Seasonal Infections: వర్షాల టైంలో ఇన్ఫెక్షన్స్ రాకుండా జాగ్రత్తలు ఇలా..
ఈ వారంలో వర్షాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. వర్షాలు కురిసే సమయంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. వాన నీళ్లు చేరడం ద్వారా నీళ్లు కలుషితం అవుతాయి. దోమలు కూడా పెరుగుతాయి. కాబట్టి వర్షాలు పడే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వర్షాల టైంలో ఎలాంటి సమస్యలు వస్తాయంటే..

రోజులు సాఫీగా సాగిపోతున్నపుడు మధ్యలో ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తే.. చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. రోజువారి పనులు, తినే ఆహారం, చేసే వ్యాయామంలో ఎలాంటి మార్పు ఉండదు. అయినా ఉన్నట్టుండి ఏదో ఒక అనారోగ్య సమస్య వచ్చి పడుతుంది. ఇలా సడన్‌గా వచ్చే వ్యాధులకు కారణం సీజన్ చేంజ్. ఒక సీజన్ అయిపోయి మరో సీజన్ వచ్చేటపుడు వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వ్యాధులు త్వరగా వ్యాపిస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో ఎలాంటి సమస్యలు వస్తాయి? వాటికై ఎలాంటి కేర్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
డెంగ్యూ ఫీవర్
డెంగ్యూ ఫీవర్.. దోమ కుట్టడం వల్ల వస్తుంది. వానలు వచ్చేటప్పుడు ఈ దోమలు బాగా పెరుగుతాయి. డెంగ్యు జ్వరానికి వ్యాక్సిన్ లేదు. కాబట్టి ఈ జ్వరం రాకుండా ఉండాలంటే, దోమలకు దూరంగా ఉండాలి. ఇంటి పరిసరాల్లో దోమలు లేకుండా జాగ్రత్తపడాలి. రెండు రోజులకు మించి జ్వరం ఉంటే వెంటనే డాక్టర్ ను కలవాలి.
టైఫాయిడ్
వానాకాలంలో ఎక్కువగా వచ్చే మరో ఫీవర్ టైఫాయిడ్. కలుషితమైన ఆహారం, నీళ్లు ద్వారా ఇది వ్యాపిస్తుంది. జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి వంటివి ఈ జ్వరం లక్షణాలు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను కలవాలి. టైఫాయిడ్ రాకుండా ఉండాలంటే చేతులను శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పరిసరాలను క్లీన్ గా ఉంచుకోవాలి. కూరగాయలు ఆకుకూరలను వెచ్చని నీటిలో కడిగాక వండుకోవాలి.
ఇన్‌ఫెక్షన్లు
ఇకపోతే వర్షాల టైంలో కళ్లు, చర్మ ఇన్ఫెక్షన్లు కూడా వస్తాయి. కళ్లు, చర్మంపై మంట, దురద లేదా వాచినట్టు కనిపిస్తే డాక్టర్‌ని కలవడం మంచిది. ఇలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండేందుకు వర్షంలో తడవకుండా చూసుకోవాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




