Kalonji Seeds: కళోంజీ విత్తనాలను మహిళలు తీసుకుంటే.. ఆ సమస్యలన్నీ మాయం!

| Edited By: Shaik Madar Saheb

Jul 21, 2024 | 8:51 AM

కళోంజీ విత్తనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మందికి వీటి గురించి బాగా తెలుసు. దీన్నే నల్ల జీలకర్ర అని కూడా అంటారు. చాలా మంది దీన్ని ఎక్కువగా ఉపయోగించరు. కానీ ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ కళోంజీ సీడ్స్ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ..

Kalonji Seeds: కళోంజీ విత్తనాలను మహిళలు తీసుకుంటే.. ఆ సమస్యలన్నీ మాయం!
Kalonji Seeds
Follow us on

కళోంజీ విత్తనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా మందికి వీటి గురించి బాగా తెలుసు. దీన్నే నల్ల జీలకర్ర అని కూడా అంటారు. చాలా మంది దీన్ని ఎక్కువగా ఉపయోగించరు. కానీ ఇందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ కళోంజీ సీడ్స్ తీసుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. చిన్న పిల్లలకు కూడా వీటిని ఇవ్వొచ్చు. ముఖ్యంగా మహిళలు ఈ విత్తనాలు తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేడీస్ వీటిని తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం.

కళోంజీలో పోషకాలు:

ఈ విత్తనాల్లో ప్రోటీన్స్, ఫైబర్, క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్, కార్బోహైడ్రేట్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విలమిన్లు ఎ, సి, బి 12, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి.

సంతానోత్పత్తి పెంచుతుంది:

ఆడవారు కళోంజీ విత్తనాలు తీసుకోవడం వల్ల సంతానోత్పత్తి అనేది పెరుగుతుంది. గర్భం దాల్చాలి అనుకునే లేడీస్ వీటిని తీసుకోవడం చాలా అవసరం. పునరుత్పత్తి వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.

ఇవి కూడా చదవండి

నొప్పి నివారిణి:

మహిళలు చాలా ఎక్కువగా పని చేస్తూ ఉంటారు. వీరికి శక్తి అనేది చాలా అవసరం. పని ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో నొప్పులు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకుంటే నొప్పులు రాకుండా అడ్డుకుంటుంది. ఆర్థరైటీస్‌తో బాధ పడేవారు కూడా వీటిని తీసుకుంటే చాలా మంచిది.

హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి:

మహిళల్లో అనేక కారణాల వల్ల హార్మోన్లు అనేవి ఇన్ బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. దీని వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి. కాబట్టి వీటిని రెగ్యులర్‌గా తీసుకుంటే.. హార్మోన్లు కంట్రోల్‌ అవుతాయి. పీరియడ్స్ కూడా రెగ్యులర్‌గా వస్తాయి. మోనోపాజ్ సమయంలో వచ్చే కొన్ని సమస్యలు కూడా తగ్గుతాయి.

అందం పెరుగుతుంది:

కేవలం ఆరోగ్యం పెంచడం కోసమే కాకుండా చర్మ అందాన్ని పెంచడంలో కూడా సహాయ పడుతుంది. చర్మంపై వచ్చే దద్దుర్లు, దురద వంటి వాటి నుంచి ఉపశమనం ఇస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. అదే విధంగా జుట్టు సమస్యలు కూడా జుట్టు బలంగా, దృఢంగా ఉండేలా చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..