- Telugu News Business Budget 2024: Nirmala Sitharaman make new record to present highest time budget in indian history
Budget 2024: ఎక్కువ సార్లు బడ్జెట్‌ను సమర్పించి మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్ ఆ రికార్డును బ్రేక్ చేస్తారా?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. బడ్జెట్‌ను సమర్పించడానికి తేదీ 23 జూలై 2024గా నిర్ణయించింది కేంద్రం.ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ఈవీ రంగం, చిన్న, సూక్ష్మ పరిశ్రమల రంగం, మౌలిక సదుపాయాలపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు. అయితే, బడ్జెట్ రోజున మాత్రమే దీనిపై సవివరమైన సమాచారం..
Updated on: Jul 13, 2024 | 7:16 AM

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్న మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. బడ్జెట్‌ను సమర్పించడానికి తేదీ 23 జూలై 2024గా నిర్ణయించింది కేంద్రం.

ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ఈవీ రంగం, చిన్న, సూక్ష్మ పరిశ్రమల రంగం, మౌలిక సదుపాయాలపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు. అయితే, బడ్జెట్ రోజున మాత్రమే దీనిపై సవివరమైన సమాచారం అందుబాటులో ఉంటుంది.

మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్, ఇప్పటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా 6 సార్లు బడ్జెట్‌ను సమర్పించారు. ఈసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో వరుసగా 7 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ రికార్డులకెక్కనున్నారు. అయితే ఇంధిరా గాంధీ తర్వాత నిర్మలా సీతారామన్ రెండో మహిళా ఆర్థిక మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇందిరమ్మ కంటే నిర్మలమ్మే ఎక్కువ సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2019లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం సీతారామన్‌కు ఆర్థికశాఖ బాధ్యతల్ని అప్పగించింది.

మొరార్జీ దేశాయ్ భారతదేశ చరిత్రలో అత్యధికంగా 10 సార్లు దేశ బడ్జెట్‌ను సమర్పించారు, ఇందులో దేశం పూర్తి బడ్జెట్, మధ్యంతర బడ్జెట్ రెండూ ఉన్నాయి.

మొరార్జీ దేశాయ్ తన జన్మదినమైన ఫిబ్రవరి 29న ఒకసారి దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన రికార్డు కూడా ఉంది. చరిత్రలో మరే ఆర్థిక మంత్రి ఇలా చేయలేదు. అలాగే ఐదుసార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రుల జాబితాలో అరుణ్ జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్ సిన్హా, మన్మోహన్ సింగ్, మొరార్జీ దేశాయ్ ఉన్నారు.




