AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IRCTC Tours: ఐఆర్‌సీటీసీ ‘డివైన్ కర్ణాటక’ ప్యాకేజీ వివరాలు ఇవి.. తక్కువ రేటులోనే విమానంలో వెళ్లి రావొచ్చు..

ఆధ్యాత్మిక చింతన ఉన్న వారికి కర్ణాటకలో పలు ప్రాంతాలు మంచి అనుభూతిని ఇస్తాయి. ఆయా కేంద్రాలను సందర్శించేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజమ్‌ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. డివైన్‌ కర్ణాటక పేరుతో ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఉండేలా ఈ టూర్‌ ప్యాకేజీని తీర్చిదిద్దింది. కర్ణాటకలోని ధర్మస్థల, గోకర్ణ, హొరనాడు, కొల్లూరు, మంగళూరు, మురుడేశ్వర, శృంగేరి, ఉడుపి ప్రాంతాలను ఈ ప్యాకేజీలో సందర్శించవచ్చు.

IRCTC Tours: ఐఆర్‌సీటీసీ ‘డివైన్ కర్ణాటక’ ప్యాకేజీ వివరాలు ఇవి.. తక్కువ రేటులోనే విమానంలో వెళ్లి రావొచ్చు..
Tourist Places In Karnataka
Madhu
|

Updated on: Aug 29, 2023 | 10:00 AM

Share

కర్ణాటక అంటే మీకు మొదట గుర్తొచ్చేది బెంగళూరు మాత్రమే. దేశంలోనే ప్రముఖ నగరాల్లో దీనికి పేరుంది. అందరూ ఈ నగరాన్ని సందర్శించడానికి ఇష్టపడతారు. అయితే కర్ణాటకలో అంతకుమించిన దర్శనీయ క్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన ఉన్న వారికి కర్ణాటకలో పలు ప్రాంతాలు మంచి అనుభూతిని ఇస్తాయి. ఆయా కేంద్రాలను సందర్శించేందుకు ఐఆర్‌సీటీసీ టూరిజమ్‌ ప్రత్యేక ప్యాకేజీని తీసుకొచ్చింది. డివైన్‌ కర్ణాటక పేరుతో ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఉండేలా ఈ టూర్‌ ప్యాకేజీని తీర్చిదిద్దింది. కర్ణాటకలోని ధర్మస్థల, గోకర్ణ, హొరనాడు, కొల్లూరు, మంగళూరు, మురుడేశ్వర, శృంగేరి, ఉడుపి ప్రాంతాలను ఈ ప్యాకేజీలో సందర్శించవచ్చు. వచ్చే అక్టోబర్‌ 8న ప్రారంభమయ్యే ఈ టూర్‌ ప్యాకేజీ ధర రూ. 30,550 నుంచి ప్రారంభమవుతుంది. డివైజ్‌ కర్ణాటక టూర్‌ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

టూర్‌ వివరాలు ఇవి..

  • ప్యాకేజీ పేరు: డివైన్‌ కర్ణాటక(ఎస్‌హెచ్‌ఏ08)
  • వ్యవధి: ఐదు రాత్రిళ్లు, ఆరు పగళ్లు
  • ప్రయాణ సాధనం: విమానం
  • ప్రయాణ తేదీ: 2023 అక్టోబర్‌ 08
  • సందర్శించే ప్రాంతాలు: ధర్మస్థల, గోకర్ణ, హొరనాడు, కొల్లూరు, మంగళూరు, మురుడేశ్వర, శృంగేరి, ఉడుపి

పర్యటన సాగుతుందిలా..

డే1(హైదరాబాద్‌-మంగుళూరు): ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. మంగళూరు విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ మిమ్మల్ని ఐఆర్‌సీటీసీ సిబ్బంది పికప్ చేసుకొని హోటల్‌కు తరలిస్తారు. అక్కడ అల్పాహారం చేశాక, మంగళ దేవి ఆలయం, కద్రి మంజునాథ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం తన్నెరభావి బీచ్, కుద్రోలి గోకర్నాథ ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి డిన్నర్‌ చేసి మంగుళూరులోనే బస చేస్తారు.

