Gold Price Today: మగువలకు షాకిచ్చిన బంగారం ధరలు.. తులం గోల్డ్‌పై ఎంత పెరిగిందో తెలుసా?

దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు బంగారం ధర తగ్గితే మరో రోజు ఎగబాకుతోంది. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్లు, ఇతర సీజన్‌లలో బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర వరుసగా రెండో రోజు పెరిగింది. జూలై 13, 2024న 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు)..

Gold Price Today: మగువలకు షాకిచ్చిన బంగారం ధరలు.. తులం గోల్డ్‌పై ఎంత పెరిగిందో తెలుసా?
Gold Jewellery
Follow us
Subhash Goud

|

Updated on: Jul 13, 2024 | 7:44 AM

దేశంలో బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు బంగారం ధర తగ్గితే మరో రోజు ఎగబాకుతోంది. భారతీయ సాంప్రదాయంలో బంగారానికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్లు, ఇతర సీజన్‌లలో బంగారం షాపులన్ని మహిళలతో కిటకిటలాడుతుంటాయి. గత 24 గంటల్లో భారత్‌లో బంగారం ధర వరుసగా రెండో రోజు పెరిగింది. జూలై 13, 2024న 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 67,600 ఉండగా, 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 73,750 ఉంది.  దేశంలో బంగారం ధర రూ.330 పెరిగింది.

ఇదిలా ఉంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో పసిడి ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం గోల్డ్ రేటు ఔన్సుకు 2410 డాలర్లపైన ట్రేడవుతోంది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ ధరచూస్తే 30.80 డాలర్ల వద్ద ఉంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.523 వద్ద కొనసాగుతోంది. ఇక తాజాగా

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

  • ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 67,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 73,900 వద్ద ఉంది.
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 67,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 73,760 వద్ద ఉంది.
  • ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 67,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 73,760 వద్ద ఉంది.
  • చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 68,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 74,470 వద్ద ఉంది.
  • బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 67,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 73,760 వద్ద ఉంది.
  • కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 67,610 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 73,760 వద్ద ఉంది.
  • ఇక వెండి విషయానికొస్తే కిలోకు రూ.95,400 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి