ఇంట్లో పెరుగు పుల్లగా మారుతుందా..? ఈ టిప్స్​ పాటిస్తే అద్భుతమైన రుచి గ్యారెంటీ!

|

May 11, 2024 | 5:16 PM

కాబట్టి సాధ్యమైనంత వరకు రాత్రి సమయంలో పెరుగు తోడు పెట్టేలా చూసుకోవాలి. అలాగే, మీరు పెరుగును వేడి ప్రదేశంలో ఉంచినట్లయితే, అది త్వరగా పుల్లగా మారుతుంది. పెరుగును ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత కంటే కొంచెం చల్లగా ఉండే ప్రదేశంలో లేదా ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. పెరుగు గిన్నెపై కచ్చితంగా మూత పెట్టాలి. లేకపోతే పెరుగు రుచి పుల్లగా అవుతుంది.

ఇంట్లో పెరుగు పుల్లగా మారుతుందా..? ఈ టిప్స్​ పాటిస్తే అద్భుతమైన రుచి గ్యారెంటీ!
Curd
Follow us on

ఎండలు మండిపోతున్నాయి. కుండలో పెట్టి ఉడకబెట్టినట్టుగా వేడి, ఉక్కపోత చంపేస్తున్నాయి. ఇలాంటి వేసవి వాతావరణంలో ఆహారాలు కూడా త్వరగా పాడైపోతుంటాయి. అధిక ఉష్ణోగ్రత, తేమ ఉన్న ప్రదేశాలలో బ్యాక్టీరియా వేగంగా పెరగడం ప్రారంభిస్తుంది. అలాంటప్పుడు ఆహారం నిల్వ చేయడంలో కొంచెం అజాగ్రత్త వహించినా కూడా అవి పారేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా పాల ఉత్పత్తులు ఎక్కువ త్వరగా పాడవుతుంటాయి. పెరుగు త్వరగా పుల్లగా మారుతుంది. కానీ, మీరు దానిని సరిగ్గా నిల్వ చేస్తే పులుపు బాధనుండి దూరంగా ఉంచవచ్చు. మీరు మీ ఇంట్లో తయారుచేసిన పెరుగు పుల్లగా మారకుండా కాపాడుకోవడానికి అనుసరించాల్సిన కొన్ని చిట్కాలను ఇక్కడ చూద్దాం.

పాలను బాగా మరిగించాలి. తోడు వేయడానికి ఉపయోగించే పెరుగు పుల్లగా లేకుండా చూసుకోవాలి. పెరుగు పుల్లగా మారకుండా ఉండేందుకు ఒక తెలివైన ఉపాయం ఏమిటంటే, వేడి పాలల్లో కాకుండా గోరువెచ్చగా ఉన్నప్పుడే పెరుగు కలిపి మూత పెట్టాలి. దీన్ని మరీ స్టౌకి దగ్గరగా పెట్టొద్దు. పెరుగును మట్టిపాత్రలో లేదా సిరామిక్‌ గిన్నెలో తోడు పెడితే…గట్టిగా తోడుకుంటుంది. పెరుగు కమ్మగా కూడా ఉంటుంది. మీరు ఇంట్లో పాలు తోడు పెట్టేటప్పుడు అందులో కొవ్వు తీయని పాలను ఉపయోగించండి. ఈ పాలతో తోడు పెట్టిన పెరుగు ఎంతో టేస్టీగా ఉంటుంది.

పాలలో పెరుగు తోడుకు వేసేముందు.. ఆ పాలలోని కొంత భాగాన్ని తీసుకొని అందులో పెరుగు వేసి బాగా కొట్టాలి. తర్వాత మొత్తం పాలలో వేసి కలిపేయండి. ఇప్పుడు తోడు పెట్టిన పాలలో ఒక మిర్చిని వేసి మూత పెట్టండి. ఇలా మిర్చి వేయడం వల్ల గడ్డ పెరుగు తయారవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

పెరుగు కమ్మగా ఉండాలంటే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం కూడా గుర్తుంచుకోవాలి. కొంత మంది పెరుగును పగలు తోడు పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల పెరుగు గడ్డగా మారకుండా నీళ్లుగా, పల్చగా వస్తుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రాత్రి సమయంలో పెరుగు తోడు పెట్టేలా చూసుకోవాలి.

అలాగే, మీరు పెరుగును వేడి ప్రదేశంలో ఉంచినట్లయితే, అది త్వరగా పుల్లగా మారుతుంది. పెరుగును ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత కంటే కొంచెం చల్లగా ఉండే ప్రదేశంలో లేదా ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. పెరుగు గిన్నెపై కచ్చితంగా మూత పెట్టాలి. లేకపోతే పెరుగు రుచి పుల్లగా అవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..