Rice Water for Weight loss: బియ్యం కడిగిన నీళ్లతో వెయిట్ లాస్.. ఇంకా ఎన్నో లాభాలు!

|

Oct 03, 2024 | 3:17 PM

ప్రస్తుత కాలంలో రైస్ వాటర్ చాలా పాపులర్ అవుతున్నాయి. కొరియన్స్ బ్యూటీ సీక్రెట్ రైస్ వాటర్ అని తెలుసుకున్నాక.. రైస్ వాటర్‌కు మంచి డిమాండ్ వచ్చింది. బియ్యం కడిగిన ద్వారా వచ్చే నీళ్లను చాలా మంది పడేస్తూ ఉంటారు. గ్రామాల్లో అయితే ఆ నీటికి గేదెలు తాగడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఈ బియ్యం కడిగిన ద్వారా వచ్చిన నీళ్లలో చాలా రకాల పోషకాలు మనకు లభిస్తాయి. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు బి, ఇ, ఫాస్పరస్, పొటాషియం, స్టార్చ్..

Rice Water for Weight loss: బియ్యం కడిగిన నీళ్లతో వెయిట్ లాస్.. ఇంకా ఎన్నో లాభాలు!
Rice Water For Weight Loss
Follow us on

ప్రస్తుత కాలంలో రైస్ వాటర్ చాలా పాపులర్ అవుతున్నాయి. కొరియన్స్ బ్యూటీ సీక్రెట్ రైస్ వాటర్ అని తెలుసుకున్నాక.. రైస్ వాటర్‌కు మంచి డిమాండ్ వచ్చింది. బియ్యం కడిగిన ద్వారా వచ్చే నీళ్లను చాలా మంది పడేస్తూ ఉంటారు. గ్రామాల్లో అయితే ఆ నీటికి గేదెలు తాగడానికి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఈ బియ్యం కడిగిన ద్వారా వచ్చిన నీళ్లలో చాలా రకాల పోషకాలు మనకు లభిస్తాయి. ఇందులో అనేక రకాల పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్లు బి, ఇ, ఫాస్పరస్, పొటాషియం, స్టార్చ్ లభిస్తాయ. ఈ బియ్యం కడిగిన నీటిని ఉపయోగించడం వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది జీర్ణ క్రియను మెరుగు పరుస్తుంది. శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది. జుట్టు, చర్మ సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ నీటిని తాగడం వల్ల తక్కువ కాలంలోనే బరువు కూడా తగ్గవచ్చు. మరి ఈ నీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

బియ్యం కడిగిన నీళ్లను ఎలా తయారు చేసుకోవాలి:

ముందుగా బియ్యాన్ని తీసుకుని కడిగి.. ఆ నీటిని ఒక పాత్రలోకి తీసుకోండి. ఈ నీటిని స్టవ్ మీద పెట్టి ఓ పది నిమిషాలు మరిగించాలి. ఈ నీరు బాగా మరిగిన తర్వాత.. వడకట్టి తీసుకోవాలి. ఈ నీటిని చల్లగా లేదా గోరు వెచ్చగా అయినా తీసుకోవచ్చు.

ఈ నీళ్లను ఎప్పుడు తీసుకోవాలి:

ఈ నీళ్లను ఉదయం పరగడుపున తీసుకోవాలి. అలాగే వ్యాయామాలు చేసిన తర్వాత కూడా తీసుకోవచ్చు. రాత్రి పూట నిద్రించే ముందు కూడా తీసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

వెయిట్ లాస్:

బియ్యం నీటిని తాగడం వల్ల అధిక బరువు నుంచి ఉపశమనం పొందవచ్చు. ఊబకాయం, అధిక బరువుతో ఇబ్బంది పడేవారు.. రెగ్యులర్‌గా ఈ నీటిని తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఎందుకంటే ఇందులో క్యాలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అలాగే జీవక్రియను కూడా మెరుగుపరుస్తాయి. కాబట్టి వెయిట్ లాస్ అవ్వొచ్చు.

అందం పెరుగుతుంది:

ఈ నీటిని తీసుకోవడం వల్ల కేవలం అధిక బరువు సమస్య నుంచే కాకుండా.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ఇందులో ఉండే పోషకాల వలన చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ నీళ్లతో ముఖం కడిగినా, జుట్టును కడిగినా సమస్యలు తగ్గుతాయి.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:

బియ్యం కడిగిన నీటిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. ఇమ్యూనిటీ వ్యవస్థ బలపడి.. వ్యాధులతో పోరాడే సత్తువ లభిస్తుంది. ఈ నీళ్లు తాగితే రోజంతా చురుగ్గా ఉంటారు.

గుండె ఆరోగ్యం:

బియ్యం కడిగిన నీళ్లు తాగడం వల్ల గుండె కూడా ఆరోగ్యంగా పని చేస్తుంది. ఈ నీళ్లు తాగితే రక్త పోటు అనేది తగ్గుతుంది. శరీరంలో ఎలాంటి చెడు కొలెస్ట్రాల్ ఉన్నా కరుగుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..