కాస్ట్లీ ఉప్పు ..కిలో ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! దిమ్మతిరిగే బెనిఫిట్స్..
ఉప్పులో చాలా రకాలు ఉన్నాయి. హిమాలయన్ పింక్ సాల్ట్, సెల్టిక్ సాల్ట్, సీ సాల్ట్, బ్లాక్ సాల్ట్, స్మోక్ సాల్ట్, ఫ్లేక్ సాల్ట్, కోషెర్ సాల్ట్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో ఒకసారి, ఏదో విధంగా మీరు ట్రై చేసి ఉంటారు. కానీ, అత్యంత ఖరీదైన ఉప్పు కూడా ఉందని మీకు తెలుసా..? ఉప్పులో కాస్ట్‌లీ ఉప్పు ఖరీదు తెలిస్తే మీరు కంగుతింటారు. ఎందుకంటే,ఈ ఉప్పు ఖరీదు కేజీ వేలల్లో ఉంటుంది మరీ. అలాంటి ఉప్పు గురించి పూర్తి డిటెల్స్ ఇక్కడ చూద్దాం..

ఎంత టేస్టీగా వంట చేసినప్పటికీ తగినంత ఉప్పు వేయకపోతే ఆ వంటకం మనకు రుచించదు. అయితే, మనం రెగ్యులర్‌గా వాడే వంట ఉప్పులే కాకుండా ఇప్పుడు మార్కెట్‌లో చాలారకాల ఉప్పులు లభిస్తున్నాయి. హిమాలయన్ పింక్ సాల్ట్, సెల్టిక్ సాల్ట్, సీ సాల్ట్, బ్లాక్ సాల్ట్, స్మోక్ సాల్ట్, ఫ్లేక్ సాల్ట్, కోషెర్ సాల్ట్ ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడో ఒకసారి, ఏదో విధంగా మీరు ట్రై చేసి ఉంటారు. కానీ, అత్యంత ఖరీదైన ఉప్పు కూడా ఉందని మీకు తెలుసా..? ఉప్పులో కాస్ట్‌లీ ఉప్పు ఖరీదు తెలిస్తే మీరు కంగుతింటారు. ఎందుకంటే,ఈ ఉప్పు ఖరీదు కేజీ వేలల్లో ఉంటుంది మరీ. అలాంటి ఉప్పు గురించి పూర్తి డిటెల్స్ ఇక్కడ చూద్దాం..
సాధారణంగా కిలో ఉప్పు ఖరీదు రూ. 10 నుంచి 20 లోపుగానే ఉంటుందని అనుకుంటాం.. కానీ, కిలో ఉప్పు ధర రూ. 2000 ఉందంటే మీరు నమ్ముతారా..? అవును, ఇది చాలా కాస్ట్‌లీ ఉప్పు. దీనిని కలోంజీ ఉప్పు అంటారు. కలోంజి ఉప్పు ధర చాలా ఎక్కువ. అగ్నిపర్వతాల్లో లభించే ఖనిజ ఉప్పు. కలోంజి అంటే నల్ల జీలకర్ర. నల్ల ఉప్పు, కలోంజి గింజల మిశ్రమంతో కలోంజీ ఉప్పును తయారు చేస్తారు.. ఈ కలోంజి ఉప్పు కిలో ధర రూ.2000 పైనే ఉంటుందట. ఈ ప్రత్యేక ఉప్పు తీసుకోవడం వల్ల బోలెడన్నీ లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
కలోంజి ఉప్పుతో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది ఎసిడిటీ, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. శరీరంలోని టాక్సిన్లు క్లియర్ చేస్తుంది. మెటబాలిజాన్ని ఉత్సాహపరిచేందుకు సహాయపడుతుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, శరీరాన్ని వివిధ ఇన్ఫెక్షన్లు, వ్యాధుల నుండి కాపాడుతుంది. సలాడ్లు, పండ్లు, పచ్చళ్లపై చల్లి వాడవచ్చు. అధికంగా వాడితే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు. అందుకే రోజూ 1–2 గ్రాముల చొప్పున తీసుకోవటం ఉత్తమం అంటున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








