AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Closed: విద్యార్థులకు షాక్‌.. ఆ రాష్ట్రంలో 4,400 ప్రభుత్వ పాఠశాలలు మూసివేత.. కారణం ఏంటంటే..

విద్యార్థుల నమోదు తక్కువగా ఉన్నందున జమ్మూ అండ్‌ కాశ్మీర్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే 4,400 పాఠశాలలు మూసిపడ్డాయి. మీడియా నివేదికల ప్రకారం.. ఈ ప్రాంతంలోని 23,117 ప్రభుత్వ పాఠశాలల్లో 4,394 యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (UDISE) డేటా నుండి తొలగించబడినట్లు నివేదికలు..

School Closed: విద్యార్థులకు షాక్‌.. ఆ రాష్ట్రంలో 4,400 ప్రభుత్వ పాఠశాలలు మూసివేత.. కారణం ఏంటంటే..
Schools
Subhash Goud
|

Updated on: Jul 12, 2024 | 12:05 PM

Share

విద్యార్థుల నమోదు తక్కువగా ఉన్నందున జమ్మూ అండ్‌ కాశ్మీర్‌లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే 4,400 పాఠశాలలు మూసిపడ్డాయి. మీడియా నివేదికల ప్రకారం.. ఈ ప్రాంతంలోని 23,117 ప్రభుత్వ పాఠశాలల్లో 4,394 యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (UDISE) డేటా నుండి తొలగించబడినట్లు నివేదికలు పేర్కొన్నాయి. కాశ్మీర్ అబ్జర్వర్ నివేదిక ప్రకారం, తక్కువ లేదా విద్యార్థుల నమోదు లేని పాఠశాలలు సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలతో విలీనం అయ్యాయి.

పాఠశాల విద్యా శాఖ 1,200 పైగా విద్యార్థుల నమోదు తక్కువగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను గుర్తించింది ప్రభుత్వం. పరివాహక ప్రాంతాలు, విద్యార్థుల సాధ్యాసాధ్యాల ఆధారంగా వాటి విలీనాన్ని ప్రతిపాదించింది. ఏప్రిల్ 2022లో డిపార్ట్‌మెంట్ 720 ప్రభుత్వ ఆధీనంలోని పాఠశాలలను సరిపోని విద్యార్థుల నమోదుతో విలీనం చేసే ప్రణాళికలను ప్రకటించింది.

ప్రాథమిక పాఠశాలలు ఎక్కువగా ప్రభావితం

ప్రాథమిక పాఠశాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. మొత్తం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల సంఖ్య దాదాపు 30 శాతం తగ్గింది. విలీనాల తరువాత ఇప్పుడు 12,977 పాఠశాలు ఉండగా, ఈ నిర్ణయం తర్వాత 8,966 పాఠశాలలకు చేరాయి. అదనంగా, 392 ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు, మూడు ఉన్నత పాఠశాలలు, ఒక ఉన్నత పాఠశాల UDISE+ జాబితా నుండి తొలగించారు. 5,688 ప్రైవేట్, ఇతర విద్యా సంస్థలలో ప్రస్తుతం 5,555 మాత్రమే పనిచేస్తున్నాయని డేటా చెబుతోంది. జమ్మూ కాశ్మీర్‌లో గతంలో 28,805 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉండేవి. ఈ సంఖ్య ఇప్పుడు 24,279 పాఠశాలలకు చేరుకుంది. ఇది 4,526 పాఠశాలల గణనీయమైన తగ్గింపును సూచిస్తుంది.

2020-22 మధ్యకాలంలో గుజరాత్ ప్రభుత్వం 90 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను మూసివేసి దాదాపు 500 పాఠశాలలను విలీనం చేసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక తెలిపింది. రాష్ట్రం గతంలో 2013-2019లో విద్యార్థలు తక్కువ సంఖ్యలో పాఠశాలలను విలీనం చేయడానికి, మూసివేయడానికి ప్రయత్నించింది. అయితే, నిరసనలు, బలమైన రాజకీయ వ్యతిరేకత కారణంగా మునుపటి ప్రయత్నాలు విరమించుకుంది.

గత నెలలో, అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ అలోక్ కుమార్ కాశ్మీర్ న్యూస్ అబ్జర్వర్‌తో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి సక్రమంగా లేని కారణంగా అనేక ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడానికి దారితీసిందని చెప్పారు. పాఠశాలల తగ్గింపుకు విద్య నాణ్యతతో సంబంధం లేదు.. ఆ పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థుల నమోదు లేదు.. అలాగే మానవ వనరుల పరంగా మౌలిక సదుపాయాలు విస్తరించాయి అని కుమార్ చెప్పారు. జమ్మూలో చాలా పాఠశాలలకు తగిన మౌలిక సదుపాయాలు లేవని, ముఖ్యంగా పాఠశాలలు కోడింగ్ ప్రోగ్రామ్‌ల వంటి కొత్త కోర్సులను ప్రవేశపెట్టడం ప్రారంభించినందున వాటిని అప్‌డేట్‌ చేయాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి