Pregnant: గర్భిణీలు థియేటర్‌లో సినిమాలు చూడొచ్చా.? ఏమైనా నష్టాలు ఉంటాయా.?

ప్రతీ మహిళ జీవితంలో తల్లి కాబోయే దశ చాలా కీలకమనే విషయం తెలిసిందే. గర్భిణీగా ఉన్న సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అప్పటి వరకు ఎలాంటి నిబంధనలు లేకుండా ఉన్న మహిళల జీవితాల్లో ఒక్కసారిగా ఆహారం, నడక, జీవన విధానంలో అనేక మార్పులు..

Pregnant: గర్భిణీలు థియేటర్‌లో సినిమాలు చూడొచ్చా.? ఏమైనా నష్టాలు ఉంటాయా.?
Representative Image
Follow us

|

Updated on: Apr 23, 2023 | 3:28 PM

ప్రతీ మహిళ జీవితంలో తల్లి కాబోయే దశ చాలా కీలకమనే విషయం తెలిసిందే. గర్భిణీగా ఉన్న సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. అప్పటి వరకు ఎలాంటి నిబంధనలు లేకుండా ఉన్న మహిళల జీవితాల్లో ఒక్కసారిగా ఆహారం, నడక, జీవన విధానంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కడుపులోని బిడ్డ ఆరోగ్యాన్ని, తన ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎంతో జాగ్రత్తగా ఉంటారు. వైద్యులు కూడా తీసుకునే ఆహారం నుంచి అన్ని విషయాలపై సూచనలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే గర్భిణీలు చేసే విషయంలోనూ పలు అనుమానాలు ఉంటాయి. పలానా పండు తినొచ్చా.? పలానా డ్రింక్‌ తాగొచ్చా.? అని ఆలోచిస్తుంటారు. అయితే ఇలాంటి ఓ సందేహమే గర్భిణీలు థియేటర్‌లో సినిమాలు చూడొచ్చా.? ఈ ప్రశ్నకు వైద్యులు ఏం సమాధానం చెబుతున్నారంటే..

సాధారణంగా మహిళ గర్భిణీగా ఉన్న సమయంలో వీలైనంత వరకు జర్నీని అవైడ్‌ చేయాలని వైద్యులు సూచిస్తారు. అయితే వృత్తి లేదా ఇతర అవసరాల దృష్ట్యా గుంతలు లేని మార్గాల్లో ప్రయణిస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఈ క్రమంలోనే గర్భిణీలు థియేటర్లలో సినిమాలు చూస్తే నిజానికి పెద్దగా ఎలాంటి ప్రమాదం ఉండకపోయినప్పటికీ కొన్ని అంశాలు మాత్రం కచ్చితంగా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. థియేటరల్లో సినిమా చూడడం వల్ల కడుపులో పిండంపై ప్రభావం పడుతుందని ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకపోయినప్పటికీ తల్లి మానసిక స్థితిపై కొంతమేర ప్రభావం చూపుతుంది.

చీకట్లో సినిమా చూడడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. దీనికి కారణం గర్భంతో ఉన్న మహిళ శరీరంలో హార్మోన్లలో వచ్చే వ్యత్యాసాల వల్ల కంటి నరాల ప్రభావం పడే అవకాశాలు ఉంటాయి. ఇక థియేటర్లలో పెద్ద ఎత్తున వచ్చే సౌండ్‌ వల్ల రక్తపోటు పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే భయానక సన్నివేశాలు కూడా రక్తపోటు పెరగడానికి కారణంగా చెప్పొచ్చు. అయితే గర్భిణీలు తక్కువ సౌండ్‌తో మంచి మ్యూజిక్‌ వినడం, పుస్తకాలు చదవడం, యోగ, ధ్యానం వంటివి చేయడం ద్వారా తల్లి ఆరోగ్యంతో పాటు కడుపులో బిడ్డ ఆరోగ్యం కూడా మెరుగువుతుంది.

నోట్‌: పైన తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల నిపుణుల సూచనలు పాటించడం ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..