా తీవ్రమైన మైగ్రేన్లతో బాధపడేవారిలో మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉన్నట్లు లెక్క. మెగ్నీషియం రక్త నాళాలు , న్యూరోట్రాన్స్మిటర్ల సంకోచాన్ని నియంత్రించడం ద్వారా మైగ్రేన్ దాడులను నివారించడానికి సహాయపడుతుంది.

ఎముకలు బలహీనపడటం. ఎముకల ఆరోగ్యానికి కాల్షియం తర్వాత మెగ్నీషియం రెండవ అతి ముఖ్యమైన ఖనిజం. ఇది కాల్షియం శోషణ, ఎముక నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. మెగ్నీషియం లోపం నేరుగా ఎముక సాంద్రతను తగ్గిస్తుంది, దీనివల్ల ఎముకలు బలహీనపడతాయి. బోలు ఎముకల వ్యాధి ప్రమాదం పెరుగుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)