Sleep Tips: నిద్ర సమస్యలకు చెక్.. దిండు కింద ఇవి పెట్టుకుంటే క్షణాల్లోనే డీప్ స్లీప్‌లోకి..
ప్రస్తుత కాలంలో ఎంతోమంది నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. సరైన నిద్ర లేక అనారోగ్యం బారిన పడుతున్నారు. ఆందోళన, ఒత్తిడి ఉంటే సరిగ్గా నిద్ర పట్టదు. అయితే కొన్ని చిట్కాలను ఫాలో అయితే మంచి నిద్ర పట్టే అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

మన ఆరోగ్యానికి నిద్ర చాలా ముఖ్యం. బాగా నిద్రపోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు నయం అవుతాయి. అంతేకాకుండా కొన్ని సమస్యలు దరిచేరవు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇటీవలి కాలంలో మంచి నిద్ర చాలా మందికి గగనంగా మారింది. రోజంతా కష్టపడి పనిచేసినప్పటికీ రాత్రి నిద్రపోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కానీ మీరు కొన్ని చిట్కాలను పాటిస్తే హాయిగా నిద్రపోవచ్చు. నిద్రలో శరీరం వివిధ ముఖ్యమైన పనులను నిర్వర్తిస్తుంది. మనం నిద్రపోయినప్పుడు.. కణాలు రీసెట్ అవుతాయి. క్యాన్సర్ కణాల నిర్మాణం, పెరుగుదలను నిరోధించడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రలో ఉత్పత్తి అయ్యే మెలటోనిన్ హార్మోన్ మనల్ని యవ్వనంగా, ఉంచుతుంది. వ్యాధులను నివారించడంలోనూ సహాయపడుతుంది. అందుకే నిద్ర మనిషికి నిద్ర చాలా అవసరం
నిద్ర సమస్యలు
చాలా మంది వివిధ రకాల నిద్ర సమస్యలతో బాధపడుతున్నారు. ఒత్తిడి, ఆందోళన వల్ల నిద్ర సరిగ్గా పట్టదు. మనస్సు చంచలంగా ఉన్నప్పుడు నిద్రపోవడం కష్టం. హార్మోన్ల అసమతుల్యత లేదా రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గుల వల్ల సరిగ్గా నిద్ర పట్టదు. చక్కెర స్థాయి పడిపోయినప్పుడు.. శరీరం మనల్ని మేల్కొనేలా చేస్తుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల అలసట వస్తుంది. మీకు నాసికా పాలిప్స్, సైనసిటిస్, ఆస్తమా, థైరాయిడ్ సమస్యలు లేదా విటమిన్ డి లోపం వంటి ఆరోగ్య సమస్యలు ఉంటే సరిగ్గా నిద్రపోవడం కష్టం.
బాగా నిద్రపోవడానికి ఈజీ మార్గాలు
రాత్రి 7-8 గంటలకు, మీరు గసగసాలు, చిటికెడు జాజికాయ పొడిని పాలలో కలిపి త్రాగవచ్చు. ఇది శరీరాన్ని ప్రశాంతంగా మార్చి.. నిద్ర వచ్చేలా చేస్తుంది. కొబ్బరి నూనెతో పాదాలను మసాజ్ చేయడం వల్ల నరాలు కూల్ అవుతాయి. అర్ధరాత్రి మేల్కొనే వారు రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి అరటిపండు తినవచ్చు.
ఉదయం ఒత్తిడిని తగ్గించడానికి 10 శ్వాస వ్యాయామాలు చేస్తే బాగుంటుంది. ఇది మనస్సును కూల్‌గా ఉంచుతుంది. నిద్ర తర్వాత కూడా అలసిపోయినట్లు అనిపించే వారు.. సాయంత్రం తేలికపాటి వ్యాయామం చేయడం లేదా ఎండలో నడవడం మంచిది. జీవక్రియను పెంచడానికి మీరు సాయంత్రం పూట పుదీనా టీ లేదా తులసి టీ తాగవచ్చు.
మెత్త కింద వీటిని పెట్టుకుంటే..
హెన్నా పూలు లేదా తులసి ఆకులను మీ దిండు కింద ఉంచుకోవచ్చు. వాటి సువాసన ప్రశాంతతను ఇస్తాయి. పడుకునే ముందు మంచి సంగీతం లేదా కథలు వింటూ నిద్రకు సిద్ధం అవ్వండి. మొబైల్ ఫోన్లు, స్క్రీన్‌లకు దూరంగా ఉండడం మంచిది. ఈ సాధారణ చిట్కాలు ఫాలో అయితే హాయిగా పడుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




