AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇవి మీ ఇంట్లో ఉంటే అదృష్టం మీ వెంటే..! ఇక తిరుగులేదు.. డబ్బే డబ్బు..!

ఇంట్లో రంగురంగుల చేపల్ని పెంచడం కేవలం అందం కోసమే కాదు.. అదృష్టం కోసం కూడా చేస్తారు. వాస్తు, ఫెంగ్‌షుయ్ ప్రకారం కొన్ని చేపలు సంపదను, శాంతిని ఆకర్షిస్తాయని నమ్మకం ఉంది. ఈ చేపలు ఇంట్లో ఉంటే శుభ ఫలితాలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాంటి అదృష్టకర చేపల గురించి తెలుసుకుందాం.

ఇవి మీ ఇంట్లో ఉంటే అదృష్టం మీ వెంటే..! ఇక తిరుగులేదు.. డబ్బే డబ్బు..!
Aquarium Fish Vastu
Prashanthi V
|

Updated on: May 11, 2025 | 2:33 PM

Share

ఇంట్లో చేపల్ని పెంచే అలవాటు చాలా మందిలో ఉంటుంది. ముఖ్యంగా అక్వేరియంలో రంగు రంగుల చేపలు ఉండటం చూడటానికి బాగుంటుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన చేపలు ఉంటే అదృష్టం కూడా కలిసివస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.

డ్రాగన్ ఫిష్ ఇంట్లో పెంచితే మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం ఉంది. వాస్తు ప్రకారం ఈ చేప సంపదను ఆకర్షిస్తుందని చెబుతారు. దాంతో పాటు ఇంట్లో శ్రేయస్సు పెరుగుతుంది.

గోల్డ్ ఫిష్ ఉండటం వల్ల ఇంట్లో ప్రశాంతత వస్తుంది. అదృష్టం కూడా కలుగుతుంది. దీని వల్ల ధనసంపత్తి పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు రావు అని కూడా అంటున్నారు.

బ్లాక్ మూర్ గోల్డ్ ఫిష్.. ఇది ఇంట్లో ఉన్నప్పుడు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. చెడు దృష్టి ప్రభావం తగ్గుతుంది. ప్రశాంతతతో పాటు ఇంట్లో మంచి వాతావరణం ఏర్పడుతుంది. అదృష్టం కలగడం సహజమే అని అంటున్నారు.

కోయ్ ఫిష్ ఇంట్లో పెంచితే అదృష్టం వస్తుందని నమ్మకం ఉంది. ఇది పాజిటివ్ శక్తిని తీసుకురాగలదు. ఈ చేప ధన లాభానికి తోడ్పడుతుంది. ఇల్లు ఆనందంగా మారుతుంది.

ఫ్లవర్ హార్న్ ఫిష్.. ఈ చేపల్ని ఇంట్లో పెంచితే అదృష్టం చేకూరుతుంది. ఫెంగ్ షుయ్ లో కూడా ఈ చేపలను మంచి సంకేతంగా చెబుతారు. ఇది ఇంటికి శాంతిని తీసుకురాగలదు.

మొల్లిస్ చేపలు.. నలుపు రంగు లేదా సిల్వర్ రంగులో ఉండే మొల్లిస్ చేపలు ఇంట్లో ఉన్నప్పుడు సానుకూల శక్తి చుట్టూ వ్యాపిస్తుంది. ఇంట్లో నిండుగా శుభ వాతావరణం ఏర్పడుతుంది. ఆర్థిక సమస్యలు తగ్గుతాయని చెబుతారు.

ఏంజెల్ చేపలు ఇంట్లో ఉంటే మంచి అందం వస్తుంది. ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది. అదృష్టం కూడా వస్తుందంటారు. వీటిని ఇంట్లో ఉంచితే వాతావరణం కూడా కూల్‌గా ఉంటుందట.

బెట్టా ఫిష్ చాలా అందంగా కనిపిస్తాయి. ఈ చేప ధైర్యానికి ప్రతీకగా చెప్పబడుతుంది. ఇంట్లో ఉండటం వల్ల ధైర్యంగా ఉండే శక్తి పెరుగుతుంది. అదృష్టం కూడా వెంట పడుతుంది. సానుకూలత చుట్టూ ఏర్పడుతుంది.

ఇలాంటి చేపలను ఇంట్లో పెంచితే మనసుకు శాంతి, డబ్బు లాభం, అదృష్టం కలుగుతాయని చాలా మంది నమ్ముతారు. కానీ వాటిని బాగా చూసుకోవాలి. వాటికి కావలసిన శుభ్రత, తిండి పెట్టాలి. అప్పుడే ఆ మంచి ఫలితాలు నిజంగా వస్తాయి.