- Telugu News Photo Gallery Spiritual photos Nail biting is not only a psychological habit but also affected graha doshas
Astro Tips: గోళ్లు కొరికే అలవాటుకి ఈ రోజే గుడ్ బై చెప్పండి.. లేదంటే ఈ గ్రహ దోషాలతో ఎన్ని సమస్యలను ఎదుర్కోవాలంటే
గోళ్లు కొరకడం అనేది ఒక సాధారణ అలవాటు. ఇది చెడు అలవాటు. అయినా సరే ఈ అలవాటు ఎక్కువగా పిల్లలతో పాటు యువకుల్లో కూడా కనిపిస్తుంది. ఈ ఆలవాటు అనేక ఆరోగ్య సమస్యలకు కారణం అని అందరికీ తెలిసిందే..అయితే గోళ్లు తినడం లేదా కొరకడం వలన గ్రహ దోషాలు వస్తాయనే విషయం చాలా మందికి తెలియదు. ఈ రోజు గోళ్ళు కోరికే అలవాటు వలన ఏ గ్రహం ప్రభావితం అవుతుందో తెలుసుకుందాం..
Updated on: Aug 21, 2025 | 10:27 AM

గోళ్ళు కొరికే అలవాటు ఉన్నవారు, వాటిని కొరకాలనే కోరిక కలగకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా కత్తిరించుకుంటూ ఉండాలి. మార్కెట్లో ఒక ప్రత్యేకమైన నెయిల్ పాలిష్ అందుబాటులో ఉంది.ఇది చేదుగా ఉంటుంది. దీన్ని పూయడం వల్ల గోళ్ళు కొరకాలనే కోరిక తగ్గుతుంది. సాధారణఃగా ఒత్తిడికి గురైనప్పుడు, ఆందోళన చెందినప్పుడు గోళ్లు కొరుకడం జరుగుతుంది. కాబట్టి యోగా, ధ్యానం వంటివి చేయడానికి ప్రయత్నించాలి. మీ గోళ్లు కొరుకుకోవాలనే కోరిక కలిగినప్పుడు మీ చేతులను బిజీగా ఉంచడానికి బాల్ పాయింట్ పెన్ను లేదా మరేదైనా వస్తువు చేతిలోకి తీసుకోండి.

గోళ్లు కొరకడం ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అంతేకాదు గోళ్లు కొరికే అలవాటు జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. గ్రహాలు అశాంతి చెందుతాయి. దీని ప్రభావం జాతకంపై కనిపిస్తుంది. గోళ్లు కొరకడం వల్ల సూర్య గ్రహం ప్రభావితమవుతుంది. సూర్య గ్రహం ప్రభావితమైతే మీలో ఆత్మవిశ్వాసం లేకపోవడం, కెరీర్‌లో అడ్డంకులను ఎదుర్కోవడం వంటి సమస్యల బారి పడతారు.

సూర్యుడు బలహీనంగా ఉంటే మీరు నిర్ణయాలు తీసుకోవడంలో సమస్యలను ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా మీ తండ్రితో మీకు విభేదాలు ఉండవచ్చు.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోర్లు కొరకడం శని దోషానికి సంకేతం. దీని అర్థం శని మీపై చెడు దృష్టి కలిగి ఉంటాడు. దీని వల్ల జీవితంలో అనేక సమస్యలు వస్తాయి. గోళ్లు కొరికే వ్యక్తులకు జీవితంలో డబ్బు కొరత ఏర్పడుతుంది. వీరు తరచుగా ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే ఈ అలవాటును వెంటనే మానేయడం మంచిది.

గోర్లు కొరకడం వల్ల శరీరంలో అనేక వ్యాధులు వస్తాయి. వివిధ రకాల బ్యాక్టీరియా, క్రిములు, దుమ్ము మన గోళ్ళలో, వేళ్ల చర్మంపై పేరుకుపోతాయి. గోర్లు కొరికినప్పుడు ఈ క్రిములు మన కడుపులోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల కడుపు లోపాలు, ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధులు వస్తాయి.

గోళ్ళు కొరకడం వలన సూర్య దోషం మాత్రమే కాదు శని దోషం రావచ్చు. గోర్లు కొరకడం శని దోషం లక్షణం కావచ్చు. అంటే శనీశ్వర చెడు దృష్టి మీపై ఉందని అర్థం. వీలైనంత త్వరగా ఈ అలవాటును వదులుకోవాలని పండితులు సూచిస్తున్నారు.




