AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Hacks: ఇంట్లో చీమలతో ఇబ్బంది పడుతున్నారా..! వంటింటి చిట్కాలను ట్రై చేయండి..

ఇంట్లో ఎక్కడో ఒక చోట చీమలు కనిపించడం సర్వసాధారణం. అయితే కొన్ని రకాల చీమలు ఎక్కువ సేపు ఉండవు. మరికొన్ని మాత్రం.. ఆహార పదార్ధాలు పెట్టిన డబ్బాల్లోకి, ఆహార పదార్దాల్లోకి చేరుకుని ఇబ్బందిని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో చీమలు ఇంటి నుంచి తరిమికొట్టడానికి వంటింటి చిట్కాలు ప్రభావంతంగా పని చేస్తాయి. అప్పుడు ఇంట్లో చీమలు కనిపించవు.

Kitchen Hacks: ఇంట్లో చీమలతో ఇబ్బంది పడుతున్నారా..! వంటింటి చిట్కాలను ట్రై చేయండి..
Kitchen Hacks
Surya Kala
|

Updated on: Sep 09, 2025 | 10:26 AM

Share

వర్షాకాలంలో ఇంట్లో చీమలు కనిపించడం సర్వసాధారణం. కానీ కొన్నిసార్లు గుంపు గుంపులుగా ఎరుపు లేదా నల్ల చీమలు ఒక మూలలో చేరుకుంటాయి. లేదా ఒక గది నుంచి మరొక గదిలోకి క్యూ కట్టడం ప్రారంభిస్తాయి. అప్పుడు వాటిని తొలగిస్తారు.. అయినా సరే మళ్ళీ కొంచెం సేపటికి అక్కడ చీమల గుంపు చేరుకుంటుంది. ఇలా చీమలు మళ్ళీ మళ్ళీ ఇంట్లోకి చీమలు రావడం వలన చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఎర్ర చీమ కుట్టినట్లయితే.. కుట్టిన ప్రాంతంలో దురద, ఎరుపు దద్దుర్లు కనిపించడం ప్రారంభమవుతుంది. దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అటువంటి పరిస్థితిలో చీమలను ఇంటి నుంచి తొలగించడానికి వంటించి చిట్కాలు ప్రభావంతంగా పని చేస్తాయి.

సాధారణంగా చీమలు ఇంట్లోకి స్వీట్లు, చక్కెర, బ్రెడ్ లేదా ఇతర ఆహార పదార్థాలు ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ చీమలు చేరుకుంటాయి. అంతేకాదు ఇల్లు శుభ్రంగా లేకపోయినా కూడా చీమలు ఇంట్లో చేరుకుంటాయి. అయితే వీటిని వదిలించుకోవడానికి ఇంటిని శుభ్రంగా పెట్టుకోవడం, ఆహారాన్ని సరిగ్గా ఉంచడంతో పాటు ఈ సింపుల్ చిట్కాలు కూడా పాటించండి.

పిప్పరమింట్ నూనె చీమలను తరిమికొట్టడానికి పిప్పరమెంటు ఆకులను కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం శుభ్రమైన ప్లాస్టిక్ స్ప్రే బాటిల్‌లో 2 కప్పుల నీటితో 10 నుంచి 20 చుక్కల పిప్పరమెంటు నూనెను కలపండి. ఈ నీటిని మీ ఇంటి బేస్‌బోర్డులు, కిటికీల చుట్టూ స్ప్రే చేయండి. తర్వాత ఆ నూనెను ఆరనివ్వండి. అవసరమైతే మళ్ళీ పిప్పర్ మెంట్ నూనెను అప్లై చేయండి.

ఇవి కూడా చదవండి

టీ ట్రీ ఆయిల్ టీ ట్రీ ఆయిల్ ఈగలు, చీమలను తరిమికొట్టడంలో సహాయపడుతుంది. శుభ్రమైన ప్లాస్టిక్ స్ప్రే బాటిల్‌లో 5 నుంచి 10 చుక్కల టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్‌ను 2 కప్పుల నీటితో కలపండి. ఈ పేస్ట్‌ను ఇంటి చుట్టూ, ముఖ్యంగా చీమలు కనిపించే చోట స్ప్రే చేయండి.

వైట్ వెనిగర్ వైట్ వెనిగర్ సహాయంతో కూడా చీమలను తొలగించవచ్చు. దీని కోసం వెనిగర్ , నీటిని కలిపి నేలను, కౌంటర్ టాప్‌ల ఉపరితలాలను శుభ్రం చేయడానికి ఉపయోగించండి. చీమలు ఎక్కడ కనిపించినా.. ఈ పేస్ట్‌ను ఆ ప్రదేశాలలో స్ప్రే చేయవచ్చు లేదా కాగితం, వస్త్రంపై ఈ స్ప్రే చేయడం ద్వారా ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయవచ్చు.

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి చీమలు ఆహారం దగ్గరకు చాలా త్వరగా చేరుకుంటాయి. కనుక ఆహారాన్ని బయట ఉంచవద్దు. బదులుగా గాలి చొరబడని కంటైనర్‌లో ఉంచండి. పండ్లు,కూరగాయలను ఫ్రిజ్‌లో ఉంచండి. గాలి చొరబడని మూత ఉండే డస్ట్‌బిన్‌ను ఉపయోగించండి. కిటికీలు, తలుపులకు పగుళ్లను ఉంటే మూసివేయండి. ఇంట్లో మొక్కలు ఉంటే వాటి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచండి. తీపి వస్తువులను గాలికి విడిచి పెట్టవద్దు.\

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)