IRCTC Tours: కశ్మీర్ అందాలు చూసొద్దామా.. ఐఆర్‌సీటీసీ నుంచి అద్భుతమైన ప్యాకేజీ.. విమానంలో వెళ్లి రావొచ్చు..
ఐఆర్‌సీటీసీ ఓ ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి విమానంలో కశ్మీర్ తీసుకెళ్లి.. అన్నీ చూపించి.. తిరిగి విమానంలోనే తీసుకొస్తారు. ఈ ప్యాకేజీ పేరు మిస్టికల్ కశ్మీర్ ఎక్స్ హైదరాబాద్. ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఉండే ఈ టూర్ మీకు మధురానుభూతిని మిగిల్చుతుందనడంలో సందేహం లేదు. ఈ టూర్‌ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

మన దేశంలో అత్యంత అరుదైన వాతావరణం ఉండే ప్రాంతం కశ్మీర్. దేశ భూతల స్వర్గంగా పేరుగాంచిన ప్రాంతం అది. చుట్టూ మంచు కొండలు, లోయలు ఎటుచూసిన తెల్లని చీర కట్టినట్టు కనిపించే మంచు, మంచు వర్షాలు గడ్డకట్టే శీతల గాలులు నిజంగా అనుభవించాలే గానీ వర్ణించలేం. అటువంటి ప్రదేశాలను చూడాలని చాలా మంది తాపత్రయపడుతుంటారు. జీవితంలో ఒక్కసారైనా చుట్టేసి రావాలని ప్లాన్ చేస్తుంటారు. మరికొంత మంది ఏడాది ఒకసారైనా వెళ్లాలనుకొంటారు. అలాంటి వారికి ఓ గుడ్ న్యూస్. ఐఆర్‌సీటీసీ టూరిజమ్ ఓ ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి విమానంలో కశ్మీర్ తీసుకెళ్లి.. అన్నీ చూపించి.. తిరిగి విమానంలోనే తీసుకొస్తారు. ఈ ప్యాకేజీ పేరు మిస్టికల్ కశ్మీర్ ఎక్స్ హైదరాబాద్. ఐదు రాత్రులు, ఆరు పగళ్లు ఉండే ఈ టూర్ మీకు మధురానుభూతిని మిగిల్చుతుందనడంలో సందేహం లేదు. ఈ టూర్‌ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
ఐఆర్‌సీటీసీ కశ్మీర్ టూర్ ప్యాకేజీ..
ప్యాకేజీ పేరు: మిస్టికల్ కశ్మీర్ ఎక్స్ హైదరాబాద్(ఎస్‌హెచ్‌ఏ11)
టూర్ వ్యవధి: ఐదు రాత్రులు, ఆరు పగళ్లు
ప్రయాణ సాధనం: విమానం(హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది)
టూర్ తేదీలు: సెప్టెంబర్ 9, 18, 28, అక్టోబర్ 06
చూసే ప్రాంతాలు: శ్రీనగర్, గుల్‌మార్గ్, సోన్‌మార్గ్, పహల్గమ్
టూర్ సాగేదిలా..
డే1(హైదరాబాద్ నుంచి శ్రీనగర్): మధ్యాహ్నం 14.35 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం ప్రారంభమై సాయంత్రం 17.35 గంటలకు శ్రీనగర్ ఎయిర్‌పోర్టులో ల్యాడ్ అవుతారు. హోటల్‌కి వెళ్లి షికారా దాల్ లేక్ వద్ద సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తారు. చార్ చినార్‌ను సొంత ఖర్చులతో చూడొచ్చు. రాత్రి భోజనం అయిన తర్వాత బస అక్కడే ఉంటుంది.
డే2(శ్రీనగర్-సోన్‌మార్గ్-శ్రీనగర్): ఉదయం అల్పాహారం పూర్తయిన తర్వాత సన్‌మార్గ్‌కు చేరుకుంటారు. అది సముద్ర మట్టానికి 2,800 మీటర్ల ఎత్తులో ఉంటుంది. మంచుతో కప్పబడిన పర్వతాలను వీక్షించవచ్చు. గ్లేసియర్ పాయింట్స్ ఆకట్టుకుంటాయి. రాత్రికి మళ్లీ శ్రీనగర్ వెళ్లి అక్కడే బస చేస్తారు.
