AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొరియన్ యువతుల్లా మీ స్కిన్ గాజులా మెరిసిపోవాలా.. ఈ టిప్స్ ట్రై చేయండి..

ఈ రోజుల్లో మహిళలు కొరియన్ యువతుల వంటి చర్మాన్ని పొందడానికి వివిధ రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తున్నారు. గాజులా మెరిసే చర్మాన్ని సాధించడానికి బియ్యం నీళ్ళు కూడా ఉపయోగిస్తున్నారు. అయితే కొరియన్ యువతుల్లా మీ స్కిన్ గాజులా మెరిసిపోవాలంటే బియ్యం నీరుతో పాటు అందాన్ని మీ కు సొంతం చేసే కొన్ని ఇతర దేశీయ పదార్థాల గురించి తెలుసుకుందాం..

కొరియన్ యువతుల్లా మీ స్కిన్ గాజులా మెరిసిపోవాలా.. ఈ టిప్స్ ట్రై చేయండి..
Korean Glass Skin
Surya Kala
|

Updated on: Sep 26, 2025 | 10:13 AM

Share

ప్రస్తుతం ఎక్కువ మంది యువత కొరియన్ గ్లాస్ స్కిన్ పై మక్కువ పెంచుకొంటుంది. అంటే ప్రకాశవంతమైన, మచ్చలేని , మెరిసే చర్మం కోరుకుంటుంది. కొరియన్లు తమ చర్మ సంరక్షణ దినచర్యలో బియ్యం నీటిని విస్తృతంగా ఉపయోగిస్తారు. బియ్యం యాంటీఆక్సిడెంట్లకు గొప్ప మూలం. ఇది ముడతలు, చర్మం మీద సన్నని గీతలను తగ్గిస్తుంది. అంతేకాదు బియ్యంలో యాంటీ ఏజింగ్ లక్షణాలు కూడా ఉన్నాయి., ఇవి యవ్వన చర్మాన్ని కాపాడుతాయి. ఈ కొరియన్ చర్మ సంరక్షణ పద్ధతి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోంది.

అయితే బియ్యం నీళ్ళు మాత్రమే కాదు కొరియన్ గ్లాస్ స్కిన్ సాధించడంలో అమ్మాయిలకు సహాయపడే అనేక ఇతర దేశీయ పదార్థాలు కూడా ఉన్నాయి.. తక్కువ ఖర్చుతోనే ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా ప్రకాశవంతమైన చర్మాన్ని కోరుకుంటే.. కొరియన్ లాంటి చర్మాన్ని పొందడానికి మీరు ఉపయోగించగల కొన్ని పదార్థాల గురించి తెలుసుకుందాం..

నిపుణులు ఏమంటున్నారు?

ప్రముఖ చర్మవ్యాధి నిపుణురాలు దీపాలి భరద్వాజ్ కొరియన్ చర్మం భారతీయ చర్మానికి చాలా భిన్నంగా ఉంటుందని వివరిస్తున్నారు. కొరియన్ల చర్మం చాలా పల్చగా ఉంటుంది, అయితే భారతీయుల చర్మం కొద్దిగా మందంగా ఉంటుంది. అందువల్ల మనం ప్రతిరోజూ కాకుండా వారానికి 2-3 సార్లు బియ్యం నీటిని ఉపయోగించాలని చెప్పారు. బియ్యం నీరు చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది, చర్మాన్ని క్లియర్ చేయడం, మచ్చలను తగ్గించడం, చర్మం మృదువుగా, మెరిసేలా చేయడం వంటివి. అయితే అందరూ బియ్యం నీటిని ఉపయోగించకూడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మొటిమలు, పిగ్మెంటేషన్ లేదా సున్నితమైన చర్మం ఉన్నవారు బియ్యం నీటికి దూరంగా ఉండాలి.

ఇవి కూడా చదవండి

కలబంద: కలబందలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. దీనిని అనేక విధాలుగా ఉపయోగించవచ్చు. ఇది ముఖానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, ముడతలను తగ్గించడానికి మరియు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి, ఇది మచ్చలేని, మృదువుగా ఉండే చర్మాన్ని ఇస్తుంది.

కీర దోసతో మెరిసే చర్మం: కీర దోసకాయలు హైడ్రేటింగ్ , శీతలీకరణ ప్రభావాలతో ప్రసిద్ధి చెందాయి. వీటిని కొరియన్లు తమ చర్మ సంరక్షణలో కూడా ఉపయోగిస్తారు. ముఖానికి కీర దోసకాయను అప్లై చేయడం వలన చర్మం మంట , వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. కాంతివంతం చేస్తుంది. కనుక ముఖానికి దోసకాయ రసాన్ని కూడా అప్లై చేయవచ్చు. కీర దోసకాయ ఫేస్ ప్యాక్‌లు కూడా మంచి ఎంపిక.

గ్రీన్ టీ వాడండి కొరియన్ చర్మ సంరక్షణలో కూడా గ్రీన్ టీని ఉపయోగిస్తున్నారు. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. చర్మానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మంటను, ఎరుపును తగ్గిస్తుంది. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది. కనుక ముఖానికి గ్రీన్ టీ బ్యాగ్‌లను అప్లై చేయవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)