Kitchen Tips: వంటగది గోడపై నూనె మరకలు అవుతున్నాయా? ఈ చిట్కాలతో జిడ్డు మటుమాయం!
వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం మహిళలకు తలనొప్పి. ఎంత శుభ్రంగా ఉంచుకున్నా మళ్లీ అలాగే ఉంటుంది. ఈ వంట సమయంలో గోడపై గానీ, స్టౌపై, అలాగే కిచెన్ లో ఇతర ప్రాంతాలపై నూనె మరకలు, ఇతర మరకలు అవుతుంటాయి. వెంటనే శుభ్రం చేయకపోతే జిడ్డు మరకలు మరింత పేరుకుపోతాయి. అయితే ఇలాంటి నూనె మరకలతో కూడిన జిడ్డును పోగొట్టేందుకు మహిళలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా..

వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడం మహిళలకు తలనొప్పి. ఎంత శుభ్రంగా ఉంచుకున్నా మళ్లీ అలాగే ఉంటుంది. ఈ వంట సమయంలో గోడపై గానీ, స్టౌపై, అలాగే కిచెన్ లో ఇతర ప్రాంతాలపై నూనె మరకలు, ఇతర మరకలు అవుతుంటాయి. వెంటనే శుభ్రం చేయకపోతే జిడ్డు మరకలు మరింత పేరుకుపోతాయి. అయితే ఇలాంటి నూనె మరకలతో కూడిన జిడ్డును పోగొట్టేందుకు మహిళలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా జిడ్డు మరకలు అలాగే ఉంటాయి. చాలా మంది ఇళ్లలో కిచెన్‌లో గోడలపై ఇలాంటి నూనె మరకలు కనిపించడం సహజం. ఇలాంటివి మహిళలకు పెద్ద తలనొప్పిగా ఉంటాయి. అయితే ఇలాంటి మరకలను సులభంగా పోగొట్టే అద్భుతమైన చిట్కాలను అందిస్తున్నాము. వాటిని అనుసరించినట్లయితే చికెన్ గోడలు తలతల మెరిసిపోతాయి.
- వంటగది గోడపై నూనె మరకలు ఉంటే ఉప్పు నీటితో కడగడం వల్ల మరకలు పోతాయి.
- కిచెన్ వాల్ మరకలను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా సహాయపడుతుంది. బేకింగ్ సోడాతో శుభ్రపరచడం వల్ల జిడ్డు మరకలు తొలగిపోతాయి.
- తెల్లటి టూత్‌పేస్ట్‌ను ఉపయోగించి మరకలను తొలగించడం సులభం. టూత్‌పేస్ట్‌ని ఆయిల్ స్టెయిన్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి ఐదు నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత రుద్ది కడిగేస్తే మరకలు పోతాయి.
- జిడ్డు మరకలను వదిలించుకోవడానికి హెయిర్ డ్రైయర్‌లు ఉత్తమ మార్గం. జిడ్డుగల మచ్చలపై కాగితపు టవల్‌ను ఉంచడం, వాటిపై హెయిర్ డ్రైయర్‌ను ఉపయోగించి జిగట నూనెను కరిగించవచ్చు.
- నిమ్మ, వెనిగర్ కలపడం ద్వారా మిశ్రమాన్ని తయారు చేయండి. గోరువెచ్చని నీళ్లలో వేసి ఈ నీళ్లతో శుభ్రంగా కడిగేస్తే మరక పోయి మెరుస్తుంది.
- పలకలు లేదా గోడల నుండి మరకలను తొలగించడానికి లిక్విడ్ డిష్ వాష్ ఉపయోగించవచ్చు. లిక్విడ్ డిష్ వాష్‌ను గోడపై స్ప్రే చేసి ఒక గంట పాటు వదిలివేయండి. ఆ తర్వాత గుడ్డపై డిష్ వాష్ వేసి తుడిస్తే మరకలన్నీ పోతాయి.
ఇది కూడా చదవండి: PM Modi: దేశ రైతులకు శుభవార్త అందించేందుకు మోడీ సర్కార్ భారీ ప్లాన్!
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








