మహాకాళుడి శివలింగం నుంచి పడిన గంజాయి అలంకారం.. ఏదైనా విపత్తుకి ఇది సంకేతమా..
ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు వెరీ వెరీ స్పెషల్. ఇక్కడ భస్మ హారతితో ప్రసిద్ది చెందింది. అంతేకాదు అకాల ముత్యువు దోషం తొలగిపోతుందని నమ్మకం. అటువంటి విశేషమైన మహాకాళుడి శివలింగం అలంకారం అకస్మాత్తుగా విరిగి పడిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇలా అలంకారం పడిపోవడం ఏదైనా విపత్తుకు సంకేతంగా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది. ఇదే విషయంపై జ్యోతిష్కులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం.

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ప్రపంచ ప్రఖ్యాత మహాకాళేశ్వర ఆలయం ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది. 2025 ఆగస్టు 18న (సోమవారం) రాత్రి 8 గంటలకు ఆలయంలో పూజారులు బాబా మహాకాళుడి శివలింగాన్ని గంజాయితో అలంకరిస్తుండగా.. అకస్మాత్తుగా అలంకారం విరిగి పడిపోయింది. పూజారులు వెంటనే దానితోనే శివయ్యని మళ్ళీ అలంకరించి హారతి ఇచ్చారు. జ్యోతిష్కులు దీనిని అసహజ సంఘటనకు సంకేతంగా పిలుస్తుండగా.. ఆధ్యాత్మిక వేత్తలు గంజాయిని మహాకాళుడే వదిలివేసాడని చెబుతున్నారు.
ఉజ్జయిని జ్యోతిష్కుడు అమర్ త్రివేది మాత్రం ఇది అసహజ సంఘటనకు సంకేతం అని అంటున్నారు. ఈ సంఘటన వెనుక రెండు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నారు. దేవతలు తమకు నచ్చిన ఏ పదార్థాన్నైనా అంగీకరిస్తారు. ఏదైనా పదార్థం తయారీలో పొరపాటు జరిగినా లేదా దానిని భక్తితో తయారు చేయకపోయినా లేదా మంచి ఉద్దేశ్యంతో తయారు చేయకపోయినా లేదా దానికి దైవ ప్రభావం లేకపోయినా దానిని దేవుడు అంగీకరించరని.. ఆ పదార్థాన్ని విస్మరిస్తారని చెబుతున్నారు.
ఈ ఘటన వెనుక శాస్త్రీయ రీజన్ ఏమిటంటే జ్యోతిషాచార్య అమర్ త్రివేది ప్రకారం మనం సైన్స్ గురించి మాట్లాడుకుంటే రాళ్ళకు సొంతంగా తేమ కలిగే గుణం ఉంటుంది. రాళ్లకు అంతర్గత తేమ, అంతర్గత వేడి గుణాలు ఉంటాయి. బాహ్య తేమ, వేడితో కూడిన గంజాయిని రాయిపై పూసినప్పుడు.. కొన్నిసార్లు అది పడిపోయే అవకాశం ఉంది. అదే సమయంలో మహాకాళ ఆలయ పూజారులు, ఆలయ కమిటీకి సంబంధించిన వ్యక్తులు ఈ సంఘటన గురించి ఏమీ చెప్పకుండా తప్పించుకున్నారు.
శివలింగాన్ని గంజాయితో అలంకరించడం గురించి శాస్త్రాలు ఏమి చెబుతున్నాయి? ఈ సంఘటన గురించి మహర్షి పాణిని వేద విద్యా సంస్థాన్ మాజీ వైస్ ఛాన్సలర్ తో పాటు సనాతన ధర్మంపై నిపుణుడు మాజీ డివిజనల్ కమిషనర్ డాక్టర్ మోహన్ గుప్తా మాట్లాడుతూ హిందూ మతంలోని ఏ గ్రంథంలోనూ శివలింగానికి గంజాయితో అలంకరించినట్లు ప్రస్తావన లేదని అన్నారు. దీనిని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. మహాకాళుడి శివలింగాన్ని అలంకరించడానికి గంజాయిని ఉపయోగించవద్దు శివ పురాణం , లింగ పురాణంలో ఎక్కడా దీని గురించి ప్రస్తావనలేదు. ఇలాంటి సంప్రదాయం లేదు. శివలింగాన్ని అలంకరించడానికి గంజాయిని ఉపయోగించడం లింగం కోతకు కారణమవుతుంది. శివలింగంపై చాలా గంటలు ఈ భాంగ్ ని పూయడం వలనే అని చెబుతున్నారు.
డాక్టర్ మోహన్ గుప్తా ప్రకారం పూజారులు , పండితులు ఈ గ్రంథాల ఆధారాన్ని అంగీకరించడం లేదు. ఇప్పుడు అలంకరణ దానంతట అదే పడిపోయింది. మహాకాళుడు స్వయంగా ఈ గంజాయి అలంకారాన్ని అంగీకరించడం లేదనడానికి ఇదే సంకేతం అని అంటున్నారు. భాంగ్ తో అలంకరణ సముచితం కాదు. దానిని ఆపాలి. ఇప్పుడు పరిపాలన సిబ్బంది, పూజారులు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని చెప్పారు.
శివలింగం అలంకారం పడిపోతున్న వీడియో
సుప్రీం కోర్టు మహాకాళ ఆలయ కమిటీకి సూచనలు .. 2020 సంవత్సరంలో శివలింగం కోతకు సంబంధించి దాఖలైన పిటిషన్‌ను విచారించే సమయంలో సుప్రీంకోర్టు మహాకాళ ఆలయ కమిటీకి స్పష్టమైన సూచనలు ఇచ్చింది. నిర్ణీత పరిమాణంలో పంచామృతాన్ని అందించాలని, గంజాయితో సహా ఇతర పదార్థాల వాడకాన్ని నియంత్రించాలని కోర్టు కోరింది. అయినప్పటికీ, ప్రస్తుతం ఈ సూచనలను పూర్తిగా పాటించడం లేదు. శివలింగంపై నిర్దేశించిన దానికంటే ఎక్కువ గంజాయిని పూయడం వల్ల అలంకారం పడిపోయిందని కొంతమంది భావిస్తున్నారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