డే2(మంగుళూరు-ఉడుపి): హోటల్‌లో అల్పాహారం చేశాక హోటల్లో చెక్ అవుట్ చేసి.. మంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడుపీకి బయలుదేరుతారు. అక్కడ శ్రీ కృష్ణ దేవాలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం సెయింట్ మేరీస్ ద్వీపం, మాల్పే బీచ్ చూస్తారు. సాయంత్రం శ్రీ కృష్ణ ఆలయాన్ని సందర్శిస్తారు. ఉడుపీలోనే డిన్నర్‌ చేసి అక్కడే రాత్రి బస చేస్తారు.

ఇవి కూడా చదవండి

డే3(ఉడుపి – హొరనాడు – శృంగేరి – ఉడుపి): హోటల్‌లో అల్పాహారం చేశాక, ఉడుపీ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న హొరనాడుకు బయలుదేరుతారు. అక్కడ అన్నపూర్ణేశ్వరి ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత అక్కడి నుంచి శృంగేరికి వెళ్లి ఆలయాన్ని సందర్శింస్తారు. సాయంత్రం తిరిగి ఉడుపీకి చేరుకొని రాత్రి బస చేస్తారు.

డే4(ఉడిపి – కొల్లూరు – గోకర్ణ – మురుడేశ్వర్): హోటల్‌లో అల్పాహారం చేశాక చెక్ అవుట్ చేసి కొల్లూరుకు బయలుదేరుతారు. అక్కడ మూకాంబిక ఆలయాన్ని సందర్శించి, మధ్యాహ్నం గోకర్ణానికి బయలుదేరుతారు. ఆలయం, బీచ్ సందర్శిస్తారు. మురుడేశ్వర్‌లోనే రాత్రి బస చేస్తారు.

డే5(మురుడేశ్వర్ – ధర్మస్థల – కుక్కే): హోటల్‌లో అల్పాహారం చేశాక మురుడేశ్వర్ ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధర్మస్థలంనకు బయలుదేరుతారు. మంజునాథ ఆలయాన్ని సందర్శిస్తారు. సాయంత్రం కుక్కే సుబ్రహ్మణ్యానికి వెళ్లి అక్కడే రాత్రి బస చేస్తారు.

డే6(కుక్కే – మంగళూరు – హైదరాబాద్): హోటల్‌లో అల్పాహారం. సుబ్రహ్మణ్య ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం మంగుళూరుకు చేరుకొని సాయంత్రం 7 గంటలకు మంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. దీంతో పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ ధరలు ఇలా..

హోటల్లో ఒక్కరే ఉండాలనుకొంటే ఒక్కొక్కరికీ రూ. 41,000 చార్జ్‌ చేస్తారు. అదే డబుల్‌ ఆక్యుపెన్సీ అయితే రూ. 31,900, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ అయితే రూ. 30,550 తీసుకుంటారు. ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల పిల్లలకు ప్రత్యేకమైన బెడ్‌ అవసరం అవసరం అయితే రూ. 26,550, బెడ్‌ అవసరం లేకపోతే రూ. 23,900 చార్జ్‌ చేస్తారు. అదే రెండు నుంచి నాలుగేళ్ల పిల్లలకు ప్రత్యేక బెడ్‌ లేకుండా రూ. 19,250 తీసుకుంటారు.

ప్యాకేజీలో కవర్‌అయ్యేవి..

డివైన్‌ కర్ణాటక టూర్‌ ప్యాకేజీలో తీసుకుంటున్న మొత్తంపై విమాన టికెట్లు హైదరాబాద్-మంగళూరు-హైదరాబాద్ కవర్‌ అవుతాయి. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం అందిస్తారు. మధ్యాహ్నం భోజనం పర్యాటకులే సమకూర్చుకోవాలి. అక్కడ స్థానికంగా తిరగడానికి ఏసీ వాహన సదుపాయం కల్పిస్తారు. ట్రావెల్‌ ఇన్సురెన్స్‌ ఇస్తారు. ఐఆర్‌సీటీసీ టూర్‌ ఎస్కార్ట్‌సేవలు లభిస్తాయి. మరిన్ని వివరాలకు ఐఆర్‌సీటీసీ టూరిజమ్‌ అధికారిక వెబ్‌ సైట్లోకి వెళ్లి దానిలో టూర్‌ ప్యాకేజీల విభాగంలో డివైన్‌ కర్ణాటకపై క్లిక్‌ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..