Mango leaves: మచ్చలేని చర్మానికి మామిడి ఆకుల మంత్రం..! ఇలా వాడితే ముఖంలో మెరుపు ఖాయం..!!

వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది. మొటిమలు, గాయాలను త్వరగా నయం చేస్తుంది. మచ్చలను దూరం చేస్తుంది. చర్మం నల్లబడటాన్ని తగ్గించి, కాంతివంతమైన ఛాయను కలిగిస్తుంది. ముఖంలో జిడ్డు తగ్గించి, మొటిమల ఏర్పడటాన్ని నివారిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం మరింత స్థితిస్థాపకంగా మారుతుంది. చర్మాన్ని శుభ్రపరచి, దురద, ఎరుపు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

Mango leaves: మచ్చలేని చర్మానికి మామిడి ఆకుల మంత్రం..! ఇలా వాడితే ముఖంలో మెరుపు ఖాయం..!!
Mango Tree Leaves

Updated on: May 17, 2025 | 9:02 PM

పండ్లలో రారాజు మామిడి..మామిడి పండ్లు కేవలం రుచి, సువాసన, మాత్రమే కాదు.. మంచి ఆరోగ్యం కూడా అంటున్నారు పోషకాహార నిపుణులు. అంతేకాదు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే.. మామిడి కాయలు, పండ్లు మాత్రమే కాదు.. మామిడి ఆకులు కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలిగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మామిడి ఆకులు మచ్చలేని, కాంతివంతమైన చర్మాన్ని అందించడంలో అద్భుత ఔషధంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో వచ్చే చర్మ సమస్యలను నివారించడానికి ఈ ఆకులు ఎంతో ఉపయోగపడతాయి.

మామిడి ఆకుల ఫేస్‌ మాస్క్‌తో అద్బుతమైన మార్పును గమనిస్తారని నిపుణులు చెబుతున్నారు. మామిడి ఆకుల్లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ చర్మం స్వచ్ఛత, చర్మంపై ట్యాన్‌ను తొలగించేలా పనిచేస్తాయి. చర్మంపై ఏర్పడే మచ్చలను తొలగిస్తాయి. ఈ ఫేస్‌ప్యాక్‌ ఎలా తయారు చేయాలి.? ఎలా వాడాలో ఇక్కడ చూద్దాం..

మామిడి ఆకులతో ఫేస్‌మాస్క్‌ తయారీ కోసం నాలుగైదు తాజా మామిడి ఆకులను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నీరు కలిపి మెత్తని పేస్ట్‌గా రుబ్బుకోవాలి. ఈ పేస్టులో ఒక టేబుల్ స్పూన్ పెరుగును కూడా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై మందంగా అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పది నుండి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తరువాత శుభ్రమైన నీటితో వాష్‌ చేసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ మాస్క్‌ను ఉపయోగించడం వల్ల చర్మం తాజాగా, కాంతివంతంగా ఉండేలా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మామిడి ఆకుల్లోని యాంటీఆక్సిడెంట్ల వల్ల చర్మం ఫ్రీ రాడికల్స్‌ నుండి రక్షిస్తుంది. వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తుంది. మొటిమలు, గాయాలను త్వరగా నయం చేస్తుంది. మచ్చలను దూరం చేస్తుంది. చర్మం నల్లబడటాన్ని తగ్గించి, కాంతివంతమైన ఛాయను కలిగిస్తుంది. ముఖంలో జిడ్డు తగ్గించి, మొటిమల ఏర్పడటాన్ని నివారిస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మం మరింత స్థితిస్థాపకంగా మారుతుంది. చర్మాన్ని శుభ్రపరచి, దురద, ఎరుపు వంటి సమస్యలను తగ్గిస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..