ఈ మిశ్రమాన్ని చీలమండలు, పాదాలు, మోకాళ్లపై చాలా బాగా అప్లై చేయాలి. ముఖ్యంగా చీలమండల దగ్గర బాగా అప్లై చేయండి. ఇది మృతకణాలను తొలగించి పాదాల చర్మం మృదువుగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని అప్లై చేసిన తర్వాత నిమ్మతొక్కతో బాగా రుద్దడం మర్చిపోవద్దు. ఇది మురికిని వేగంగా తొలగిస్తుంది. గోర్లు, చీలమండలు, మోకాళ్లను నిమ్మతొక్కతో బాగా రుద్దండి. అనంతరం నీటితో కడగాలి లేదా తడి టిష్యూతో బాగా తుడవండి.