International Yoga Day Special 2022: ప్రతీ రోజూ ఈ 5 ఆసనాలు వేశారంటే నిత్య యవ్వనం మీ సొంతం..

| Edited By: Anil kumar poka

Jun 20, 2022 | 4:15 PM

వయసుతో సంబంధంలేకుండా నిత్యయవ్వనంగా కన్పించాలంటే ఆరోగ్యంతోపాటు మానసికోల్లాసం కూడా కీలకమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. వయసు పెరిగేకొద్ది శరీరంలో శక్తి నశించి అలసట, కీళ్ళ నొప్పులు, కండరాల బలహీనత.. నెమ్మదిగా ప్రవేశిస్తాయి. వృద్ధాప్యంలోకి అడుగు..

International Yoga Day Special 2022: ప్రతీ రోజూ ఈ 5 ఆసనాలు వేశారంటే నిత్య యవ్వనం మీ సొంతం..
Yoga For Seniors
Follow us on

Yoga for Seniors: వయసుతో సంబంధంలేకుండా నిత్యయవ్వనంగా కన్పించాలంటే ఆరోగ్యంతోపాటు మానసికోల్లాసం కూడా కీలకమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. వయసు పెరిగేకొద్ది శరీరంలో శక్తి నశించి అలసట, కీళ్ళ నొప్పులు, కండరాల బలహీనత.. నెమ్మదిగా ప్రవేశిస్తాయి. వృద్ధాప్యంలోకి అడుగుపెట్టారనడానికి ఇవే సంకేతాలు. ఐతే ఈ కింది 5 వ్యాయామాలను మీ దినచర్యలో భాగం చేసుకుంటే శారీరకంగా, మానసికంగానూ ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉంటారు. అవేంటో తెలుసుకుందాం..

తడాసనం
60 ఏళ్లు పైబడిన వాళ్లు ప్రతి రోజూ సులువుగా వేయదగ్గ యోగాసలనాల్లో తడాసనం ఒకటి. ముఖ్యంగా ఛాతి భాగం, వీపు, కాళ్ల భంగిమను సరిచేయడానికి ఈ ఆసనం ఎంతో సహాయపడుతుంది. అంతేకాకుండా రక్త ప్రసరణను మెరుగుపడుతుంది. ఇంకా ఒత్తిడిని తగ్గించుకోవడానికి, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి తడాసనం ఉపయోగపడుతుంది.

ఉత్తానాసనం
శరీర వెనుక భాగానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను నివారించడంలో ఉత్తానాసనం బెస్ట్‌. ముఖ్యంగా దీర్ఘకాలిక వెన్నునొప్పి నుంచి ఉపశమనానికి, రక్త ప్రసరణకు సహాయపడుతుంది. స్ట్రెస్‌ నుంచి కూడా దూరం చేస్తుంది.

ఇవి కూడా చదవండి

బద్ధ కోనాసనం
ఈ ఆసనం సీతాకోకచిలుక భంగిమ ఆకారంలో ఉంటుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆసనాన్ని వేయాలి. మూత్రాశయాన్ని ప్రేరేపించడానికి, కిడ్నీ సమస్యల పరిష్కారానికి, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి, స్త్రీలలో మెనోపాజ్ సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి ఈ ఆసనం ఉపకరిస్తుంది.

భుజంగాసనం
వెన్నెముక గాయాలు, నడుము నొప్పి ఇతర వెన్ను సంబంధిత సమస్యలతో బాధపడేవాళ్లు ప్రతి రోజూ వేయదగ్గ ఆసనం ఇది. వెన్నెముఖ ధృడత్వానికి, భుజాలు – ఛాతీలపై ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఆసనం వేసినప్పుడు కడుపు కింది భాగం (పొత్తికడుపు)ను సాగదీయడం వల్ల నడుము భాగం నిటారుగా నిలపడానికి ఉపకరిస్తుంది.

శవాసనం
యోగ ఆసనాలలో ఎక్కువ మంది ఇష్టం చేసే ఆసనం.. శవాసనం. యోగాసనాలు వేసిన ప్రతీసారి చివరిగా వేసే ఆసనం శవాసనం. వెల్లకిలా పడుకోవడం వల్ల శ్వాస కూడా ఏకరీతిగా ఉంటుంది. నిద్రలేమి, మలబద్ధకం, ఏకాగ్రత మెరుగుదల, ఒత్తిడిని అధిగమించడానికి ఈ ఆసనం సహాయపడుతుంది.

వీటితోపాటు వయసు పైబడినవాళ్లు వేయదగ్గ ఆసనాల్లో.. వజ్రాసనం, విరాభద్రాసనం, త్రికోణాసనం, వృక్షాసనం, పశ్చిమోత్తనాసనం, బాలాసనం, అర్ధ పవనముక్తాసనం, సేతు బంధాసనం వంటి ఇతర ప్రసిద్ధ యోగాసనాలు కూడా ఉన్నాయి. వీటిని ప్రతి రోజూ ఉదయం సులువుగా వేయవచ్చు. ఒకవేళ ఈ ఆసనాలు వేయడంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే డాక్టర్‌ను సంప్రదించండి.