Mouthwash: మౌత్‌ వాష్‌ సుధీర్ఘ కాలం వినియోగిస్తే క్యాన్సర్‌ ముప్పు ముంగిట్లోనే..! ప్రూఫ్ ఇదిగో..

|

Jul 04, 2024 | 9:00 PM

భారతదేశంలో మొదటిసారిగా టూత్‌పేస్ట్‌ను 1975లో తీసుకొచ్చారు. ఆ తర్వాత క్రమంగా టూత్‌బ్రష్‌లు, టూత్‌పేస్ట్‌ల వాడకం బాగా పెరిగింది. అయితే నేటి కాలంలో నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి టూత్ పేస్టుతో పాటు మౌత్ వాష్ కూడా అనేక మంది వాడుతున్నారు. నోటి దుర్వాసనను పోగొట్టడానికి చాలా మంది మౌత్ వాష్‌ని ఉపయోగిస్తున్నారు. పదేపదే పళ్ళు తోముకోలేని సందర్భాల్లో మౌత్ వాష్ బాగా పనిచేస్తుంది..

Mouthwash: మౌత్‌ వాష్‌ సుధీర్ఘ కాలం వినియోగిస్తే క్యాన్సర్‌ ముప్పు ముంగిట్లోనే..! ప్రూఫ్ ఇదిగో..
Mouthwash Can Cause Cancer
Follow us on

భారతదేశంలో మొదటిసారిగా టూత్‌పేస్ట్‌ను 1975లో తీసుకొచ్చారు. ఆ తర్వాత క్రమంగా టూత్‌బ్రష్‌లు, టూత్‌పేస్ట్‌ల వాడకం బాగా పెరిగింది. అయితే నేటి కాలంలో నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి టూత్ పేస్టుతో పాటు మౌత్ వాష్ కూడా అనేక మంది వాడుతున్నారు. నోటి దుర్వాసనను పోగొట్టడానికి చాలా మంది మౌత్ వాష్‌ని ఉపయోగిస్తున్నారు. పదేపదే పళ్ళు తోముకోలేని సందర్భాల్లో మౌత్ వాష్ బాగా పనిచేస్తుంది. అయితే ఇది ఆరోగ్యానికి మంచిదేనా అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

లిక్విడ్ మౌత్ వాష్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల క్యాన్సర్, మధుమేహం, ఇతర వ్యాధులు వస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే మనలో చాలా మందికి ఈ విషయం గురించి తెలియదు. మెడికల్ మైక్రోబయాలజీ జర్నల్‌లో రీసెర్చ్ పేపర్ ఇటీవల ఈ విషయాన్ని వెల్లడిస్తూ పలు అధ్యయనాలను ప్రచురించింది. మౌత్‌వాష్‌ను క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని పరిశోధకులు సైతం చెబుతున్నారు. దీనిని వాడిన తర్వాత నోటి లోపలి భాగం చల్లగా మారుతుంది. ఫలితంగా దంతాలు, చిగుళ్లకు చాలా హాని కలిగించే స్ట్రెప్టోకోకస్ వంటి బ్యాక్టీరియా సంఖ్య పెరుగుతుంది. ఇది క్రమంగా నోటి క్యాన్సర్‌కు కారణం కావచ్చు. అదొక్కటే కాదు. ఈ రకమైన బ్యాక్టీరియా దంతాలు, చిగుళ్ల కుళ్ళిపోవడానికి కారణమవుతుంది. హానికరమైన బ్యాక్టీరియా ఆహారంతో పాటు అన్నవాహికలోకి ప్రవేశించి మంటను కలిగిస్తుంది. ఫలితంగా అన్నవాహికలో కణితి ఏర్పడుతుంది. తరువాత ఇది ప్రేగు క్యాన్సర్‌కు దారితీస్తుంది. అయితే మార్కెట్‌లోకి వస్తున్న కొన్ని మౌత్‌వాష్‌లు చాలా ఎక్కువ ఆల్కహాల్‌ను కలిగి ఉంటున్నాయి. ఇది రోజూ వాడితే అన్నవాహిక, పేగు కణాలను దెబ్బతీస్తుంది.

థెరప్యూటిక్ అడ్వాన్సెస్ ఇన్ డ్రగ్ సేఫ్టీ అనే మరో మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన మరో పరిశోధనా అధ్యయనం మరొ కొత్త విషయం చెప్పింది. అదేంటంటే చాలా మౌత్‌వాష్‌లలో క్లోరెక్సిడైన్ గ్లూకోనేట్ అనే హానికరమైన రసాయనం ఉంటుంది. ఇది ఆహారాన్ని రుచి చూసే సామర్థ్యాన్ని క్రమంగా తగ్గిస్తుంది. నోటి లోపల గాయాలు ఏర్పడటానికి ఇది కారణం అవుతుంది. దీని నుంచి కూడా క్యాన్సర్ వచ్చేప్రమాదం ఉంది. ఈ కారణాల వల్ల, చాలా మంది వైద్యులు.. మౌత్ వాష్ ఉపయోగించడాన్ని పూర్తిగా నిషేధించాలని చెబుతున్నారు. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ పరిశోధకులు మౌత్ వాష్ ఉపయోగించడం వల్ల డయాబెటిస్ రిస్క్ చాలా రెట్లు పెరుగుతుందని చెబుతున్నారు. మౌత్‌వాష్‌లోని జింక్ గ్లూకోనేట్, ట్రైక్లోసన్, థైమోల్ వంటి పదార్ధాలు మధుమేహం ముప్పును పెంచుతాయి. మధుమేహం కారణంగా మూత్రపిండాల సమస్యలు, కంటి సమస్యలు తలెత్తుతాయి. దంతాలు కూడా పాడైపోతాయి. కాబట్టి మౌత్ వాష్ మీ నోటి దుర్వాసనను త్వరిత గతిన తొలగించినప్పటికీ దీనిని అదే పనిగా వినియోగించడం వల్ల పెద్ద పెద్ద సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

అందుకే మౌత్ వాష్ వినియోగం విషయంలో నిపుణులు ఏం చెబుతున్నారంటే.. డాక్టర్ సలహాతో మాత్రమే అవసరం మేరకు దీనిని వాడుకోవచ్చంటున్నారు. కానీ అధిక కాలం పాటు దీనిని వాడకూడదు. అలాంటప్పుడు లాభం కంటే నష్టమే ఎక్కువ. దీనికి బదులుగా లవంగం సహజమైన మౌత్ వాష్‌లా పనిచేస్తుంది. నోటి దుర్వాసనను పోగొట్టడానికి లవంగాలను నోటిలో ఉంచుకోవచ్చు. లేదంటే లవంగాలను నీటిలో నానబెట్టి ఆ నీటితో పుక్కిలించినా ఫలితం ఉంటుంది. దీంతో దుర్వాసన కూడా తొలగిపోతుంది.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.