
వాతావరణంలోని పరిస్థితులు నెమ్మదిగా మారుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఉండే కొద్దీ ఉష్ణోగ్రతలు ఇంకా మార్పు వస్తుంది. వడ దెబ్బ కూడా తగిలే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలోనే అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి మొదటి నుంచే ఆరోగ్య పరంగా మీరు కొన్ని రకాల జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ముఖ్యంగా మీరు తీసుకునే ఆహారంలో మార్పులు చేసుకోక తప్పదు. ఈ రకమైన ఆహారలు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు చాలా హెల్ప్ చేస్తాయి. అంతే కాకుండా రోగాలతో పోరాడేందుకు ఇమ్యూనిటీ లెవల్స్‌ను పెంచుతాయి. మరి వేసవి కాలంలో ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు చూద్దాం.
వేసవి కాలంలో తేలికగా ఉండే ఆహారాలు, త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలు తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.చలి కాలంలో తీసుకునే వేడి వేడి ఆహారాలు.. వేసవి కాలంలో తీసుకోకూడదు. అలాగే అధిక కొవ్వు, నూనెలతో తయారు చేసే వంటలు కూడా తీసుకోకుండా ఉండాలి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ దెబ్బ తినకుండా ఉంటుంది. వడ దెబ్బ కూడా తగలకుండా ఉంటుంది.
వేసవి కాలంలో చల్లగా, నీటి శాతం మెండుగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. దీని వల్ల జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఎండ దెబ్బ కూడ తగలకుండా ఉంటుంది. అదే విధంగా నీటి శాతం అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, బచ్చలి కూర, పొన్న గంటి కూర, పాల కూర వంటి ఆకు కూరలు తీసుకోవడం చాలా మంచిది.
డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటే చెరుకు రసం తాగడం చాలా ముఖ్యం. చెరుకు రసం తాగినా.. చెరకు ముక్కలు తిన్నా డీహైడ్రేషన్ సమస్య తగ్గుతుంది. అలాగే నిమ్మ రసంతో చేసిన పానీయాలు కూడా తాగుతూ ఉండాలి. ఉదయం గోరు వెచ్చటి పాలల్లో అటుకులు వేసి తినడం వల్ల కడుపు అనేది చల్లగా ఉంటుంది.
అదే విధంగా బార్లీ గింజల్లో నీళ్లు పోసి ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుని తాగితే చాలా మంచిది. ఎలాంటి ఇన్ ఫెక్షన్స్ రాకుండా ఉండొచ్చు. ఆరోగ్యంగా ఉంటారు. చిన్న పిల్లలకు పట్టిస్తే వడ దెబ్బ, డీహైడ్రేషన్‌కు గురి కాకుండా ఉంటారు. అలాగే టీ, కాఫీలు ఎక్కువగా తీసుకోకూడదు. మంచి నీళ్లు, మజ్జిగ, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.