AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Carrot Peels: క్యారెట్ తొక్కలతో ఖతర్నాక్ అద్భుతాలు.. తెలిస్తే అవాక్కే..

మీరు క్యారెట్ తొక్కలను పారేస్తున్నారా..? ఒక్క నిమిషం ఆగండి. ముందు వాటి లాభాలు తెలుసుకోండి. ఆ తర్వాత మీరు వాటిని పాడేయమన్నా.. పాడేయరు. క్యారెట్ తొక్కలు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్‌తో సమృద్ధిగా ఉంటాయి. అవి సూప్‌లో పోషకాలను పెంచి.. క్రిస్పీ స్నాక్స్‌గా మారుతాయి. తోటలో కంపోస్ట్, ఎరువుగా పనిచేస్తాయి.

Carrot Peels: క్యారెట్ తొక్కలతో ఖతర్నాక్ అద్భుతాలు.. తెలిస్తే అవాక్కే..
Carrot Peels Benefits
Krishna S
|

Updated on: Sep 14, 2025 | 3:04 PM

Share

మనం సాధారణంగా క్యారెట్లను వాడుకొని వాటి తొక్కలను పారేస్తాం. అయితే ఆ తొక్కలలో కూడా ఎన్నో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయని మీకు తెలుసా? వ్యర్థాలను తగ్గించి, పర్యావరణాన్ని కాపాడుకోవాలని ఆలోచించేవారు ఈ క్యారెట్ తొక్కలను అనేక విధాలుగా ఉపయోగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వంట, ఆరోగ్యం, తోటపని వంటి వాటికి క్యారెట్ తొక్కలను ఎలా ఉపయోగించుకోవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

వంట గదిలో మ్యాజిక్

సూప్‌లో స్పెషల్ టచ్: క్యారెట్ తొక్కలను పారేయకుండా సూప్‌లు లేదా కూరల్లో వేయండి. ఇవి వంటకానికి సహజమైన తీపి, పోషకాలను అందిస్తాయి.

హెల్తీ చిప్స్: క్యారెట్ తొక్కలను శుభ్రంగా కడిగి, ఆలివ్ నూనె, ఉప్పు, మీకు నచ్చిన మసాలాలు వేసి వేయించండి. ఈ క్రంచీ క్యారెట్ తొక్క క్రిస్ప్స్ ప్యాక్ చేసిన చిప్స్‌కు మంచి ప్రత్యామ్నాయం.

ఆరోగ్యం, అందం కోసం..

ఫైబర్ బూస్ట్: క్యారెట్ జ్యూస్ లేదా స్మూతీలు చేసేటప్పుడు తొక్కలను కూడా అందులో కలపండి. దీనివల్ల ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది. అలాగే, ఇందులో ఉండే బీటా-కెరోటిన్ కంటి చూపు, రోగనిరోధక శక్తికి సహాయపడుతుంది.

స్కిన్‌కేర్ సీక్రెట్: క్యారెట్ తొక్కల్లోని యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మంచివి. వాటి పేస్ట్‌ను తేనె లేదా పెరుగుతో కలిపి ఫేస్ మాస్క్‌లా వాడవచ్చు. మీ చర్మానికి సహజమైన మెరుపు వస్తుంది.

తోటలో అద్భుతాలు

కంపోస్ట్ కోసం: క్యారెట్ తొక్కలు కంపోస్ట్ కుప్పకు అద్భుతమైనవి. అవి త్వరగా కుళ్లిపోయి నేలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి.

మొక్కలకు ఎరువుగా: తొక్కలను నేరుగా మొక్కల దగ్గర పాతిపెట్టవచ్చు. అవి కుళ్లిపోతున్నప్పుడు పొటాషియం వంటి ఖనిజాలను విడుదల చేసి మొక్కల వేర్లకు బలం చేకూరుస్తాయి.

ఈ చిన్నపాటి చిట్కాలతో మీరు ఆహారాన్ని, డబ్బును, పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. ఇకపై క్యారెట్లు తొక్కేటప్పుడు పారేసే ముందు ఒక్కసారి ఆలోచించండి.

మరిన్ని లైఫ్‌స్టైల్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..