Ginger: అల్లంతో ఆరోగ్యం మాత్రమే కాదు.. అందమైన కురులు కూడా..
ఆయుర్వేద పరంగా అల్లం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిసిందే. అల్లం జట్టు పోషణకు కూడా ఉపయోగపడుతుంది. కురులను స్ట్రాంగ్‌గా చేసి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. అల్లం శిరోజాలకు ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం పదండి...

అల్లం భారతీయ వంటింట్లో కనిపించే ఒక సాధారణ పదార్ధం. దీనికి ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. రకరకాల వంటలతో పాటు టీ తయారీలో కూడా దీన్ని వినియోగిస్తారు. దగ్గు, కఫం, జలుబు సమస్యులు ఉంటే.. ఒక్క అల్లం టీ తాగితే పారాహుషార్ అంతే. అల్లం యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్‌తో నిండి ఉంటుంది. ఇది రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది, జుట్టు పెరుగుదలను పెంచుతుంది. జుట్టు కుదుళ్ళ సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. జుట్టు సంరక్షణకు అల్లం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి దీన్ని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం పదండి..
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం:
అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు జుట్టు రాలిపోడానికి, తెల్లపడటానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. అల్లాన్ని రెగ్యలర్‌గా ఉపయోగించడం వల్ల పర్యావరణ ఒత్తిళ్ల నుంచి జుట్టును కాపాడుకోవచ్చు. జుట్టు ఆరోగ్యాన్ని అల్లం కాపాడుతుంది.
చుండ్రు పరార్…
అల్లం సహజ క్రిమినాశక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చుండ్రు లేకుండా చేస్తుంది. కుదుళ్లలో దురద ఉన్నా ఉపశమనం లభిస్తోంది. తలపై దురద , చిన్న చిన్న పొక్కులు వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. జుట్టు పెరుగుదలకు సరైన వాతావరణాన్ని ప్రేరేపిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.
జుట్టు కుదుళ్లు బలపరుస్తుంది:
అల్లంలో ఉండే మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి ఖనిజాలు జుట్టును దృఢంగా చేస్తాయి. అల్లం మీ జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలపడతాయి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. అల్లం రసాన్ని జుట్టుకి వాడడం వల్ల ఆరోగ్యకరమైన, పొడవైన జుట్టు మీ సొంతం అవుతుంది.
(ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే ఉత్తమ మార్గం.)




