AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: అమ్మాయిలతో అట్లుంటది మరి.. బాలకృష్ణ స్పీచ్ ఇస్తుండగా శ్రీలీల చేసిన పని చూస్తే నవ్వాగదు..

తాజాగా హీరోయిన్ శ్రీలీల కూడా అలాగే తన బొట్టును సరిచేసుకుంటున్న వీడియో నెట్టింట వైరలవుతుంది. అంతేకాదు.. ఆమెకు సహకరిస్తోన్న సాయి మంజ్రేకర్.. వీరిద్దరి ఎక్స్ ప్రెషన్స్ నవ్వులు పూయిస్తుంది. అయితే వీరిద్దరు తమ పనిలో తాము బొట్టు సరిచేసుకుంటుండగా.. ముందు మాత్రం బాలకృష్ణ సీరియస్ గా స్పీచ్ ఇస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

Sreeleela: అమ్మాయిలతో అట్లుంటది మరి.. బాలకృష్ణ స్పీచ్ ఇస్తుండగా శ్రీలీల చేసిన పని చూస్తే నవ్వాగదు..
Saiee Manjrekar, Sreeleela
Rajitha Chanti
|

Updated on: Aug 29, 2023 | 12:25 PM

Share

అమ్మాయి అంటేనే అందం.. నిజంగానే ఆడవాళ్లు అందంగా కనిపేందుకు ప్రాధాన్యత ఇస్తుంటారు. ఫంక్షన్స్, ఫెస్టివల్స్, ఈవెంట్స్ ఇలా ప్రతి చిన్న సందర్భానికి గంటల తరబడి ముస్తాబవుతుంటారు. ఇక ఎక్కడైనా వేడుకలో పాల్గొంటే వారిపై వారే ఎక్కువగా శ్రద్ధ చూసుకుంటారు. చాలా సందర్భాల్లో కొందరు హీరోయిన్స్ హెయిర్స్, డ్రెస్సింగ్, స్టిక్కర్స్ అడ్జస్ట్ చేసుకుంటూ కనిపిస్తుంటారు. ఇక తాజాగా హీరోయిన్ శ్రీలీల కూడా అలాగే తన బొట్టును సరిచేసుకుంటున్న వీడియో నెట్టింట వైరలవుతుంది. అంతేకాదు.. ఆమెకు సహకరిస్తోన్న సాయి మంజ్రేకర్.. వీరిద్దరి ఎక్స్ ప్రెషన్స్ నవ్వులు పూయిస్తుంది. అయితే వీరిద్దరు తమ పనిలో తాము బొట్టు సరిచేసుకుంటుండగా.. ముందు మాత్రం బాలకృష్ణ సీరియస్ గా స్పీచ్ ఇస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రధాన పాత్రోల మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన లేటేస్ట్ చిత్రం స్కంద. ఇందులో శ్రీలీల, సాయి మంజ్రేకర్ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 15న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది చిత్రయూనిట్. ఈ వేడుకకు నందమూరి హీరో బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది శ్రీలీల. ఇప్పటివరకు యాక్టింగ్, డాన్స్ లో బెస్ట్ అనిపించుకున్న ఆమె.. స్కంద ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికపై తమన్ తో కలిసి సాంగ్ పాటి అదరగొట్టింది. మ్యూజిక్ కు తగినట్లుగా డాన్స్ చేస్తూ తమన్ తో కలిసి సాంగ్ పాడి ఆకట్టుకుంది శ్రీలీల.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

అయితే ఈ వేడుకలో బాలకృష్ణ స్పీచ్ ఇస్తుండగా.. వెనకే ఉన్న శ్రీలీల ఫ్యాన్స్ ను చూస్తూ నమస్కారం చేసి వెంటనే ముఖానికి చేతులు అడ్డు పెట్టింది. ఇక అదే సమయంలో ఆమె నుదుటిన ఉన్న బొట్టు శ్రీలీల అరచేతికి తాకగా.. దానిని సరిచేసుకునేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత ఆమె సాయి మంజ్రేకర్ ను బొట్టు సరిచేయాలని అడగ్గా… ఆమె శ్రీలీలకు సలహాలు ఇస్తుంటుంది. అయితే ముందు బాలకృష్ణ స్పీచ్ ఇస్తుండగా.. వీరిద్దరు మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Sreeleela (@sreeleela14)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.