
ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా జుట్టు సమస్యలతో బాధ పడేవారి సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. జుట్టు రాలడం, చిట్లడం, చుండ్రు, జుట్టు పల్చగా ఉండం, హెయిర్ గ్రోత్ ఆగిపోవడం ఇంకా అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. జుట్టు సమస్యల్ని తగ్గించుకోవడానికి ఇప్పటికే ఎన్నో ప్రాడెక్ట్స్, టిప్స్ ట్రై చేసే ఉంటారు. ఒకసారి ఈ ట్రిక్ కూడా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే అన్నీ.. అందరికీ పడవు. హెయిర్ గ్రోత్ చేయడంలో ఉసిరి, కరివేపాకు ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. కాబట్టి వీటితో తయారు చేసే డ్రింక్ నెల రోజులు తాగితే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. దీని సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పెద్ద ఖర్చు కూడా ఏమీ ఉండదు. మరి ఈ జ్యూస్ ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూద్దాం.
కొన్ని కరివేపాకు, కొద్దిగా అల్లం, రెండు ఉసిరికాయలు తీసుకోవాలి. వీటిని ముందుగా బాగా నీటితో కడిగి.. ఆ తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నెక్ట్స్ వీటిని మిక్సీ జార్‌లో వేసి, తగినన్ని నీళ్లు వేసి జ్యూస్‌లా చేయాలి. ఆ జ్యూస్‌ను రోజూ ఉదయం తాగండి. ఈ జ్యూస్ కేవలం జుట్టును పెంచేందుకే కాదు.. శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అంతే కాకుండా చర్మం కూడా కాంతివంతంగా తయారవుతుంది. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగు పడుతుంది. అయితే అలెర్జీ సమస్యలు ఉన్నవారు ఈ జ్యూస్ తాగకపోవడమే బెటర్. ఈ జ్యూస్ ఇలా తాగలేని వారు నల్ల ఉప్పు కొద్దిగా లేదా తేనె కలుపుకుని అయినా తాగొచ్చు.
కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు,ఐరన్, క్యాల్షియం అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు ఎదుగుదలకు సహాయ పడుతుంది. జుట్టు పల్చబడటాన్ని తగ్గిస్తుంది. అల్లంలో కూడా యాంటీ ఇన్లమెంటరీ గుణాలు, స్టిములేటింగ్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది స్కాల్ఫ్ పై రక్త ప్రసరణను వేగవంతం చేస్తుంది. చుండ్రును అడ్డుకుంటుంది. ఇక ఉసిరి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఉసిరిలో అనేక అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. దీన్ని ఆయుర్వేదంలో దీర్ఘకాలిక సమస్యల్ని తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఉసిరిని ఉపయోగిండం వల్ల జుట్టు అందం పెరగడమే కాకుండా.. ఆరోగ్యం ఉంటుంది. హెయిర్ గ్రోత్ అయ్యేలా ప్రేరేపిస్తుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.