2030 నాటికి చైనాను మించిపోతాం .. ఆ విషయంలో రెండోస్థానం మనదే..‌‌!

వాపు చూసి బలుపు అనుకుంటారు కొందరు. ముఖ్యంగా చిన్నపిల్లలు బొద్దుగా కనిపించేసరికి చాల ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటారు. చిన్నవయసులో ఇది బాగానే ఉన్నప్పటికీ ఎదిగే కొద్దీ ఊబకాయులుగా మారితే మాత్రం ఇది అత్యంత ప్రమాదకరమని ప్రపంచ ఒబెసిటీ ఫెడరేషన్ నివేదిక వెల్లడించింది. ఊబకాయం కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదని, అది ఒక వ్యాధివంటిదని ఈ నివేదిక తెలిపింది. రోజు రోజుకు పిల్లల్లో ఊబకాయుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా అధికంగా ఉంది. ఇది తగ్గేంచే ప్రయత్నాల్లో అన్ని దేశాలు […]

2030 నాటికి చైనాను మించిపోతాం .. ఆ విషయంలో రెండోస్థానం మనదే..‌‌!
Follow us

| Edited By:

Updated on: Oct 05, 2019 | 8:48 PM

వాపు చూసి బలుపు అనుకుంటారు కొందరు. ముఖ్యంగా చిన్నపిల్లలు బొద్దుగా కనిపించేసరికి చాల ఆరోగ్యంగా ఉన్నారని అనుకుంటారు. చిన్నవయసులో ఇది బాగానే ఉన్నప్పటికీ ఎదిగే కొద్దీ ఊబకాయులుగా మారితే మాత్రం ఇది అత్యంత ప్రమాదకరమని ప్రపంచ ఒబెసిటీ ఫెడరేషన్ నివేదిక వెల్లడించింది. ఊబకాయం కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదని, అది ఒక వ్యాధివంటిదని ఈ నివేదిక తెలిపింది. రోజు రోజుకు పిల్లల్లో ఊబకాయుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా అధికంగా ఉంది. ఇది తగ్గేంచే ప్రయత్నాల్లో అన్ని దేశాలు దాదాపు విఫలమైనట్టు ఫెడరేషన్ పేర్కొంది.

196 దేశాల్లో తాజా అంచనా ప్రకారం 156 దేశాలు ఇప్పటికీ తమ లక్ష్యాలను చేరుకునే అవకాశం 10 శాతం కన్నా తక్కువే ఉందని తెలిపింది. మరో విస్తుగొలిపే అంశం ఏమిటంటే 2020 నాటికి ప్రపంచవ్యాప్తంగా 158 మిలియన్ల మంది ఊబకాయులైన పిల్లలు ఉండనున్నారని ఈ సంఖ్య 2030 నాటికి 254 మిలియన్లకు చేరనుందంటూ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇదిలా ఉంటే ఊబకాయుల్లో భారత్ రెండో స్ధానంలో ఉండటం బాధాకరం. భారత్‌లో ఒబెసిటీ సమస్య అధికంగానే ఉందని పేర్కొంది. 2030 నాటికి చైనా తర్వాత మన దేశంలోనే అత్యధిక సంఖ్యలో భారీ కాయులు ఉండనున్నారు.