మధుమేహ వ్యాధిగ్రస్తుల డైట్ విషయంలో ఎప్పుడూ సందిగ్ధతకు లోనవుతుంటారు. ఏది తినాలి? ఏది తినకూడదు అనే క్లారిటీ ఉండదు. సీజనల్ పండ్ల విషయంలో ఈ సందిగ్ధం మరింత ఎక్కువగా ఉంటుంది. ఇక వేసవిలో నోరూరించే మామిడి పండ్లు ఎవరైనా తినకుండా ఉండగలరా..? షుగర్ పేషెంట్లు మామిడిపండు తినొచ్చా.. లేదా అనే సందేహం వెంటాడుతూనే ఉంటుంది. కారణం మామిడి పండ్లు రుచికి తియ్యగా ఉండటమే.
న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ ప్రకారం.. 100 గ్రాముల మామిడి పండులో 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అంటే ఈ పండ్లు తింటే రక్తంలో చక్కెర పెరిగే అవకాశం ఉంది. అలాగని మరీ మడికట్టుకుని కోర్చోనవరసరం లేదని, మితంగా తినొచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మామిడి పండ్లను మితంగా తినవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులు మామిడికాయ ముక్కలు ఒకటి లేదా రెండు తినడం మంచిదేనని అంటున్నారు.ఐతే మామిడి పండ్లను తినే విధానంలో కొన్ని మార్పులు చేర్పులు అవసరం. ఆ విధంగా తింటేనే మామిడిలో ఉండే ఫైబర్ చక్కెరను స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. అంటే మామిడి పండ్లను తిన్న తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులోనే ఉంటాయన్నమాట. మామిడిలో అధికంగా పోషక విలువలు, తక్కువ గ్లైసెమిక్ స్థాయిలు ఉంటాయి.
మరిన్ని ఆరోగ్య సమాచారం కోసం క్లిక్ చేయండి.