Radhika Merchant: ఆ విషయంలో నీతా అంబానీతో కోడలు రాధిక మర్చంట్ పోటీ.. అంబానీ ఇంటి కోడలు ఏం చదివిందంటే..?

రాధికా మర్చంట్.. ఈ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరూ టక్కున అంబానీ ఇంటి కోడలు అని చెప్పేస్తున్నారు. చాలా తక్కువ సమయంలో ఈ పేరును అందరూ గుర్తు పెట్టుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీతో వివాహానికి ముందు జరిగిన ఉత్సవాల సందర్భంగా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అయిన వీరేన్ మర్చంట్ చిన్న కుమార్తె రాధిక. ఈమె న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్, ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసింది.

Radhika Merchant: ఆ విషయంలో నీతా అంబానీతో కోడలు రాధిక మర్చంట్ పోటీ.. అంబానీ ఇంటి కోడలు ఏం చదివిందంటే..?
Radhika Merchant
Follow us
Srinu

|

Updated on: Jul 12, 2024 | 5:15 PM

రాధికా మర్చంట్.. ఈ పేరు చెప్పగానే ప్రతి ఒక్కరూ టక్కున అంబానీ ఇంటి కోడలు అని చెప్పేస్తున్నారు. చాలా తక్కువ సమయంలో ఈ పేరును అందరూ గుర్తు పెట్టుకున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీతో వివాహానికి ముందు జరిగిన ఉత్సవాల సందర్భంగా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ అయిన వీరేన్ మర్చంట్ చిన్న కుమార్తె రాధిక. ఈమె న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్, ఎకనామిక్స్ గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసింది. ప్రస్తుతం రాధిక ఎన్‌కోర్ హెల్త్‌కేర్ ప్రైవేట్ లిమిటెడ్‌లో డైరెక్టర్‌గా కూడా ఉన్నారు. అయితే భరతనాట్యం నీతా అంబానీతో కోడలు రాధిక మర్చంట్ పోటీపడుతుంది. వినడానికి కొత్తగా ఉన్నా రాధిక మర్చంట్ కూడా భరత నాట్యం డ్యాన్సర్. ఈ నేపథ్యంలో అంబానీ ఇంటి కొత్త కోడలుకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

రాధికకు వ్యాపారం ఒక్కటే కాదు. ఆమె శిక్షణ పొందిన భరతనాట్యం నృత్యకారిణి, ఆమె ముంబైలోని శ్రీ నిభా ఆర్ట్స్ డ్యాన్స్ అకాడమీకి చెందిన గురు భవన్ థాకర్ వద్ద శిక్షణ పొందారు. 2022లో రాధిక భరతనాట్యంలో అరంగేట్రం చేసింది. నీతా అంబానీ తర్వాత అంబానీ కుటుంబంలో రాధిక రెండో భరతనాట్యకారిణిగా ఉంది. అనంత్, రాధిక జనవరి 2023లో ముంబైలోని కుటుంబ నివాసం యాంటిలియాలో సాంప్రదాయ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. శుక్రవారం వీరి పెళ్లి అంగరంగా వైభవంగా జరగనుంది. 

భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాప్ బిజినెస్, సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వివాహానికి హాజరుకానున్నారు. శుక్రవారం శుభ వివాహ కార్యక్రమంతో వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. జూలై 13న శుభ్ ఆశీర్వాద్, జూలై 14 మంగళ్ ఉత్సవ్‌తో వేడుకలు ముగియనున్నాయి. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..