AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సిటీలో వచ్చిన జీతం సరిపోవట్లేదా?.. జస్ట్ ఈ 7 అలవాట్లు పాటిస్తే చాలు ఈజీగా డబ్బు ఆదా చేయొచ్చు!

హైదరాబాద్ అంటేనే ఖరీదైన నగరం. ఇక్కడ చేతినిండా జీతం వచ్చే ఉద్యోగం ఉన్నా.. ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయనేది చాలా మంది అభిప్రాయం. అయితే ఈ మాయానగరంలో నెలవారీ ఖర్చులను మేనేజ్ చేస్తూ డబ్బు ఆదా చేయడం అంత సులభం కాదు. అయితే, బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి కొన్ని మంచి అలవాట్లు, తెలివైన నిర్ణయాల ద్వారా తన ఖర్చులకు చాలా వరకు తగ్గించుకొని డబ్బును ఆదా చేస్తున్నాడట.. తాను పాటించిన అలవాట్లను అతను ఇన్‌స్టా వేదికగా పంచుకున్నాడు.. మీరు కూడా డబ్బు ఆదా చేసుకోవాలంటే.. ఆ అలవాట్లేవో తెలుసుకోండి.

సిటీలో వచ్చిన జీతం సరిపోవట్లేదా?.. జస్ట్ ఈ 7 అలవాట్లు పాటిస్తే చాలు ఈజీగా డబ్బు ఆదా చేయొచ్చు!
Money Saving Tips Hyderabad
Anand T
|

Updated on: May 26, 2026 | 2:45 PM

Share

సిటీ లైఫ్‌ అంటే డబ్బులతో కూడుకున్న వ్యవహారం.. ఇక్కడ మీరు ఎంత సంపాధించినా నెలవారి ఖర్చులకే సరిపోతుంది.. సేవింగ్స్ చేద్దామంటే అస్సలూ కుదరదు.. ఇక నెలాఖరికి వచ్చే సరి మళ్లీ డబ్బుల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది.. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను అదిగమించేందుకు బెంగళూరు చెందిన ఓ వ్యక్తి తన ఖర్చులు తగ్గించుకునేందుకు తన జీవనశైలిలో కొన్ని అలవాట్లను మార్చుకున్నాడు.. అలాతే తెలివైన నిర్ణయాలతో చాలా వరకు డబ్బును ఆదా చేశాడు. @bangalore_viral అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసిన వీడియోలో.. అక్షయ్ సీఎన్ అనే వ్యక్తి తన జీవనశైలిలో చేసుకున్న మార్పులను వివరించాడు.

మెట్రో స్టేషన్ దగ్గరకు మారడం: చాలా సిటీలో ఎక్కడెక్కడో నివసిస్తూ ఉంటారు. అలా కాకుండా రవాణా సౌకర్యం కలిగిన ప్రాంతాలు అంటే.. మెట్రో స్టేషన్‌కు దగ్గరగా ఉండే రూమ్‌కు మారడం మంచిదని అతను చెప్పాడు. ప్రారంభంలో తనకు అక్కడ అద్దె కొంచెం ఎక్కువగా అనిపించినప్పటికీ.. రోజువారీ ప్రయాణ ఖర్చులు, పెట్రోల్, ఆటో ఛార్జీలు, మానసిక ఒత్తిడి చాలా వరకు తగ్గాయని వివరించారు.

వృథా ఖర్చులు: చాలా మంది ప్రతి చిన్న వాటికి ఆన్‌లైన్ యాప్స్‌పై ఆదారపడుతారు. కానీ తాను వాటన్నింటికి దూరం ఉన్టట్టు తెలిపాడు. క్విక్ డెలివరీలు , ఆటోలు, అనవసర సబ్‌స్క్రిప్షన్లు, ఆన్‌లైన్ షాపింగ్‌లు నెలవారీ బడ్జెట్‌ను తీవ్రంగా దెబ్బతీస్తాయని.. కాబట్టి సౌకర్యం పేరుతో చేసే ఇలాంటి ఖర్చులను తగ్గించాలని తెలిపాడు.

వీకెండ్ ప్లానింగ్: చాలా మంది వీకెండ్ వచ్చిందంటే చాలూ పబ్‌లు, రిసార్ట్‌లు అని వెళ్తుంటారు. కానీ తాను ప్లాన్ లేకుండా కెఫేలు, పబ్‌లకు వెళ్లడం, అప్పటికప్పుడు ట్రిప్‌లు వేయడం వల్ల తెలియకుండానే డబ్బు అయిపోతుందని. అందుకే వీకెండ్స్‌ను ముందే ప్లాన్ చేసుకోవడం అలవాటు చేసుకున్నట్లు చెప్పారు.

గ్యాడ్జెట్స్ అప్‌గ్రేడ్: పక్కవారు కొంటున్నారని.. వారిని చూసి తాను కూడా గ్యాడ్జెట్స్‌ను కొనే అలవాటును మార్పుకున్నానని తెలిపాడు. సిటీ వర్క్ కల్చర్ తెలియకుండానే లైఫ్‌స్టైల్‌పై అనవసర ఒత్తిడిని పెంచుతుందని అతను చెప్పుకొచ్చాడు. అలాగే స్టేటస్ చూపించుకోవడం కోసం అనసర ఖర్చులు తగ్గించుకోవాలన్నారు.

ఇంట్లోనే వంట చేసుకోవడం: సిటీలో చాలా మంది బద్దకంతో ఆన్‌లైన్ ఫుడ్ లేదా బయట ఫుడ్ తినేందుకు ఇష్టపడుతారు. కానీ ప్రతిరోజూ బయట తినే అలవాటు పక్కన పెట్టి, అప్పుడప్పుడు ఇంట్లోనే వంట చేసుకోవడం వల్ల ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ఆరోగ్యంగా ఉండొచ్చని అతను చెప్పుకొచ్చాడు. ఇ

మొత్తంగా ఎక్కువ జీతం మాత్రమే డబ్బు సమస్యలను పరిష్కరించదని. సీటిలో డబ్బు సంపాదించడంతో పాటు మంచి అలవాట్లను కలిగి ఉండటం చాలా ముఖ్యమని తెలిపాడు. లేదంటే ఎంత సంపాదించినా ఖర్చులకే సరిపోయాతని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోకు చూసిన నెటిజన్లు తరమదైన రీతిలో స్పందిచారు పక్కవారిని చూసి బతకడం మానేస్తే ఖర్చులు ఈజీగా తగ్గించుకోవచ్చుని ఒకరు కామెంట్ చేయగా.. మీ మాటలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను అని మరొకరు కామెంట్ చేశారు.

ఇదిగో వీడియో

View this post on Instagram

A post shared by AKSHAY CN (@bangalore_viral)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us