కొలెస్ట్రాల్ తక్కువ.. రోగాలను తరిమికొట్టే సూపర్ పవర్.. బ్లాక్ చికెన్ తింటే ఇన్ని లాభాలా..

కడక్‌నాథ్ కోడి.. సాధారణంగా నల్ల కోడి అని పిలవబడే ఈ ప్రత్యేక జాతి కోడి మాంసం అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. ఇది రుచిలో దేశీ కోడి కంటే ఉత్తమంగా ఉంటుందని, తినడానికి కొంచెం నల్లగా కనిపించినా, దాని పోషక విలువలు అనూహ్యమని నిపుణులు చెబుతున్నారు. ఈ కోడి మాంసం బీపీ, షుగర్ వంటి అనేక వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుందని పేర్కొంటున్నారు.

కొలెస్ట్రాల్ తక్కువ.. రోగాలను తరిమికొట్టే సూపర్ పవర్.. బ్లాక్ చికెన్ తింటే ఇన్ని లాభాలా..
Kadaknath Chicken

Updated on: Jan 09, 2026 | 3:57 PM

కడక్‌నాథ్ కోడి.. దీనిని సాధారణంగా నల్ల కోడి అని పిలుస్తారు. ఇది దాని ప్రత్యేక రుచి, అపారమైన ఆరోగ్య ప్రయోజనాలతో ఇటీవల చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. నల్లటి మాంసం, విలక్షణమైన రుచికి ప్రసిద్ధి చెందిన కడక్‌నాథ్ కోడి.. దేశీ కోడి మాంసంతో పోలిస్తే ఇది మెరుగైన రుచిని కలిగి ఉంటుంది. కనిపించడానికి నల్లగా ఉన్నప్పటికీ, దాని రుచి అద్భుతంగా ఉంటుందని పేర్కొంటున్నారు డైటీషియన్లు.. ఈ అరుదైన అడవి జాతి కోళ్లను మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి ప్రత్యేకంగా తీసుకొచ్చి పెంచి విక్రయిస్తుంటారు.. కరోనా సమయంలో కూడా దీని ప్రాముఖ్యత మరింత పెరిగింది. దీనిని ఆదివాసీలు తరచుగా తినేవారని, ఇది రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో చాలా ఉపయోగపడుతుందని చెబుతారు.

కడక్‌నాథ్ కోడి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు..

ఈ కడక్‌నాథ్ కోడి మాంసం అనేక ఆరోగ్య సమస్యల నివారణలో తోడ్పడుతుంది. బీపీ, షుగర్ వంటి వ్యాధులతో బాధపడే వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇది నరాల బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది.

అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇందులో కొలెస్ట్రాల్ దాదాపు తక్కువగా ఉంటుంది. ఇతర కోళ్లతో పోలిస్తే.. చాలా తక్కువని అంటున్నారు నిపుణులు.. ఈ విశిష్ట లక్షణాల కారణంగా, దీనిని తరచుగా మంచి ఆహారంగా అభివర్ణిస్తారు.

ఇవి కూడా చదవండి

ఇందులో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది.ఇది కండరాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇతర కోడి జాతులతో పోలిస్తే తక్కువ కొవ్వు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక అని డైటీషియన్లు పేర్కొంటున్నారు.

​దీనిలోని యాంటీఆక్సిడెంట్స్ ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి.. ఇంకా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు, మేలు చేసే ఫ్యాటీ యాసిడ్స్ శరీరానికి శక్తిని అందించి అనారోగ్య సమస్యలను తగ్గిస్తాయని పేర్కొంటున్నారు.

ధర కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, దాని వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వినియోగదారులు దీనిని ఎంతో ఇష్టపడుతుంటారు. ఇది సాధారణ కోడి కూరల కంటే ఇది మటన్ కూరను మించి ఉంటుంది. అయితే.. ఈ బ్లాక్ చికెన్ ను సాధారణ చికెన్ మాదిరిగానే వండుకోవచ్చు.. కానీ.. నాటు కోడి టైప్ వండుకోవాలి. అయితే.. కేజీ కడక్‌నాథ్ కోడి మాంసం దాదాపు రూ. 1200 నుంచి 1500 వరకు ఉంటుందని పేర్కొంటున్నారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..