
ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాటిల్లో అధిక బరువు, ఊబకాయం ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. అధిక బరువు కారణంగా మరిన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే సులువుగా బరువు తగ్గాలి అనే ఆలోచనతో చాలా మంది ఎన్నో రకాల టిప్స్‌ను మార్కెట్లో లభించే కొన్ని ప్రాడెక్ట్స్‌ను కూడా ఉపయోగిస్తున్నారు. కానీ వీటితో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించడం లేదు. కానీ పెద్దగా ఖర్చులేకుండా.. ఈజీగా బరువు తగ్గాలి అంటే చాలా రకాల మార్గాలు ఉన్నాయి. వాటిల్లో ఈ కొరియన్ డ్రింక్స్ కూడా ఒకటి. వీటిని బయట కొనాల్సిన పని లేదు. ఇంట్లోనే హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. మరి అవేంటి? వాటిని ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం.
కొరియన్‌లో ఎంతో ప్రసిద్ధి చెందిన వాటిల్లో ఈ బార్లీ టీ కూడా ఒకటి. ఈ టీని రోస్ట్ చేసిన బార్లీ గింజలను నీటిలో మరిస్తారు. దీన్ని నేరుగా తాగవచ్చు. లేదా బెల్లం, సాల్ట్ అయినా కలుపుకుని గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. చక్కెర పానీయాలకు ఇది ప్రత్యామ్నాయంగా చెప్పొచ్చు.
గుల్చా టీనే రోజ్ టీ అని కూడా పిలుస్తారు. ఇది తీసుకోవడం వల్ల కూడా సులువగా బరువు తగ్గుతారు. అలాగే కుంకుమ పువ్వు, గులాబీ రేకులు కలిపి తీసుకోవడం వల్ల విటమిన్ సి అనేది లభిస్తుంది. అంతే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి ఇతర వ్యాధులతో పోరాడే శక్తి కూడా లభిస్తుంది. బరువు తగ్గినా.. నీరసంగా అనిపించదు.
ఈ ఒమిజా టీని ఐదు రకాల రుచులతో చేస్తారు. దీన్నే బెర్రీ టీ అని కూడా పిలుస్తారు. వీటిలో తీపి, చేదు, పులుపు, లవణం, మసాలాలు అన్ని కలిపి ఉంటాయి. ఇది జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. గ్యాస్, అజీర్తి, కడుపులో నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలు ఏర్పడుకుంటా చేస్తుంది. అదే విధంగా హ్యాపీగా బరువు కూడా తగ్గొచ్చు.
గ్రీన్ టీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కొరియాలో గ్రీన్ టీ చాలా ప్రాచూర్యం పొదిన టీ. ఇది తరచూ తీసుకోవడం వల్ల త్వరగా బరువు తగ్గుతారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..
గమనిక: ఇది నిపుణులు, అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం. అవగాహన కోసం మాత్రమే ఈ కథనం. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా నిపుణులను సంప్రదించడం మేలు.