డే3(శ్రీనగర్-గుల్మార్గ్-శ్రీనగర్): ఉదయం అల్పాహారం తర్వాత గుల్ మార్గ్‌కి బయలుదేరుతారు. రోడ్డు మార్గంలో వెళ్తున్నప్పుడు మీకు పచ్చిక భూములు కనిపిస్తాయి. ఖిలన్ మార్గ్ వరకూ ఒక చిన్న ట్రెక్ కూడా ఉంటుంది. సొంత ఖర్చులతో ట్రెక్కింగ్‌కు వెళ్లొచ్చు. అనంతరం శ్రీనగర్ తిరిగి వెళ్లి, హటల్లో బస చేస్తారు.
డే4(శ్రీనగర్-పహల్గాం): ఉదయం అల్పాహారం తర్వాత పహల్గామ్ బయలుదేరాలి. దారిలో కుంకుమ పువ్వు తోటలు, అవంతిపుర శిథిలాలను సందర్శిస్తారు. బేతాబ్ వ్యాలీ, చందన్ వారీ, అరు వ్యాలీ చూపిస్తారు. అలాగే సొంత ఖర్చులతో మినీ స్విట్జర్లాండ్, సమీప స్థలాలను సందర్శించవచ్చు. రాత్రికి అక్కడే బస చేస్తారు.
డే5(పహల్గాం-శ్రీనగర్): ఉదయం అల్పాహారం తీసుకున్న తర్వాత తిరిగి శ్రీనగర్ వెళ్తారు. అక్కడ మొఘల్ గార్డెన్స్, చెష్మషాహి, పరిమహల్, బొటానికల్ గార్డెన్, షాలిమార్ గార్డెన్స్ ను సందర్శిస్తారు. దాల సరస్సు ఒడ్డున్న ఉన్న ప్రసిద్ధ హజ్రత్ బాల్ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. సాయంత్రం హోటల్‌కు చేరుకొని అక్కడే రాత్రి బస చేస్తారు. డే 6(శ్రీనగర్- హైదరాబాద్): తెల్లవారుజామున శంక్రాచార్య ఆలయ దర్శనం చేసుకొని తిరిగి హౌస్ బోట్, అల్పాహారం తీసుకున్నాక రిటర్న్ ఫ్లైట్ లో హైదరాబాద్ చేరుకుంటారు.
టూర్ ప్యాకేజీ ధరలు ఇలా..
సింగిల్ గా టూర్ కి రావాలనుకొంటే రూ. 41030 చెల్లించాల్సి ఉంటుంది. అదే ఇద్దరు షేరింగ్ అయితే ఒక్కొక్కరికీ రూ. 36,895 ఉంటుంది. ముగ్గురు షేరింగ్ లో అయితే ఒక్కొక్కరికీ రూ. 28,300 అవుతుంది. మంచం సదుపాయం లేకుండా 5 నుంచి 11 పిల్లలకు రూ. 25945 ఉంటుంది. మంచం లేకుండా రెండు నుంచి నాలుగేళ్ల పిల్లలకు రూ. 21125 చార్జ్ ను ఐఆర్సీటీసీ తీసుకుంటుంది.
టూర్ కల్పించే సౌకర్యాలు..
- విమాన టిక్కెట్లు (హైదరాబాద్ -శ్రీనగర్- హైదరాబాద్).
- హౌస్ బోట్‌లో 1 రాత్రి బసతో 4 రాత్రుల హోటల్ వసతి.
- అల్పాహారం, రాత్రి భోజనం అందిస్తారు. మధ్యాహ్నం భోజన సదుపాయం ఉండదు.
- కశ్మీర్ లో లోకల్ ట్రాన్స్ పోర్టేషన్, టూర్ ఎస్కార్ట్ సేవలు ఉంటాయి.
- పర్యాటకులకు ట్రావెల్ ఇన్సురెన్స్ ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..







