Weight Lose Tips: ఖర్చు లేకుండానే బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ డైట్ ప్లాన్..

|

Dec 17, 2022 | 3:06 PM

బరువు తగ్గేందుకు మనం ఖరీదైన ఆహారాలు, మెడిసిన్స్ తీసుకోవడం, కఠోర వ్యాయామాలను పాటించడం వంటిని చేసినా ఫలితం ఉండని పరిస్థితి. అలాంటి సమయంలోనే మన వంటింట్లోనే.. వాటిని ఉపయోగించుకొని..

Weight Lose Tips: ఖర్చు లేకుండానే బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ఈ డైట్ ప్లాన్..
Potato Benefits For Weightlose
Follow us on

ప్రస్తుత కాలంలో మనం అవలంభిస్తున్న జీవన విధానం, పాటిస్తున్న ఆహారపు అలవాట్ల కారణంగా అనేక సమస్యలతో బాధపడుతున్నాం. ఆహారపు అలవాట్ల కారణంగానే బీపీ, షుగర్, అల్సర్స్, కొన్ని రకాల క్యాన్సర్స్, అలెర్జీ, అధిక కొలేస్ట్రాల్, డయాబెటీస్ వంటి సమస్యలు మానవుడిని నిత్యం వేధిస్తున్నాయి. ఇంకా అధిక బరువు లేదా స్థూలకాయం కూడా ఈ కోవకు వచ్చే మరో సమస్య. అధిక బరువు ఉండడం వల్ల నలుగురు మన గురించి ఏమనుకుంటున్నారో అనే ఆందోళనతో మన ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. అలాగే బరువు తగ్గేందుకు మనం ఖరీదైన ఆహారాలు, మెడిసిన్స్ తీసుకోవడం, కఠోర వ్యాయామాలను పాటించడం వంటిని చేసినా ఫలితం ఉండని పరిస్థితి. అలాంటి సమయంలోనే మన వంటింట్లోనే లభించే వాటిని ఆశ్రయించకతప్పదు. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు, మన వంట గదిలో దొరికినన్ని ఔషధాలు మరెక్కడ దొరకవు. ఇదే మాటను పదే పదే చెబుతుంటారు మన పెద్దలు కూడా.

అయితే బరువు తగ్గాలనుకునేవారికి బంగాళదుంపలు చాలా మేలు చేస్తాయని మీకు తెలుసా..? బంగాళదుంపలను తినడం ద్వారా తక్షణ ఫలితాలను పొందవచ్చు. అందుకోసం మీరు ‘పొటాటో డైట్ ప్లాన్’ అనుసరిస్తే చాలు. ఇది బరువు తగ్గడానికి చాలా మెరుగ్గా పనిచేస్తుంది. ఇంకా  అని పిలుస్తారు. ఈ బంగాళాదుంప డైట్ ప్లాన్‌తో, మీరు కొన్ని రోజుల్లో బరువు తగ్గవచ్చు. బంగాళదుంపలో పుష్కలంగా ఉండే కేలరీలు, ఫైబర్, విటమిన్లు,కార్బోహైడ్రేట్లు బరువు తగ్గడానికి సహకరిస్తాయి. ఇవి మన జీర్ణక్రియపై ప్రభావం చూపి బరువు తగ్గేలా చేస్తాయి.  సులభంగా తగ్గించవచ్చు. ఇది జీవక్రియను వేగవంతం చేయడానికి మరియు త్వరగా బరువు తగ్గడానికి ఒక మార్గం. మరి ఈ పొటాలో డైట్ ప్లాన్‌ను ఎలా పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పొటాలో డైట్ ప్లాన్ కోసం ప్రతిరోజూ 0.9 కేజీల నుంచి 2.3 కేజీల ఉడికించిన బంగాళాదుంపలను క్రమం తప్పకుండా  3-5 రోజులు తినండి. ఈ క్రమంలోనే కొన్ని రోజుల పాటు కెచప్, వెన్న, చీజ్ వంటి మసాలా పదార్థాలకు దూరంగా ఉండండి. ఇంకా ఆహారంతో పాటు బ్లాక్ కాఫీ తీసుకకోవడంతో పాటు తేలికపాటి వ్యాయామం చేయండి. ఇలా చేయడం వల్ల మీ కడుపులోని ఆహారాన్ని వేగంగా జీర్ణం అవడమే కాక బరువు తగ్గుతారు. ఇంకా ఈ డైట్ ప్లాన్ మీ వ్యాయమ శక్తిని పెంచుతుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..