Egg for Skin: నిగనిగలాడే మెరిసే చర్మం కావాలా.. గుడ్డుతో ఇలా చేయండి..

కోడి గుడ్డు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గుడ్డులో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. అందుకే ప్రతి రోజూ ఓ గుడ్డు తినమని డాక్టర్లు చెబుతున్నారు. గుడ్డు తినడం వల్ల వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. అధిక ప్రోటీన్ కలిగిన ఆహారంలో గుడ్డుకు పేరు ఉంది. గుడ్డు తినడం వల్ల కేవలం ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా పెంచుకోవచ్చు. గుడ్డులోని తెల్ల సొనను ఫేస్ ప్యాక్‌గా వాడటం వల్ల మెరిసే చర్మం మీ సొంతం..

Egg for Skin: నిగనిగలాడే మెరిసే చర్మం కావాలా.. గుడ్డుతో ఇలా చేయండి..
egg for Skin

Updated on: Jun 04, 2024 | 5:35 PM

కోడి గుడ్డు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. గుడ్డులో శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. అందుకే ప్రతి రోజూ ఓ గుడ్డు తినమని డాక్టర్లు చెబుతున్నారు. గుడ్డు తినడం వల్ల వచ్చే లాభాలు అన్నీ ఇన్నీ కావు. అధిక ప్రోటీన్ కలిగిన ఆహారంలో గుడ్డుకు పేరు ఉంది. గుడ్డు తినడం వల్ల కేవలం ఆరోగ్యమే కాదు అందాన్ని కూడా పెంచుకోవచ్చు. గుడ్డులోని తెల్ల సొనను ఫేస్ ప్యాక్‌గా వాడటం వల్ల మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది. మరి గుడ్డుతో ఫేస్ ప్యాక్ ఎలా వేసుకోవాలి? ఎలాంటి స్కిన్ రిజల్ట్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

గుడ్డు – తేనె:

పింపుల్స్‌తో బాధ పడేవారు ఈ ఫేస్ ప్యాక్ ట్రే చేయవచ్చు. ఒక బౌల్ లోకి కొద్దిగా తెల్ల సొన, ఒక టీ స్పూన్ తేనె, ఒక టీ స్పూన్ నిమ్మరసం మిక్స్ చేసి ముఖానికి బాగా అప్లై చేయండి. ఇలా వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల పింపుల్స్ తగ్గి.. ముఖం సాఫ్ట్ అవుతుంది.

గుడ్డు – పసుపు:

ముఖంపై పిగ్మెంటేషన్, మచ్చలు, గరుకుగా ఉండే వారు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖంపై పిగ్మెంటేషన్ తగ్గి, ముఖం కాంతివంతంగా మారుతుంది. కొద్దిగా తెల్ల సొన, చిటికెడు పసుపు, కొద్దిగా ఆరెంజ్ జ్యూస్ కలిపి.. ముఖానికి పట్టించండి. ఆరిపోయాక నీటితో కడిగేయండి.

ఇవి కూడా చదవండి

గుడ్డు – ఆవకాడో:

ముఖం డల్‌గా ఉండేవారు ఈ ఫేస్ ప్యాక్ చక్కగా హెల్ప్ చేస్తుంది. కొద్దిగా తెల్ల సొన, కొద్దిగా పెరుగు, ఆవకాడో గుజ్జు బాగా కలిపి మిశ్రమంలా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.

గుడ్డు – ఆలివ్ ఆయిల్:

గుడ్డు, ఆలివ్ ఆయిల్ బాగా కలిపి ముఖానికి పట్టించడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. కావాలంటే వీటిల్లో పసుపు, నిమ్మరసం కూడా మిక్స్ చేయవచ్చు. ఈ మిశ్రమం ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..