Kitchen Hacks: వేసవి లో పాలు విరిగిపోతున్నాయా.. ఈ చిట్కాలు పాటించి చూడండి..
పాలను వేడి చేస్తున్న సమయంలో ఏదొక సారి పాలు విరిగి పోతాయి. ఇది ప్రతిఇంట్లో జరిగేదే.. అయితే వేసవి కాలంలో మాత్రం పాలు విరిగిపోవడం ఎక్కువగా జరుగుతుంది. అందుకనే చాలా మంది పాలను ఫ్రిడ్జ్ లో పెట్టి నిల్వ చేస్తారు. మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి చేస్తుంటే.. కొన్నిసార్లు పాలు విరిగిపోతాయి. దీని కారణం పాలల్లో ఉండే పీహెచ్ స్ధాయిలు తగ్గడమే నట. ఈ నేపథ్యంలో వేసవిలో పాలు విరగకుండా నిల్వ చేసుకునేందుకు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటో తెలుసుకుందాం..

పాలు సమీకృత ఆహారం.. ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అందుల్లనే పిల్లలకు పెద్దలకు పాలను రోజు వారీ ఆహారంలో చేర్చుకోమని ఆహార నిపుణులు సూచిస్తూ ఉంటారు. పాలు మాత్రమే కాదు పాలతో తయారు అయ్యే ఇతర ఉత్పత్తులైన పెరుగు, వెన్న, నెయ్యి, పనీర్ వంటివి కూడా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఆరోగ్యానికి హాని కరమైన బ్యాక్టీరియా నశించాలంటే పాలను వేడి చేసుకుని తాగాలి.. లేదంటే ఆరోగ్యానికి హానికరంగా మారతాయి పాలు.. అయితే ఇలా పాలను వేడి చేస్తున్న సమయంలో ఏదొక సారి పాలు విరిగి పోతాయి. ఇది ప్రతిఇంట్లో జరిగేదే.. అయితే వేసవి కాలంలో మాత్రం పాలు విరిగిపోవడం ఎక్కువగా జరుగుతుంది. అందుకనే చాలా మంది పాలను ఫ్రిడ్జ్ లో పెట్టి నిల్వ చేస్తారు. మళ్ళీ స్టవ్ మీద పెట్టి వేడి చేస్తుంటే.. కొన్నిసార్లు పాలు విరిగిపోతాయి. దీని కారణం పాలల్లో ఉండే పీహెచ్ స్ధాయిలు తగ్గడమే నట. ఈ నేపథ్యంలో వేసవిలో పాలు విరగకుండా నిల్వ చేసుకునేందుకు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏమిటో తెలుసుకుందాం.. ఈ రోజు
- పాలు ఇంటికి తీసుకుని వచ్చిన వెంటనే స్టవ్ మీద పెట్టి వేడి చేసుకోవాలి. తర్వాత వాటిని చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకుని భద్ర పరచుకోవాలి.
- అయితే పాలను ఫ్రిడ్జ్ లో పెట్టడం ఇష్టం లేనివారు .. లేదా ఫ్రిడ్జ్ లేని వారు పాలను నాలుగు గంటలకు ఒకసారి వేడి చేస్తూ ఉండాలి.
- పాలు కాచి చల్లార్చిన తర్వాత ఆ పాలను గాజు సీసాలో లేదా గాజు పాత్రలో లేదా శుభ్రమైన స్త్రీల క్యాన్ లో వేసి జాగ్రత్తగా చల్లని ప్రదేశంలో పెట్టుకోవాలి.
- పాలను వేడి చేసే ముందు పాలల్లో చిటికెడు బేకింగ్ సోడా వేసినా పాలు విరగకుండా నిల్వ ఉంటాయి.
- కాచి చల్లార్చిన పాలను నిల్వ చేయాలంటే స్టీల్ పాత్రకూడా ఉపయోగించవచ్చు. అయితే ముందుగా ఆ స్టీల్ పాత్ర లో నీరు పోసి.. బాగా వేడి చేసి ఆ నీరుని తీసి అప్పుడు పాలు వేసుకోవాలి.
- పాలు నిల్వ చేసుకోవడానికి ఫ్రిజ్ లో పెట్టాలనుకుంటే ఫ్రిడ్జ్ డోరులో పెట్టకుండా లోపలి అరల్లో పాలను పెట్టుకోవాలి.
- పాలను నిల్వ చేసుకునే ఫ్రిడ్జ్ ఉష్ణోగ్రత 32 డిగ్రీల ఫారన్‌హీట్ నుంచి 39.2 డిగ్రీల ఫారన్‌హీట్ మధ్యలో ఉండేలా చూసుకోవాలి.
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా పాలు విరిగిపోతే వాటిని పారబోయకుండా విరిగిన పాలతో టేస్టీ టేస్టీ స్వీట్స్ ను తయారు చేసుకోవచ్చు. కోవా, పనీర్, రసమలై, కలా కండ్ వంటివి తయారు చేసుకోవచ్చు.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..








