Cleaning Tips: వీటిని ట్రై చేస్తే.. బాత్రూమ్‌ గోడలు క్షణాల్లో మెరుస్తాయి..

బాత్రూమ్‌ని క్లీన్ చేయడం అంటే అంత ఈజీ పని కాదు. బాత్రూమ్‌కి వెళ్లనిదే రోజు మొదలు కాదు. అలాంటి బాత్రూమ్‌ని ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది ఇంటి నీటినెస్‌పై పెట్టే శ్రద్ధను బాత్రూమ్‌పై చూపించారు. బాత్రూమ్స్ శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలం. బాత్రూమ్స్‌కి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అ శ్రద్ధ వహిస్తే క్రిములు మనపై ఎటాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాత్రూమ్‌లో ఎక్కువగా కింద ఫ్లోర్, టాయిలెట్..

Cleaning Tips: వీటిని ట్రై చేస్తే.. బాత్రూమ్‌ గోడలు క్షణాల్లో మెరుస్తాయి..
Cleaning Tips
Follow us
Chinni Enni

| Edited By: Ravi Kiran

Updated on: Oct 23, 2024 | 4:21 PM

బాత్రూమ్‌ని క్లీన్ చేయడం అంటే అంత ఈజీ పని కాదు. బాత్రూమ్‌కి వెళ్లనిదే రోజు మొదలు కాదు. అలాంటి బాత్రూమ్‌ని ఎంతో శుభ్రంగా ఉంచుకోవాలి. చాలా మంది ఇంటి నీటినెస్‌పై పెట్టే శ్రద్ధను బాత్రూమ్‌పై చూపించారు. బాత్రూమ్స్ శుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండగలం. బాత్రూమ్స్‌కి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అ శ్రద్ధ వహిస్తే క్రిములు మనపై ఎటాక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. బాత్రూమ్‌లో ఎక్కువగా కింద ఫ్లోర్, టాయిలెట్ మాత్రమే క్లీన్ చేస్తారు. పక్కన ఉన్న గోడలను పట్టించుకోరు. ఇవి ఎంతో మురికిగా ఉంటాయి. వీటిని క్లీన్ చేయాలంటే చాలా సమయమే పడుతుంది. దీంతో గోడలను క్లీన్ చేయడం కోసం రసాయనాలు కలిపిన లిక్విడ్స్ ఉపయోగిస్తారు. వీటి వలన కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి నేచురల్‌గా ఈ టిప్స్‌తో బాత్రూమ్‌ని మిలమిలమని మెరిపించుకోవచ్చు.

బేకింగ్ సోడా – వెనిగర్:

బేకింగ్ సోడా మంచి కిచెన్ హ్యాకర్ అన్న విషయం చాలా మందికి తెలీదు. కేవలం వంటల్లోనే కాకుండా.. ఇంటిని క్లీన్ చేయడంలో కూడా బేకింగ్ సోడా చక్కగా పని చేస్తుంది. అదే విధంగా వెనిగర్ కూడా ఉపయోగ పడుతుంది. ఎలాంటి మొండి మరకలను వదిలించడానికైనా ఈ రెండూ ఇంట్లో ఉంటే చాలు. ఇలానే బాత్రూమ్‌ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఓ చిన్న బకెట్‌లో కొద్దిగా నీరు, బేకింగ్ సోడా, వెనిగర్ కలిపి మిక్స్ చేయండి.

ఇప్పుడు స్పాంజి లేదా బట్టల బ్రష్ తీసుకుని ఈ మిశ్రమంలో ముంచి.. గోడలపై రుద్దండి.. తక్కువ సమయంలోనే మురికి, మచ్చలు పోతాయి. గోడలు తెల్లగా మారతాయి. అలాగే మంచి సువాసన కూడా వస్తుంది. లిక్విడ్‌లా చేసి గోడలపై స్ప్రే చేసి కూడా క్లీన్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

నిమ్మరసం – డిటర్జెంట్ పౌడర్:

నిమ్మ రసంలో కూడా బ్లీచింగ్ గుణాలు ఉన్నాయి. నిమ్మ రసంతో కూడా ఎలాంటి వాటిని అయినా క్లీన్ చేసుకోవచ్చు. ఇది సహజ క్లీనర్. మొండి మరకలను వదిలించడంలో నిమ్మ రసం చక్కగా పనిచేస్తుంది. నిమ్మ రసం – డిటర్జెంట్‌ని నీటిలో కలిపి ఓ స్ప్రే బాటిల్‌లో వేసుకోండి. దీన్ని బాత్రూమ్ అంతా స్ప్రే చేసి.. ఆ తర్వాత స్పాంజితో క్లీన్ చేస్తే.. మురికి పోతుంది. మంచి సువాసన కూడా వెదజల్లుతుంది. సులువుగా మొండి మరకలు కూడా పోతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..