AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రెంచ్ ఫ్రైస్ రోజూ తింటున్నారా.. బీ కేర్‌ఫుల్..!

ఫ్రెంచ్ ఫ్రైస్.. అమెరికాలో ఇది ఫేమస్ ఫుడ్.. కానీ ప్రస్తుతం మన భారతీయులు కూడా దీనిని ఎగబడి తింటున్నారు. అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే దేనితోనో తయారు చేసే ఫుడ్ అనుకుంటే పొరబాటే. ఇది మనకు నిత్యం దొరికే బంగాళదుంపతోనే తయారు చేసేవే. సాధారణంగా మన దేశంలో బంగాళదుంపలతో అనేక రకాల ఫ్రైలను తయారు చేస్తారు.  ఆలుగడ్డలను నిలువుగా, సన్నటి ముక్కలుగా కోసే విధానమే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్. అలా కోసిన వాటిని ఆయిల్‌లో ఫ్రై చేసి […]

ఫ్రెంచ్ ఫ్రైస్ రోజూ తింటున్నారా.. బీ కేర్‌ఫుల్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 06, 2019 | 5:15 PM

Share

ఫ్రెంచ్ ఫ్రైస్.. అమెరికాలో ఇది ఫేమస్ ఫుడ్.. కానీ ప్రస్తుతం మన భారతీయులు కూడా దీనిని ఎగబడి తింటున్నారు. అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే దేనితోనో తయారు చేసే ఫుడ్ అనుకుంటే పొరబాటే. ఇది మనకు నిత్యం దొరికే బంగాళదుంపతోనే తయారు చేసేవే. సాధారణంగా మన దేశంలో బంగాళదుంపలతో అనేక రకాల ఫ్రైలను తయారు చేస్తారు.  ఆలుగడ్డలను నిలువుగా, సన్నటి ముక్కలుగా కోసే విధానమే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్. అలా కోసిన వాటిని ఆయిల్‌లో ఫ్రై చేసి రెడీ చేస్తారు. ఇవి చాలా రుచికరంగా ఉంటాయి. చిప్స్‌ వలే ఇవి కూడా కరకరలాడతాయి. అయితే ప్రస్తుతం వీటిని చాలా మంది రోజు తినడం చేస్తున్నారు. అలా నిత్యం వీటిని తినడం ద్వారా పలు అనారోగ్య కారణాలకు గురవ్వడం ఖాయమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

నిత్యం ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం ద్వారా వచ్చే అనర్థాలు..

* నిత్యం ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం ద్వారా అధిక బరువు పెరిగే అవకాశం ఉంది. * వీటిలో పిండి పదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు వీటిని ఆయిల్‌లో వేసి తయారు చేస్తారు. దీనితో ఇవి రుచికరంగా ఉన్నా.. శరీరానికి హానీ కల్గిస్తాయి. * ఈ పిండి పదర్ధాలు శరీరంలో త్వరగా జీర్ణం కాక.. అధికంగా పేరుకు పోవడంతో బరువు పెరుగుతారు.

* వీటిని ఆరోగ్యానికి హాని చేసే ట్రాన్స్ ఫాట్స్‌లో ముంచి తీసి.. ఆయిల్ డిప్‌ ఫ్రై చేస్తారు. దీంతో గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ బారిన పడే ప్రమాదం ఉంది. * అంతేకాదు రోజు తింటే క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. * ఈ ఫ్రెంచ్ ఫ్రైలలో ఉప్పు అధికంగా ఉంటుంది. వీటిని అధికంగా తినడం ద్వారా మనకు తెలియకుండానే శరీరంలోకి సాల్ట్ ఎక్కువగా వెళ్తుంది. దీంతో మనకు బీపీ పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో హార్ట్ ఎటాక్, కిడ్నీ వ్యాధుల బారిన పడేలా చేసే అవకాశం ఉంది.

* అంతేకాదు వీటిలో అక్రిలామైడ్ ఉంటుంది. ఇది మెదడులోని నరాలను దెబ్బతీయడమే కాకుండా.. నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంది. ఇది క్రమంగా న్యూరోడీజనరేటివ్ వ్యాధికి దారితీస్తుంది.

ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఫుడ్‌పై అధ్యయనం చేసిన అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌ వారు ఈ వివరాలు తెలియజేశారు. 45 నుంచీ 79 ఏళ్ల వయసున్న మొత్తం 4,400 మంది డేటా సేకరించిన పరిశోధకులు.. దాదాపు ఎనిమిదేళ్ల పాటు వారిని పరిశీలించారు. వాళ్లంతా ఫ్రెంచ్ ఫ్రైలను వారానికి నాలుగైదు రోజులు తినేవారే. అయితే అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్‌ వారి పరిశోధన ముగిసేనాటికి వీరిలో 236 మంది చనిపోయారు. సో ఇకనుంచైనా ఫ్రెంచ్ ఫ్రైస్ రోజు తినే అలవాటు ఉన్నవారు.. మానేస్తే మీకే మంచిది. ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంటుంది.