Mango Leaves Hair Pack: పండు కాదు మామిడి ఆకులు కూడా అద్భుతమైనవే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా మారడం గ్యారెంటీ !!

|

Nov 01, 2023 | 3:24 PM

ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే..వస్తువులతో మీ జుట్టు నల్లగా ఒత్తుగా మారుతుందంటే..మీరు ఆశ్చర్యపోవాల్సిందే.. జుట్టుకు సహజ రంగు కోసం చేసే హోం రెమిడీస్ లో మీకు ముందుగా మామిడి ఆకులు అవసరం . మామిడి ఆకుల్లో జుట్టుకు నల్లని రంగును ఇచ్చే అనేక సమ్మేళనాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ వంటివి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మామిడి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది. అయితే ఈ ఆకులను జుట్టుకు ఎలా అప్లై చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

Mango Leaves Hair Pack: పండు కాదు మామిడి ఆకులు కూడా అద్భుతమైనవే.. ఇలా వాడితే తెల్లజుట్టు నల్లగా మారడం గ్యారెంటీ !!
Mango Leaves Hair Pack
Follow us on

జుట్టు నెరవడం అనేది చాలా మందిని వేధించే సమస్య. వృద్ధాప్యం వల్ల వెంట్రుకలు నెరిసిపోవడం సహజమైన ప్రక్రియ. కానీ చిన్న వయసులోనే జుట్టు నెరిసిపోవడం మామూలు విషయం కాదు. ఇది వారిని తీవ్ర ఇబ్బందికి గురిచేస్తుంది. జుట్టును నల్లగా మార్చేందుకు హెయిర్‌ కలర్‌ వేయడం వల్ల జుట్టు ఆరోగ్యం మరింత దిగజారిపోతుంది. అలాగే దీని వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువ. బదులుగా, సహజమైన హెయిర్ డైని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మార్కెట్‌లో లభించే కెమికల్ హెయిర్ డై కంటే ఇది చాలా మేలు చేస్తుంది. అందులోనూ ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే..వస్తువులతో మీ జుట్టు నల్లగా ఒత్తుగా మారుతుందంటే..మీరు ఆశ్చర్యపోవాల్సిందే.. జుట్టుకు సహజ రంగు కోసం చేసే హోం రెమిడీస్ లో మీకు ముందుగా మామిడి ఆకులు అవసరం . మామిడి ఆకుల్లో జుట్టుకు నల్లని రంగును ఇచ్చే అనేక సమ్మేళనాలు ఉన్నాయి. ఇందులో ఉండే విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ వంటివి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మామిడి ఆకుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు తెల్లబడకుండా చేస్తుంది. అయితే, మామిడితో కలిగే లాభాలు, ఈ ఆకులను జుట్టుకు ఎలా అప్లై చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

తెల్ల వెంట్రుకలకు మామిడి ఆకులు:

తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవటం కోసం ముందుగా కొన్ని మామిడి ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ లా తయారు చేసుకోవాలి.. ఈ ఆకులను మెత్తగా రుబ్బిన తర్వాత జుట్టు మొత్తానికి పట్టించాలి. ఈ పేస్ట్‌ను జుట్టు మీద సుమారు ఒకటిన్నర గంటల పాటు అలాగే ఆరనివ్వాలి. మామిడిఆకులతో తయారు చేసిన ఈ హెయిర్‌ ప్యాక్‌ వల్ల తెల్లజుట్టు క్రమంగా నల్లగా మారి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

మామిడి ఆకులను జుట్టుకు అప్లై చేసే మరో పద్ధతి.. మామిడి ఆకులను నీటిలో వేసి మరిగించాలి. నీరు రంగు మారినప్పుడు గ్యాస్ ఆర్పేయాలి. ఈ నీటిని వెంట్రుకలకు మొదళ్ల నుండి చివర్ల వరకు అప్లై చేయండి. ఈ నీటిని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల జుట్టు నల్లగా మారడం ప్రారంభమవుతుంది.

ఈ ఆకులను ఎండలో ఎండబెట్టి మెత్తగా రుబ్బుకోవడం మూడవ పద్ధతి. ఈ ఆకులకు బ్లాక్ టీ వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని జుట్టుకు పట్టించి అరగంట పాటు ఉంచి తర్వాత కడిగేయాలి. మరింత ప్రభావం కోసం ఈ పేస్ట్‌కి మెహందీని కూడా యాడ్‌ చేసుకోవచ్చు. దీంతో మరింత బెస్ట్‌ రిజల్ట్స్‌ చూస్తారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి